కులము
కులము https://ajaraamarasukthi.blogspot.com/2024/09/blog-post_23.html ఆస్య గ్రంధిలో విరివిగా కుల ప్రస్తాపన వచ్చి, ఎవరి అభిప్రాయము వారు తెలుపుచున్నా కూడా ఎక్కువమంది కులము వుందా కూడదు అన్న అభిప్రాయమును వ్యక్తము చేయుచున్నారు. ఈ విషయమై విస్తారముగా అసలు వర్ణము అన్న మాట వేదవేదాంత భగవద్గీతలలో మనము వింటాము. కులము కాదు. అసలు కులము అన్న మాట కూడా ఆంగ్ల శబ్దము CASTE కు సమానము కాదు. అది PORTUGUESE పదము. దాని అర్థమే వేరు. 'కులము' అన్న అంశమును గూర్చి 'సరసరస' అన్న నా వ్యాస సంపుటిలో విస్తారముగా వ్రాసినాను. MACAULAY మనదేశములో చిచ్చు పెట్టనంతవరకు ఈ దేశ వాసులలో తమ ధర్మము కాదు పై ఎంతో అవగాహన వుండేది. న్యూనత అన్న మాటకు ఎక్కడా తావు లేదు. సంస్క్రుతమును సంపూర్ణముగా మన స్మృతి పథము నుండి తొలగించి ఆంగ్లమును మన నెత్తినరుద్ధి భాషా దాస్యము, భావ దాస్యము, మానసిక దాస్యమును మనకు ఎంతగా కట్టబెట్టినాడంటే, మనమీద మనకే అసహ్యము వేసేటంత. ముఖ్యముగా 15, శతాబ్దముతో మొదలుపెట్టి దాదాపు 19వ శతాబ్దము వరక్లు పాశ్చాత్యులు చేసిన జ్ఞాన, గ్రంధచౌర్యము అంత ఇంత కాదు. ఆ జ్ఞానము తమదని నమ్మించి మనలను నిరంతర మానసిక రుగ్మతకు ...