Posts

Showing posts with the label ఆరోగ్యము అరోగ హేతువు.

ఆరోగ్యము

 ఆరోగ్యము  https://ajaraamarasukthi.blogspot.com/2024/01/blog-post_26.html పరచింతనమ్ము తోడుత పరిపాటిగ ధృడ శరీర పాలకుడౌచున్  ఆరోగ్య వంతుడగుచో అరమరికలు లేక  శివుని అండన చేరున్  వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం । ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ॥ వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యము. స్వాస్థ్యము సర్వార్థాలకి సాధనము. ఆరోగ్యం రెండు రకాలు. శారీరక ఆరోగ్యము. మానసిక ఆరోగ్యము.  మనిషి శరీరానికి ప్రతినిత్యము క్రమ శిక్షణతో కూడిన వ్యాయామము అత్యంత ఆవశ్యకము. నిత్య వ్యాయామము వలన శరీర భాగాలు అన్నిటీకీ సరియైన రక్త ప్రసరణము జరిగి శరీరమంతయూ అరోగ్యముతో తొణికిసలాడుతూ ఉంటుంది.  యోగము మరియూ నిశ్చల ధ్యానములాంటి ప్రక్రియల ద్వారా మానసిక ఆరోగ్యము చేకూరుతుంది. తద్వారా బుధ్ధి కుశలత పెరుగుతుంది. దీర్ఘ ఆయుర్దాయం చేకూరుతుంది. శరీర అవయవాలకి తగినంత బలం చేకూరుతుంది. నిరాశా నిస్పృహలను దరి జేరనీయదు.పైగా అది సుఖాన్ని కలుగజేస్తుంది.    ఆధునిక ప్రపంచములో జీవన సరళి మారిన దృష్ట్యా, సేంద్రియ వ్యవసాయమును మా...