జన్మాంతర వాసన లేక పునర్జన్మ వాస్తవము

 

జన్మాంతర వాసన లేక పునర్జన్మ వాస్తవము

 https://ajaraamarasukthi.blogspot.com/2024/01/blog-post_17.html

పైన కనిపించు శీర్షిక ఒక జటిలమైన సందేహమునకు ఉదాహరణ పూర్వక సవివరణ సందేశము.

 ఒకసారి నడిచే దేవుడైన శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ యతీంద్రుల వారి వద్దకు ఒక విదేశీ వనితా వచ్చ్గినది. ఆమెలో గల హేళనతో కూడిన ఒక జిజ్ఞాస స్వామివారితో తీర్చుకొన దలచి ఈ విధముగా ప్రశ్నించినది:"స్వామీ! కర్మ ఫలము - పునర్జన్మ వృత్తాంతమును గూర్చి క్లుప్తముగా నాకు అర్ధమయ్యే రీతిలో తెలుప గలారా!

స్వాముల వారు ఈ విధముగా ఆమె భాషలో బదులు ఇచ్చినారు"అమ్మా!ఒక సారి ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రసూతి గృహమునకు పోయి అచటి సిబ్బంది సహాయముతో ఒకేసమయమున జన్మించిన వివిధ శిశువుల గూర్చి తెలుసుకోనిరా!" అని ఆదేశించినారు.

స్వాములవారు చెప్పిన రీతిగా ఆమె ఆచటికివెళ్లి తగిన విధముగా సమాచారమును సేకరించి స్వామీ వారివద్దకు చేరి ఈ విధముగా ఆమె భాషలో తెలిపినది.విన్నవించినది. 

"స్వామీ! ఒకే సమయములో అచట కొంతమంది శిశువులు జన్మించుట జరిగినది కానీ ఒకరితో ఒకరికి ఏమాత్రమూ పోలికలు లేవు. కొందరు భాగ్యవంతులు, కొందరు భాగ్య హీనులు, కొందరు అవిటివారు కొందరు చెవిటి వారు,  కొందరిది మంచి రంగు కొందరిది కారు నలుపు, కొందరు కురూపులు కొందరు సురూపులు, ఈ విధముగా ఎన్నియో తేడాలతో ఆ శిశువులు జన్మించినారు. మీరు నన్నచాటికి పంపిన కారణము కూడా నాకు సంపూర్ణముగా అవగతమై పోయినది", అని తెల్పి మోకాళ్లపై వంగి నమస్కరించి శెలవు తీసుకొన్నది.

ఇప్పుడు  ఆమె అర్థము చేసుకొన్నా తీరును విమర్శించుకొందాము.తానూ గమనించిన శిశువులందరూ ఒకే సమయమున జన్మించినవారైనా ఒకరికొకరికి మధ్య అంతులేని వివక్షత. కారణము వారి కర్మఫలమే కదా!పునర్జన్మము ఉన్నందువలననే కదా వారు ఈ రీతిన జన్మించుట జరిగినది.

మహనీయులు ఎంత జటిలమైన సమస్యలకు కూడా ఎంత సులువుగా సమాదానమిస్తారో గమనించబడి. 

వారి పాద దోయికి నమస్కారములతో ,

స్వస్తి.

 

Comments

  1. జన్మాంతర కర్మ ఫలములను గురించి మహాస్వామి వారు
    చేసిన సందేహం నివృత్తి అద్భుతమైన రీతిలో ఉన్నదండీ. ఆయన చెప్పినట్లు మెటర్నిటీ ఆస్పత్రిలో ఒకే సమయంలో జన్మించిన వారు వివిధ స్థాయిల ఆర్ధిక స్తోమతలు గల తలిదండ్రులకు జన్మించడం,వివిధ రకాలైన అందాలతో,వివిధ అనాకారి తనాలతో జన్మించడం
    గత జన్మ కర్మ ఫలంగా స్వామి వారి వలన
    ఆమె తెలుసుకోవడం...పరమ సత్యానికి నిదర్శనం.
    చాలా గొప్ప సంఘటనను తెలిపారు. మీకు అనేక అభినందనలండీ 🌹🙏🙏🙏🌹

    ReplyDelete

Post a Comment