విఘ్నేశ్వర తత్వము
విఘ్నేశ్వర తత్వము https://ajaraamarasukthi.blogspot.com/2023/09/blog-post_9.html వ్యాసులవారు వేద విభజన చేసిన పిమ్మట పురాణములను రచించవలెనని తలంచి ప్రారంభించబోవ అడుగడుగునకు ఆటంకములెదురైనాయి. అపుడు ఆయన బ్రహ్మ చెంతకు వెళ్ళి కారణమడుగగా ' స్మరణంవా గణేశస్య ప్రారభే సర్వకార్యతః ' ఏదైనా కార్యం ప్రారంభినప్పుడు ముందుగా గణపతిని ఆరాదించవలసి యుండగా అది నీవు మరిచితివి అనిచెప్పగా , ఎవరీ గణపతి అన్న వ్యాసులవారి ప్రశ్నకు బదులుగా బ్రహ్మ ఈ విధముగా జవాబు తెలిపినారు: సప్తకోటి మహామంత్రా: గణేశస్యాగమే స్థితాః l ఓంకార రూపీ భగవాన్ బీజంచ గణనాయకః ll అలాగే , దేవతలు అమృతము కొరకు క్షీరసాగర మథనము చేస్తుండగా మధ్యలో పుట్టిన హాలాహలము ధాటికి తట్టుకోలేక దేవతలు రాక్షసులంతా శివుణ్ణి ఆశ్రయించగా , శివుడు ఈ విధముగా తెలిపినాడు: కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం l కార్యసిద్ధిం నతేషాంవై భవేతు భవతాం యథా ll అందుకే - కార్యము ప్రాపంచికమైనా పారమార్ధిక మైనా , ప్రధమంగా వినాయకుణ్ణి పూజించడం అన్నది ఆచారం. అట్టి సుముఖుని గూర్చి తెలుసుకొందాము. వినాయకుని 16 పేర్లు ఈ విధముగా చెప్పబడ...