కులము

 కులము

https://ajaraamarasukthi.blogspot.com/2024/09/blog-post_23.html
ఆస్య గ్రంధిలో విరివిగా కుల ప్రస్తాపన వచ్చి, ఎవరి అభిప్రాయము వారు తెలుపుచున్నా కూడా ఎక్కువమంది కులము వుందా కూడదు అన్న అభిప్రాయమును వ్యక్తము చేయుచున్నారు. ఈ విషయమై విస్తారముగా
అసలు వర్ణము అన్న మాట వేదవేదాంత భగవద్గీతలలో మనము వింటాము. కులము కాదు. అసలు కులము అన్న మాట కూడా ఆంగ్ల శబ్దము CASTE కు సమానము కాదు. అది PORTUGUESE పదము. దాని అర్థమే వేరు. 'కులము' అన్న అంశమును గూర్చి 'సరసరస' అన్న నా వ్యాస సంపుటిలో విస్తారముగా వ్రాసినాను.
MACAULAY మనదేశములో చిచ్చు పెట్టనంతవరకు ఈ దేశ వాసులలో తమ ధర్మము కాదు పై ఎంతో అవగాహన వుండేది. న్యూనత అన్న మాటకు ఎక్కడా తావు లేదు. సంస్క్రుతమును సంపూర్ణముగా మన స్మృతి పథము నుండి తొలగించి ఆంగ్లమును మన నెత్తినరుద్ధి భాషా దాస్యము, భావ దాస్యము, మానసిక దాస్యమును మనకు ఎంతగా కట్టబెట్టినాడంటే, మనమీద మనకే అసహ్యము వేసేటంత.
ముఖ్యముగా 15, శతాబ్దముతో మొదలుపెట్టి దాదాపు 19వ శతాబ్దము వరక్లు పాశ్చాత్యులు చేసిన జ్ఞాన, గ్రంధచౌర్యము అంత ఇంత కాదు. ఆ జ్ఞానము తమదని నమ్మించి మనలను నిరంతర మానసిక రుగ్మతకు గురిచేసినారు.
ఆళ్వారులు, నాయనారులు వైష్ణవ మరియు శివ భక్తులు. వారిలో ఎక్కువగా బ్రాహ్మణేతరులు, పంచములు వున్నారు. వారి విగ్రహ ప్రతిష్ఠలున్న దేవాలయములలో ధూపదీప నైవేద్యములను ఆచరించేది రోజూ బ్రాహ్మణుడే! భక్తికి, దైవత్వమునకు తరతమ భేదములు లేవు. బ్రాహ్మలకు వేదము నిర్దేశించినది నిస్వార్థ సంఘ సేవ. ఇది కూడా పాశ్చాత్యుల మాయలోపడి ధర్మాన్ని మంటగలిపినాము
శూద్రులుగా భావించే 'రాజులు, రెడ్లు, కమ్మలు, కాపులు' అందరూ రాజ్యములను ఏలిన వారే! క్షాత్రముంటేనే కదా రాజులయ్యేది. 'నా విష్ణుః పృథివీ పతిః' అన్నది శాస్త్ర వచనము. అప్పుడు వారు బ్రాహ్మలచే కూడా అరాధ్యులేకదా. ఇక వైశ్యుల విషయానికొస్తే వానిజయమే కాదు వ్యవసాయము కూడా వారిదేనని శాస్త్ర నిర్దేశము. రాజ్యాలు అంతరించిన తరువాత వ్యవసాయమును వారు రాజ్యములనేలిన వారికి అప్పగించి ఈ దేశపు ఆర్ధిక వ్యవస్థ చెదరకుండా కాపాడినారు.
ఇక శూద్రులు తమ కులవృత్తి చేసుకొంటూ భగవధ్యానము చేసుకోవచ్చు. వారు బ్రాహ్మలవలె మంత్రం సాధనాలు చేయనవసరము లేదు. మొల్ల, గోరా కుంభర్, భక్తనందనార్, తుకారాం అంతెందుకు స్వామి పరమహంస యోగానంద, బాలయోగి మొదలగువారు పరమాత్మను చేరినవారే తమ మనోబలముతో మరియు తమదయిన సాధన తో.
ఏవృత్తికావృత్తి పారంపర్యముగా అభ్యసించితే అందు తాము అప్రతిహతమగు నిష్ణాతులు కావచ్చు. ప్రపంచములో ఏదేశముకూడా కలుగనన్ని కళలు, కళల తో ముడిపడిన వృత్తి విద్యలు మనము కలిగియున్నాము. డిల్లీ మరియు కొల్లూరు లోని త్రుప్పు పట్టని ఉక్కు స్తంభాలు నిలిపినది వృత్తి విద్యా నిపుణులేకానీ పాశ్చాత్య Scientists కాదు (Science మరియు శాస్త్రము ఒకటి కాదు,)
మనము పెడ త్రోవ పట్టింపబడినాము.
ఉత్తిష్ఠత! జాగ్రత !ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా
నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతి
(Awake ! arise! stop not till the goal is reached. Path is as sharp as razor’s edge and hard to go by.) లేవండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి. ప్రస్థానం చేయవలసిన మార్గం దుర్గమమైంది. అయితే సంకల్ప బలం ఉన్న హృదయానికి సంభవం కానిది ఏముంది?
పెద్దలను తప్పుపట్టకండి. ఈ ధర్మము ఎంత సనాతనమో అంత అధునాతనము.
పెద్దల;అ గొప్పదనమును గూర్చి ఒక్కమాట చెప్పి ఈ వ్యాసమును ఇక్కడ ముగించుతాను. సున్నము రాయి, పోక చెట్టు, తమాలము తీగ. తగుపాళ్ళలో వీనిని మిశ్రణము చేసి మనము అనుదినము సేవించుట ఆరోగ్యదాయకము అని చెప్పుట వారికి ఏవిధముగా సాధ్యమయినదని యోచించినారా. యోచించి సమయము వృధా చేసుకొనేకంటే వారిని అనుసరించండి. అది చాలు మన భవితకు బంగారుబాట వేసుకొనుటకు.
స్వస్తి.
No photo description available.
All reactions:
Apaji Peri, Sudha Jandhyala and 16 others
4
11
Share

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి