చౌద్వీఁ క చాంద్ హో - ఇందుబిమ్బమండునా
చౌద్వీఁ క చాంద్ హో https://ajaraamarasukthi.blogspot.com/2025/09/blog-post.html చౌద్వీఁ క చాంద్ హొ అన్న ఈ పాట లొ సూర్య చంద్రులు వున్నారు. అంటే వారున్నంతకాలము ఈ పాట భూతలము పై వుండితీరుతుంది. ఈ పాట ' చౌద్వీఁ క చాంద్ ' సినిమా లొనిదే. దీనిని నిర్మించిన వ్యక్తి గురు దత్. ఆ కాలములో ఆయన పేరు వినని వారు ఆయన సినిమాలు చూడనివారు వుండరు. ఆయన అసలు పేరు తెలిసినవారు అరుదు. ఆయన అసలు పేరు వసంతకుమార్ శివశంకర్ పదుకొనే . ( 9 జులై 1925 - 10 అక్టోబర్ 1964 ) 1950-60 దశకములలో చలనచిత్ర కళాఖండములను నిర్మించిన వారిలో అగ్రగణ్యుడు. ఆయన నిర్మించిన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యము. ప్యాసా , కాగజ్ కె ఫూల్ , సాహబ్ బీబీ ఔర్ ఘులాం , చౌద్వీఁ క చాంద్ మకుటాయమానములు. ఇందులో కాగజ్ కె ఫూల్ పూర్తిగా మట్టి కరచిన చిత్రము. కానీ గొప్పదనమేమిటంటే ' ప్యాసా ' ' కాగజ్ కె ఫూల్ ' సినిమాలు greatest films of all time, గా Time magazine's "All-TIME" 100 best movies లో చేరినాయి. Sight & Sound critics' and directors' poll, లో ప్రపంచములోని అతి గొప్ప దర్శకులలో గురుదత్ స్థానము సంపా...