జన్మాంతర వాసన లేక పునర్జన్మ వాస్తవము
జన్మాంతర వాసన లేక పునర్జన్మ వాస్తవము https://ajaraamarasukthi.blogspot.com/2024/01/blog-post_17.html పైన కనిపించు శీర్షిక ఒక జటిలమైన సందేహమునకు ఉదాహరణ పూర్వక సవివరణ సందేశము. ఒకసారి నడిచే దేవుడైన శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ యతీంద్రుల వారి వద్దకు ఒక విదేశీ వనితా వచ్చ్గినది. ఆమెలో గల హేళనతో కూడిన ఒక జిజ్ఞాస స్వామివారితో తీర్చుకొన దలచి ఈ విధముగా ప్రశ్నించినది:"స్వామీ! కర్మ ఫలము - పునర్జన్మ వృత్తాంతమును గూర్చి క్లుప్తముగా నాకు అర్ధమయ్యే రీతిలో తెలుప గలారా! స్వాముల వారు ఈ విధముగా ఆమె భాషలో బదులు ఇచ్చినారు"అమ్మా!ఒక సారి ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రసూతి గృహమునకు పోయి అచటి సిబ్బంది సహాయముతో ఒకేసమయమున జన్మించిన వివిధ శిశువుల గూర్చి తెలుసుకోనిరా!" అని ఆదేశించినారు. స్వాములవారు చెప్పిన రీతిగా ఆమె ఆచటికివెళ్లి తగిన విధముగా సమాచారమును సేకరించి స్వామీ వారివద్దకు చేరి ఈ విధముగా ఆమె భాషలో తెలిపినది.విన్నవించినది. " స్వామీ! ఒకే సమయములో అచట కొంతమంది శిశువులు జన్మించుట జరిగినది కానీ ఒకరితో ఒకరికి ఏమాత్రమూ పోలికలు లేవు. కొందరు భాగ్యవంతులు , కొందరు భాగ్య హీనులు , కొం...