Posts

Showing posts with the label పెద్దల మాట సద్ది

పెద్దల మాట

  పెద్దల మాట https://ajaraamarasukthi.blogspot.com/2024/09/blog-post_16.html ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగన్ధినా । వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా ॥ ఉద్యానవనమంతా అనేక రకాలైన చెట్లతో నిండియున్నప్పటికీ అందులో ఏదేని ఒక చెట్టు సుగంధ భరితమైన పుష్పాలతో విరబూసినచో, ఆ సుమనోహరమైన సువాసనలు వనమంతా వ్యాపించి ఆ పరిసర ప్రాంతమంతటినీ ఆహ్లాదపరచే వాతావరణాన్ని కలుగజేస్తుంది. ఇదే భావము కలిగిన ఈ వేమన పద్యము చూడండి. కులము లోన నొకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ! కులములో ఒక వ్యక్తి గుణవంతుడన్నట్లయితే ఆ కులమంతా అతనివలన గౌరవాన్నిపంచుకొంటుంది. వనములో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నప్పటికీ ఆ వనమంతా వాసన వెదజల్లుతుంది. తెలివితేటలు, సత్ప్రవర్తన, ధర్మ పరాయణత్వము, పరోపకార బుద్ధి కలిగిన సకల విద్యాపారంగతుడు అయినట్టి, సర్వలక్షణ శోభితుడైనట్టి సుపుత్రుడు కలిగినచో ఆ కుటుంబము అంతా ఎంతగా శోభించునో ఎంతగా వృద్ధి చెందునో, ఆ వంశానికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తాయో అదే విధముగా సుగంధ పరిమళ భరితమైన ఒక్క పుష్పించిన చెట్టు వలన వనమంతా ఆహ్లాద భరితమౌతుంది. ఆ వనములో...