చూర్ణం--తూర్ణం https://ajaraamarasukthi.blogspot.com/2024/09/blog-post.html ఇది ఒక చాటువు. కాళీదాసు కాలముదా కాదా అన్న తర్కము లేకుండా చది ఆనందించవచ్చు. ఆ కాలములో కార్ష పణాలు వుండియుండ వచ్చు గానీ అణాలు వుండియుండవేమొ అని నా అనుమానము. ఆ కాలము తాబూల సేవనము తప్పనిసరి. ఎందుకంటే తాంబూలము ఆరోగ్యప్రదము. గుట్క , జరదా , తంబాకు తాంబూలము కాదు సుమా! ఒక రోజు సాయంకాలము బజారులో నడుస్తూవుంటే మహకవి పండితులైన దండి కాళిదాసులకు ఒక తాంబూలము కొట్టులోని బహుశ యజమానురాలేమో , బహు సుందరముగా కనిపించింది. అంతే ఇద్దరూ ఆ కొట్టు వద్దకువేళ్ళినారు. దండి ఆ అందమైన అమ్మాయిని కాళిదాసుకన్నా ముందు పలుకరించవలెనను ఉద్దేస్యముతో ఆశువుగా ఒక శ్లోకములోని మొదటి పాదము ఈ విధముగా చెప్పినాడు. " తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే" ( ఓ పూర్ణ చంద్రుడిలాంటి ముఖం గల చిన్నదానా! త్వరగా సున్నం ఇప్పించు అని , ఇందొలో మనము గమనించితే మూడు ' ణా లు వస్తాయి. పలుకునపుడు మనము ' ణ" ను ' అణా గా పలుకుతాము.). వెంటనే కాళిదాసు " పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంత కీర్ణ లోచనే" ( చెవుల వరకు వ్యాపించిన విశాల...
Posts
Showing posts with the label ఇది రసవత్తరమైన చాటుకత