విద్యారణ్యులు - విజయనగరము
విద్యారణ్యులు - విజయనగరము
https://ajaraamarasukthi.blogspot.com/2025/07/blog-post_18.html
విజయ నగర సామ్రాజ్య స్నిథాపకుడు మరియు
ప్రారంభదశ నిర్మాత ఒక
యతీశ్వరుడు. అంగబలము అర్థబలమునేకాక స్థలమహత్మ్యతను
గుర్తించి వానికి తన తపఃఫలమును జోడించి మూడు సముద్రముల మధ్య హైందవ సామ్రాజ్యమును స్థాపించిన
మహాతపస్వి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్యస్వామివారు.ఆ నగరమునకు చేసిన నామకరణము 'శ్రీ విద్యానగారము'. ఇది విద్యారణ్యుల వారు చేసినది. గురువుగారికి విధేయుడైన హరిహర రాయలు తదనంతర
కాలములో దీనిని 'విద్యానగారము'గా స్థిరపరచినారు. ఆ తరువాత కాలములో అనేక
విజయము లను ప్రోధి చేసుకొని అది 'విజయనగర సామ్రాజ్య'మై విస్తరిల్లినదిది.
నేను చారిత్రికుడను కాదు, పండితుడను అంతకన్నా కాదు. నాకు ఉన్నదల్లా దేశాభిమానము నా
పూర్వులపై కృతజ్ఞతా భావము. అదే నా చేత పై విషయమును క్లుప్తముగా వ్రాయించినది.
భక్తి శ్రద్ధలతో చదువుతారన్నది ఆశ.
విద్యారన్యులు - విజయనగర స్థాపన
విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ
చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావని మొత్తము తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన
ధర్మము,
సంస్కృతి, వేషభాష, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు
నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు
కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.
ఓరుగల్లును ప్రతాపరుద్రుడు పాలించే
కాలమున మంగళాపురం ప్రాంతమును సంగముడు అన్న రాజు పాలించేవాడు.గి హక్కబుక్క రాయలు
ఆయన కుమారులు. ఆయనకు మంత్రిగా మాయన అన్న వేదపండితుడుఉండేవాడు. ఆయన అర్దాంగి పేరు శ్రీమతి. వారికి మాధవ(సన్యాస నామము విద్యారణ్య) సాయనుడు (సన్యాస నామము భారతీ కృష్ణ తీర్థ)
తరువాత భోగానాథుడు అను మహా కవి జన్మించినాడు. పింగళ అనబడు అమ్మాయి కలిగినది. మాయన
గారి హటాన్మరణానంతరము ఆయన శ్రీమతి శ్రీమతియే
కుమారులకు ఆ ప్రాంతమునగల గొప్ప పండితులవద్ద విద్య నేర్పింప సాగినది. జరుగబోవు కథనములో భోగనాథ పింగళల ప్రస్తాపన మనకు
కనిపించదు. భోగనావిద్యారన్యులవారు తుడు గోప్పకవివరుడైనాడనియే
తెలుసును.అన్నదమ్ములిరువురూ ఉన్నత విద్యకై గురువుల అభిమతము మేరకు శృంగేరి
వెళ్ళినారు. విద్య పూర్తి చేసుకొని శృంగేరి 10వ గురువగు విద్యాతీర్తులవారివద్ద
సన్యాసమును స్వీకరించి తమ్ముడగు సాయనుడు భారతీ కృష్ణతీర్థ పేరుతొ 11వ శృంగేరి
పీఠాధిపతియైనాఋ. తమ్ముడు విద్యారన్యులవారు సన్యాస దీక్ష తీసుకొని శృంగేరి
సమీపమునగల హంపీ లోని క్క కొండ
శిఖరాగ్రముపై పర్ణశాల నిర్మించుకొని భువనేశ్వరీ దేవికై మ్లేచ్ఛుల పతనము హైందవ
సామ్రాజ్య స్థాపనకై తదేక దీక్షతో తపస్సు చేయసాగినాడు.
