Posts

Showing posts with the label కాళీదాసు ఔదార్యం'

భోజనం దేహి...

  భోజనం దేహి ... https://ajaraamarasukthi.blogspot.com/2024/09/blog-post_13.html కాళీదాసుకు , భోజుని ఆస్థానానికి సబంధించినదే మరోచాటుశ్లోకం . ధారానగరమునకు దగ్గరలోని ఒక అగ్రహారములో పేదబ్రాహ్మణ దంపతులుంటారు .   తాను పెద్దకవినని బడాయి పోతూ వుంటాడు ఆబ్రాహ్మడు భార్యతో ! ఆమె వినివిని వేసారి ' పేదరికమునకు తోడుగా గంపెడు పిల్లలున్నారు కదా మనకు కుటుంబ పోషణతో సతమతమౌతున్నారుకదా ,   మీరెందుకు భోజునిఆస్థానమునకు పోయి మీకు తోచిన కవిత్వము ఏదయినా చెప్పి ఆయన వద్దనుండి బహుమతులను గ్రహించుక రాగూడదాఅంది . బ్రాహ్మడు బిక్కమోగమువేసినాడు కానీ ఎట్లయితే అట్లావుతుందని మేకపోతు గాంభీర్యమును ప్రదర్శిస్తూ భార్యతో " అలాగే " అన్నాడు . అతడు ధారానగరము చేరుసరికి సాయంకాలమైపోవుటతో నగరములోని ఒక సత్రములో బసచేసినా డతను . భోజనము ముగించుకొని సత్రములోని గుడ్డిదీపము ముందు కూర్చొని కవితా రచన చేయ మొదలు పెట్టినాడు . ఎట్టకేలకు , కట్టకడపటికి , తుట్టతుదకు , చిట్టచివరకుఒకపాదమువ్రాయగాలిగినాడు . అదికూడాఏమిటంటే “ భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం ...