Posts

Showing posts with the label శివ పుత్రుడు అందకాసురుని గూర్చి తెలుసుకోండి.

అంధకాసుర వథ

  అంధకాసుర వథ https://ajaraamarasukthi.blogspot.com/2025/01/2024.html ప్రకృతి నవవసంత మలయ మారుతీ భరితమై సురుచిర సౌందర్య మయమై దేవతలకే ఆ అపురూప ఆనందమనుభవింప ఉవ్విళ్ళూరజేయుచున్న, మందరగిరిపై విహారం చేయ పార్వతి పరమేశ్వరులు   సంకల్పించి అక్కడ విహరిస్తూండగా , శివుడు మహానందపరవశుడై తూర్పు దిక్కు చూస్తూ నిలబడివుండినాడు. ఓ క్షణంపాటు మోహపరవశ అయిన పార్వతి వెనుక నుండి వెళ్లి చిలిపిగా , ఆయన కళ్లు మూసింది. దాంతో సమస్త లోకాలకూ చీకటి కమ్మినట్లయింది. హటాత్తుగా కమ్మిన ఆ అంధకారానికి పార్వతి కూడా నివ్వెరపోయింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యాందోళనల వల్ల , అరచేతుల్లో స్వేదం కమ్మింది. ఆ సమయంలో శివుని నేత్రాలు మూయబడి అంధకార సంఘటితమైనందున ' అంధకుడు ' అనే ఓ గ్రుడ్డి బాలకుడు ఆ సందర్భమున పరమేశ్వరునికి ఉద్భవించినాడు. ఇది ఇట్ల ఉంచితే, హిరణ్యాక్ష - హిరణ్య కశిపులనే ఇద్దరు సోదరులలోను , హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే మహావిష్ణు భక్తుడైన కొడుకు ఉదయించగా , హిరణ్యాక్షుడికి ఎంతకాలానికీ సంతానం కలుగకపోపోవుటచేత ఆతడు శివునికై తపమాచరించుచున్న తరుణంలో ఈ బాలకుడు జన్మించడం జరిగింది. చీకటి వల్ల అతడు గ్రుడ్డివానిగా పుట్టినా...