వేదాంత అధ్యయనము-అర్హత
వేదాంత అధ్యయనము-అర్హత https://ajaraamarasukthi.blogspot.com/2024/12/36.html ( శృంగేరి శారదా పీఠం 36 వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహ భాషణమును నేను ఆకళింపు చేసుకున్న రీతిలో నా మనోభావన మీ ముందు ఉంచుచున్నాను.) భరత ఖండమునందు వేదాంత ధోరణిలో మాట్లాడని వారు లేరు , అది పండితుడే కానీ పామరుడేకానీ. కానీ వేదాంతమునభ్యసించి సాధించినవారు సకృత్తు. ఇక వేదాంత ఉపన్యాసాలు చేయుటలో ఎంతోమంది పందితులనబడేవారు utube లో మనకు పుంఖానుపుంఖాలుగా అగుపించుతూనే ఉంటారు. ఆవిధముగా తమ వాగ్విలసనముతో ప్రభుత్వము ఒసంగు పదములను శిరౌర్యముగనెంధాచి, వద్దంటూనే గ్రహించే వాళ్ళూ ఉంటారు. ఇది ఒక వర్గమైతే కీర్తి కండూతి లేని మహా పండితులూ లేకపోలేదు. కానీ సాధకులు కనిపించరు. ఇక నా విషయమునకు వస్తే : జ్ఞానము లేదు సుంతయును జ్ఞాత్వము పొందగ శక్తిలేదు నా స్థానము మూర్ఖచిత్తతతి సంగతి యందున గల్గు గాంచగా ఐనను స్వామి పాదముల నాత్మ దలంచి తలొంచి శ్రద్ధతో భానుని బోలె నాగురువు భాసము గూర్చగ వ్రాయ బూనితిన్ అనేకమంది అనేక పండితులద్వారా వేదాంతం వింటూనే ఉన్నారు. ఉపనిషత్తులలో , బ్రహ్మసూత్రములలో , భగవద్గీతల...