ఇక హక్కా
బుక్కల విషయానికొస్తే వారిరువురు ప్రతాపరుద్రులవారి వద్ద
కోశాధికారులుగా చేరినారు. మాలిక్కాఫర్
దండయాత్రతో ప్రతాపరుద్రులు ఓడింపబడి డిల్లీ కి బందీగా తీసుకొని పోవు సమయములో
ఆత్మార్పణము గావించుకొన్నారని చెబుతారు. అప్పుడు వారు అక్కడినుండి కాంపిలిని, ఆనెగొంది సంస్థానము, చేరుకొని తమ మేనమామ
రామనాథుని వద్దకుచేరి కొలువుచేయ సాగినారు. అప్పుడు డిల్లీ సుల్తాను తుగ్లక్
కుమారుడు ఆప్రాంతము పై దండయాత్ర చేసి అనేక
సైన్యముతో బాటు హక్కా బుక్కలను కూడా బంధించి డిల్లీకి తరలిలింపజొచ్చినారు.
కొంతదూరము వెళ్ళినతరువాత వచ్చిన గాలికి సైన్యము చెల్లాచెదరు కాగా హక్క, బుక్కలిరువురు ఒక చెట్టుమాటున
దాగియుండి, వారిని నారు. పారిపోకుండా బందీలుగా నిలచిన వారి నిబద్ధతకు సంతసించి డిల్లీ చేరిన తరువాత
వారిని ముస్లీములుగా మార్చి తమవద్ద సముచిత పదవినిచ్చి ఉంచుకొన్నారు . అటుపిమ్మట
కంపిలికి తమచేత పంపబడిన ప్రతినిధి అరాచాకమును సృష్టించగా వానిని వెనుకకు
పిలుచుకొని ముస్లిములైన హక్కని బుక్కని పంపినాడు అప్పటి పాలకుడు తుగ్లక్.వారు
కంపిలి వెళ్లి అచట స్వాతంత్ర్యము కొరకు ఉరకలు వేయుచున్న యువతను చూసి వారిలో
ఉద్వేగము ఊర్ధ్వలోకములంట తగిన గురువుకై
పరిసర ప్రాం వెదకుచున్న సమయములో కొండలలో తపోధనులగు మునివర్యుల కొరకు
సమీపములోని కొండలలో అడవులలో వెదకుచున్నపుడు తమ ఆస్తానము లోని మహామంత్రి కుమారునిగా
గ్రహించి యతీన్ద్రునకు సాస్టాంగ ప్రణామము గావించి తమ స్థితి గతులను తెలిపి తమను
హైందవము స్వీకరింపజేయ వేడుకొని తమ హైందవ రాజ్య స్తాపనాభిలాషను వ్యక్తము చేసినారు.
అదే ఆలోచనతో తపస్సు చేయుచున్న విద్యారన్యులవారు. వారి సామర్థ్యమును పరిశీలించి
వారిని యోగ్యుఉగా నెంచి హైందవము లోనికి వేదయుక్తముగా మార్చి రాబోవు హైందవ
సామ్రాజ్య అధిపతులుగా మంత్రపూర్వకముగా అన్నయైన
హక్కను హరిహర రాయలుగా పేరు మార్చి బుక్కను సైన్యాధ్యక్షుని గావించి వారిని
పంపి రాజధాని స్థాపనాభిరతుడై భువనేశారీ దేవి గూర్చి తీక్ష్ణతపమాచరింప
ప్రారంభించినారు. విద్యారణ్యులవారి తపస్సుకు మెచ్చి తల్లి కనక వర్షము
కురిపించినది. హరిహర బుక్కలను పిలువనంపి తిథి నిర్ణయించి సకల వస్తు సంభారములను సిద్ధము
చేసుకొని ఆదినము ప్రాతఃకాలమున సిద్ధమిగా ఉంటే ముహుర్తమును నక్షత్ర చారమునుబట్టి
తను కొండపై నుండి శంఖము ఊదినపుడు రాజప్రాసాదమునకు శంఖుస్థాపన చేయమన్నాడు. ‘తానొకటి
తలిస్తే దైవమొకటి తలుస్తుంది’ అన్ననానుడి ప్రకారము జంగమదేవర ఎవరో ముహుర్తసమయమునకు
కొంచెము మిందే ఎక్కడో శంఖమునూదినాడు. ఆ శబ్దము కొండను చేరలేదు కానీ శంఖుస్థాపనా
స్థలమును చేరినది. వారు పూజ చేయు సమయములో కొండపైనుండి శంఖస్వరము వినిపించినది. మూజ
ముగించి వారు యతీంద్రుల వద్దకుపోయి విషయము తెల\ల్పగా నేను పెట్టిన ముహూర్తమునకు
మీరు పూజ ప్రారంభించి యుంటే మీరాజ్యము ఒక వెయ్యి సంవత్సరములు నిలిచి యుండెడిది.
