కాఫీనా టీ నా ఏది గొప్పది?
కాఫీనా టీ నా ఏది గొప్పది? https://ajaraamarasukthi.blogspot.com/2024/08/blog-post.html కర్మ సన్యాస యోగము (భగవద్గీత)యందు మొదటి శ్లోకము ఈ విధముగా ఉన్నది. సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ | తయోస్తు కర్మసన్యాసాత్కర్మయోగో విశిష్యతే ll శ్రీ కృష్ణుడు ఈవిధముగా అనుచున్నాడు:కర్మసన్యాసమూ , కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి. అయితే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది. అని కర్మ యోగపు విశిష్ఠతను గూర్చి వ్యాఖ్యానించుచునాడు ఒక సమూహమును ఉద్దేశించి. అంతలో పండితునికి టీ తెచ్చి ఇవ్వడం జరిగినది. అడి చవశశి ముందువరుసలోని ఒక శ్రోత ' స్వామీ టీ శ్రేష్టమా లేక కాఫీయా ?' అని ప్రశ్నించినాడు. అందుకు జవాబుగా ఆ పండితుడు పైశ్లోకమును అనుసరించుతూ ఈ విధముగా చెప్పినాడు: కాఫీ పానంతు టీపానం నిఃశ్రేయస్కరే ఉభేః l సయోస్తు కాఫికా పానాత్ టీ పానంతు విశిష్యతే ll కాఫీ టీ లు రెండూ ఉత్తెజకరమైవే గొప్పవే ! ఆ రెంటిలో టీ శ్రేష్ఠము అని అంటూ తనకు ఇచ్చిన టీ ని నెమ్మదిగా జుర్రుకొన్నాడు. స్వస్తి.