కడప దేవుని గడప
కడప దేవుని గడప https://ajaraamarasukthi.blogspot.com/2025/07/kvbn-oats.htm దేశమంటే మట్టిరా ఆ మట్టియే మా తల్లీరా ఆ తల్లిపెరే కడపరా రా ఆ కడప శ్రీపతి గడపరా మనసు మల్లెల తోటరా మా మాట తేనెల ఊటరా మమత పూవుల బాటరా ఇది శౌర్యవంతుల కోటరా ఆదిశంకర స్థాపితంబౌ పీఠ మొకటే ఆంధ్రకంతకు పురాణాల ప్రసిద్ధిగాంచిన పుష్పగిరి ఆ ప్రాంతము మూడు నదులకు సంగమంబది హరియు హరునకు స్థావరం కడప సీమది కలిగియున్నది కనుల పందువు చేయుచున్నది నటులకిది పుట్టిల్లురా కవిశేఖరుల కాణాచిరా అన్నయ్య త్యాగయ శ్యామశాస్త్రి ని కన్న సీమిది చూడరా వాణి గళమున వాడిపోవని మల్లెమరువపు మాలరా జాతి కుట్మల స్తబకమై శ్రీ వాణి వేణిన నిలచెరా కడప రాయను పేరుతో మా నాపరాయి ప్రసిద్ధిరా నాడు బంగరు వజ్రముల్ గల గనులకిది కేంద్రమ్మురా అలపు ఖనిజాల వనరుల తల్లిరా ఘన భాగ్యజాలపు వల్లిరా మా సిమెంటుల ఫాక్టరీలు మా బెరైటీస్ ఆస్బెస్టాస్ ఖనిజ వరతరు భూమీరా మా ఉక్కుగుండెకు గుర్తురా చలన చిత్రపు మహారథులగు KV,BN, నాగిరెడ్లు కడప జిల్లా వాస...