ఇప్పుడు ఇంచుమించు ఒక ౩౫౦ సంవత్సరములు మాత్రమే నిల్చునని చెప్పి ఆశీర్వదించి
పంపినారు. ఆయన 120 సంవత్సరముల పూర్ణ ఆయుర్దాయనును కలిగి ఆ రాజవంశమును తన
సహయోగామును అందించినారు.
తదనంతర
కాలములో విద్యారణ్య తీర్థులవారు శృంగేరి శారదా
పీఠం యొక్క 12వ జగద్గురువు అయినారు. . 1374–1386 వరకు వారు పీఠాధిపతిగా ఉన్న కాలము.
మిగిలినది 2వ భాగములో .........
2వ భాగము
అద్వైత వేదాంతానికి ముఖ్యమైన గ్రంథమైన
హిందూ తత్వశాస్త్రం మరియు పంచదశి
సర్వదర్శనసంగ్రహ రచయితగా మాధవాచార్యులవారు అనగా విద్యారణ్య యతీశ్వరులు తాత్వికప్రపంచములో
అత్యంత ప్రసిద్ధి చెందినారు . విద్యారణ్యులవారు 1336లో విజయనగర సామ్రాజ్య స్థాపనకు సహాయపడినారు. ఆ రాజ్యమును పాలించిన
మూడు తరాల రాజులకు గురువు మరియు మార్గదర్శిగా వారు వ్యవహరించినారు.
శృంగేరిలోని విద్యాశంకర ఆలయమును విద్యారణ్య గురుదేవుల శిష్యుడు మరియు విజయనగరపు రెండవ మహారాజయిన బుక్కరాయలు విద్యారణ్యుల వారి గురువులు మరియు
సన్యాసదీక్ష నిచ్చిన మహానుభావులు అయిన
విద్యాతీర్థులవారి సమాధిపై శివలింగ ప్రతిష్ఠాపన చేయించి దేవాలయమును
నిర్మింప జేయించినారు. ఈ ఆలయమున 12 స్తంభములు గలవు. ఇవి 12 రాశులకు ప్రతీకలు.
సూర్యుడు ఏరాశిన ఉంటాడో ఎండ ఆరాశి స్తంభముపై మాత్రమే పడుతుంది. ఈ ఆలయమును
కట్టించిన మహాశిల్పి ‘అమర శిల్పి జక్కన’.
బేలూరు హలేబేడు దేవాలయాల నిర్మాత కూడా ఆయనే! ఈ ఆలయము భారత పురావస్తు శాఖ వారి సర్వేక్షణ
లో ఉన్నది.
శృంగేరి మఠ శాసనముల ప్రకారము , విద్యారణ్యులు 1331 లో మఠాధిపతిగా నియమితులైనారు . సుమారు 1374–1380 నుండి 1386 AD వరకు శృంగేరి శారద పీఠాధిపతి గా ఉండినారు.
విద్యారణ్యులు సన్యాసము స్వీకరించే ముందు మాధవ అనే పేరుతో
పిలువబడు చున్నట్లు ముందుగానే
తెలియజేసినాను. వీరు వ్రాసిన అనేక గ్రంథములలో సర్వదర్శనసంగ్రహము
మరియు శంకర దిగ్విజయము కూడా ఉన్నవి అని
తెలియవచ్చుచున్నది.
