కడప దేవుని గడప

 కడప దేవుని గడప 

https://ajaraamarasukthi.blogspot.com/2025/07/kvbn-oats.html

దేశమంటే మట్టిరా 

ఆ మట్టియే మా తల్లీరా 

ఆ తల్లిపెరే కడపరా రా 

ఆ కడప శ్రీపతి గడపరా 

మనసు మల్లెల తోటరా 

మా మాట తేనెల ఊటరా 

మమతా పూవుల బాటరా 

ఇది శౌర్యవంతుల కోటరా 

ఆదిశంకర స్థాపితంబౌ 

పీఠ మొకటే ఆంధ్రకంతకు 

పురాణాల ప్రసిద్ధిగాంచిన

పుష్పగిరి ఆ ప్రాంతము 

మూడు నదులకు సంగమము అది 

హరియు హరునకు స్థావరంబది 

కడప సీమది కలిగియున్నది  

నటులకిది పుట్టిల్లురా 

కవిశేఖరుల కాణాచిరా 

అన్నయ్య త్యాగయ్య 

శ్యామశాస్త్రుల కన్న సీమయె కడపరా 

వాణి గళమున వాడిపోవని 

మల్లెమరువపు  మాలరా 

జాతి కుట్మల స్తబకమై  

శ్రీ  వాణి వేణిన నిలచేరా 

కడప రాయను పేరుతో మా 

నాపరాయి ప్రసిద్ధిరా 

నాడు బంగరు వజ్రముల్ గల 

గనులకిది కేంద్రమ్మురా 

ఖనిజాల వనరుల తల్లీరా 


మా సిమెంటుల ఫాక్టర

మా బెరైటీస్ ఆస్బెస్టాస్ 

ఖనిజ కల్పక భూజములురా 

మా ఉక్కు గుండెను చాటురా 

చలన చిత్రపు మహారథులగు 

KV,BN, నాగిరెడ్లు 

కడప జిల్లా వాసులేరా 

సాటి వారికి లేరులేరా 

నిర్మాత దర్శక నటవిరాట్టుల

నిరుపమానపు గడ్డారా 

ఏషియాలో పెద్ద స్టూడియొ 

కట్టె  కడపకు బిడ్డరా 


సుమతి బద్దెన వేమన 

చౌడప్ప గువ్వల చెన్నడు 

ఖ్యాతిచెందిన శతక కర్తలు 

తెలుగు బాసకు బావుటాలు 

కడప సీమన పావురాలు 

తెలుగు వెల్గుల ఉదయభానుడు 

బ్రౌను దొర మా కల్కటేరు  అల్లకు 

ఆంధ్రులకు తా శబ్దకోశము 

అందిఇచ్చిన పుణ్య పురుషుడు 

తమలపాకులు దోస పళ్లకు 

రుచులు నేర్పెను కడపరా 

అవి స్వర్గమును తలపించురా 

కోడూరు చీనీ నారుణకు

ఈ లోకమే తలయొగ్గురా

మా కొర్రలారీక జొన్న సజ్జలు

Oatsకన్నా మిన్నరా 

రెడ్ల కమ్మల పాలనమ్మున 

బలిజ వారల రక్షణందున 

వైశ్య వర్గపు వితరణమ్మున 

సాటిలేనిది కడపరా 

చెడుగానే కుబుసమ్ము గల్గిన 

స్వార్థపూరిత శాంతిదూతలు 

కడపకవచ్చిన ముప్పురా 

మా రాతనది ఎటు తప్పురా 

కల్మషమ్మును కల్గినా అది 

నిర్మలమ్మగు గంగరా 

కదపరా అది కడపరా 

కడప దేవుని గడపరా 


చెరుకు రామ మోహన్ రావు. 

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి