Posts

Showing posts with the label సనాతనధర్మమును గూర్చి తెలుసుకొనుట మనధర్మము. మరువవద్దు.

వేదము - పంచమవేదము – నిర్వేదము (ఉపోద్ఘాతము)

   వేదము - పంచమవేదము – నిర్వేదము   https://ajaraamarasukthi.blogspot.com/2024/12/blog-post.html వేదము - పంచమవేదము – నిర్వేదము (ఉపోద్ఘాతము) ఎంతో నిర్వేదముతో ఈ మాట వ్రాస్తూవున్నాను. మరీ ఈ మధ్యకాలములో కొందరు మేధావులు అనుకొనేవారు రామాయణ భారతాది  ఇతిహాసములను కనీసము వచన రూపములోనైనా చదువక ,  వినక ,  అన్నీ తమకే  తెలుసునన్న గుర్తింపు పొందుటకై తోచినది ఆస్య గ్రంధి లో వ్రాస్తూవున్నారు ,  ముఖ్యముగా శ్రీకృష్ణుడు మొదలగు దేవతా మూర్తులపై. వారి మాటలు ,  కాకతాళీయముగా చదువవలసి వచ్చి మనసారా బాధపడినాను. శ్రీ కృష్ణుడు  పరమాత్మ.  అందు సందేహమే అక్కర లేదు. ఆయనది జన్మ కాదు అవతరణము. ఇక  ధర్మరాజు ను గూర్చి ఒక మాట. మనకు భారతములో భీముడు  ,  అర్జనుడు అంటే  మక్కువ ఎక్కువ. వారు ఎన్నెన్నో వీర విన్యాసములు చేసినారు కావున. కానీ ధర్మరాజు  ఎంతటి ధర్మ మూర్తి అన్న విషయమును కొంత క్లుప్తముగా ,  రెండు మూడు  సందర్భములను తీసుకొని ,  మీ ముందుంచ ప్రయత్నము చేసినాను. ఇటువంటివి మీరు చదివితే మీ పిల్లలకు చెప్పి వారిని రుజుమార్గములో ఉంచగలరు. ...