శృంగేరి వృత్తాంతాల ప్రకారం, విద్యారణ్యులవారు భారతీ కృష్ణ తీర్థులవారికి అన్నయ్య. తమ్ములుంగారే ఆయన కంటే ముందు శృంగేరి పీఠాధిపతి అయి
ఉండినారు. విద్యారణ్యులవారు అనేక గ్రంథాలను రచించినారని గానీ లేదా ఆ రచనలకు సహకరించినారగానీ చెప్పవచ్చును. కొన్ని వర్గాలు
విద్యారణ్యులు మరియు భారతి తీర్థులు ఒకే వ్యక్తి అని వాదిస్తున్నాయి. అయినప్పటికీ
శృంగేరి రికార్డులు వారిని ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా స్పష్టంగా గుర్తించినాయి.
13వ శతాబ్దము
చివరి నాటికి మహమ్మదీయ దండయాత్రలను
తిప్పికొట్టడానికి దక్షిణ శక్తులు చేసిన ప్రయత్నాల పరాకాష్టకు చేరుకొంది. దక్షిణ
భారతదేశంలోని హిందూ విజయనగర సామ్రాజ్య (1336–1646) స్థాపనలో విద్యారణ్యులవారు విశేషమైన పాత్ర
పోషించినారు అన్న విషయమును సవిస్తారముగా ముందే తెలుయజేసినాను.
3వ భాగము మరోమారు ..........
3వ భాగము
హొయసలులు , కాకతీయులు మరియు యాదవ హిందూ రాజ్యాలకు వారసునిగా సంప్రదాయం ప్రకారము, విద్యారణ్యుడు
దక్షిణ భారతదేశంపై ముస్లిం దండయాత్రను ఎదుర్కోవడానికి సామ్రాజ్య స్థాపకులుగా హరిహరరాయ మరియు బుక్కరాయులకు మద్దతు మరియు , ప్రేరణ ఇచ్చి పెద్ద వాడైన హరిహరుని రాజుగా ప్రకటించి
ప్రతిష్ఠించినారు. విజయనగర సామ్రాజ్య యొక్క మొదటి రాజు హరిహరరాయలకు ప్రధానమంత్రిత్వమును
నేరపినారు. తరువాత బుక్కరాయలకు
కూడా ప్రధానమంత్రిగా ఉండినారు.
హరిహర రాయలనే దేవరాయలని కూడా అంటారు.
అతడే విజయనగర సామ్రాజ్యానికి తొలి చక్రవర్తి. ముస్లిమ్ చరిత్రకారుడు బర్ని
ప్రకారము బుక్కరాయలు ముసునూరి కాపనీడు బంధువు. కాని ఇది సబబుగా తోచదు. దక్కను
ప్రాంతంలోని ముస్లిమ్ సామంతుల తిరుగుబాట్ల వల్ల ముహమ్మద్ బిన్ తుగ్లక్ పాలన
అంతమవడంతో హరిహరరాయలు ఏలుబడిలోని ప్రాంతం త్వరితంగా విస్తరించింది. విజయనగర
రాజధాని 1340 ప్రాంతంలో ఆనెగొందికి ఎదురుగా తుంగభద్రానదికి ఆవలి తీరాన
స్థాపించబడింది. హరిహరరాయల తర్వాత 1343 లో అధికారంలోకి వచ్చిన బుక్కరాయలు 1379 వరకు పాలించాడు. అతడి పాలనా కాలం చివరకొచ్చేసరికి దక్షిణభారత దేశంలో
తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపుగా అతడి ఏలుబడిలోకి వచ్చింది.
తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా
ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ
కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా
ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొని
ఒక బలీయమైన శక్తిగా నిలబడింది.
విజయనగర రాజులకు సామంతులుగా
కమ్మరాజులు అయిన పెమ్మసాని నాయకులు, సూర్యదేవర
నాయకులు,
శాయపనేని నాయకులు, రావెళ్ళ
నాయకులు ఆంధ్రదేశాన్ని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా
ఉంటూ యుద్ధాల్లో తోడ్పడుతూ విజయనగర రక్షణ కవచంలా వారు ఎదురు నిలిచారు.
1510 ప్రాంతాల్లో బిజాపూరు సుల్తాను
అధీనంలో ఉన్న గోవాను పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. ఇది బహుశా విజయనగర
రాజ్యపు అనుమతి లేదా రహస్య అవగాహన ద్వారా జరిగి ఉండవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న
వ్యాపార సంబంధాలు వీరికి చాలా ముఖ్యమైనవి.
శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ
సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల
ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు.
సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార
రామాలయం,
కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ
మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.
1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. 1542 లో అళియ రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను
అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని దక్కను సుల్తానులు
చిత్తుగా ఓడించారు. సంయుక్త సుల్తాను సైన్యం రాజధానిని సర్వనాశనం చేసి, నేలమట్టం చేసింది. యుద్ధంనుండి సజీవముగా బయటపడిన రామరాయల
తమ్ముడు తిరుమలరాయలు, సదాశివరాయలతో సహా
పెనుగొండకు పారిపోయాడు. విద్యా, సాంస్కృతిక పరంగా
విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.
తళ్ళికోట యుద్ధానంతర దశను విజయనగర
సామ్రాజ్య పతనదశగా చెప్పుకోవచ్చు. 1565లో తళ్లికోట యుద్ధం జరిగి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా ఓటమిచెందిన
తర్వాత తిరుమల దేవరాయలు నామమాత్ర పరిపాలకుడైన సదాశివరాయలను తీసుకుని విజయనగర
ఖజానాను ఎత్తుకుని పెనుగొండకు పారిపోయారు. విజయనగరాన్ని పాదుషాలు నేలమట్టం చేసి
వదిలిపోయాక తిరుమల దేవరాయలు ఆ రాజధానిని బాగుచేసుకుని పరిపాలించేందుకు మూడేళ్ళపాటు
ప్రయత్నించారు. శ్మశానంలా తయారైన ఈ రాజధానిని తిరిగి ఏలుకోలేక పెనుగొండకు
తిరిగివచ్చారు. అంతటితో విజయనగర సామ్రాజ్యపు రాజధానిగా విజయనగరం ముగిసిపోయింది.
ఆపైన కొన్నేళ్ళు పెనుగొండ, మిగిలిన సంవత్సరాలు
చంద్రగిరిలను రాజధానులుగా చేసుకుని పాలించారు.
మిగిలినది 4వ భాగము(చివరి భాగముu)లో........
4వ భాగము
తళ్ళికోట ఓటమి తర్వాత రాజ్యభాగాలు
తగ్గిపోనారంభించాయి. తిరుమలదేవరాయలు తన ముగ్గురు కుమారులను మూడు ప్రాంతాలకు
ప్రతినిధులుగా పరిపాలింపజేశారు. పెద్దకుమారుడైన రామరాయలు కన్నడప్రాంతాలను
శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలించారు. రెండో కుమారుడు శ్రీరంగ దేవరాయలు పెనుగొండను
రాజధానిగా చేసుకుని తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. మూడో కుమారుడు వేంకటపతి
దేవరాయలు మొదట చంద్రగిరిని రాజధానిగా చేసుకుని తమిళ ప్రాంతాలు పాలించేవారు.
విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా శ్రీరంగదేవరాయలు తెలుగు ప్రాంతాల విషయంలో చాలా
ప్రయత్నాలు చేసి, వైభవాన్ని పునరుద్ధరించేందుకు
విఫలయత్నాలు చేశారు. బీజాపూరు సుల్తానులతో కొన్ని యుద్ధాల్లో గెలిచి, కొన్ని ఓడిపోయారు. ఆయనకు పుత్రసంతానం లేకపోవడంతో
చిన్నతమ్ముడు చంద్రగిరి పాలకుడు అయిన వేంకటపతి దేవరాయలకు రాజ్యాన్నిచ్చారు. ఆయన
పాలనకాలంలోనే బ్రిటీషు వారికి మద్రాసు పట్టణం ఏర్పాటు చేయటానికి భూమి మంజూరు
చేశారు. కొంతకాలం పాటు పెనుగొండను రాజధానిగా చేసుకుని అన్నగారు ఇచ్చిన
సామ్రాజ్యాన్ని పాలించినా ఆపైన మాత్రం రాజధానిని తన పట్టణమైన చంద్రగిరికే
మార్చుకున్నారు. ఆయన విజయనగర సామ్రాజ్యపు ఆఖరి గొప్ప చక్రవర్తిగా పేరొందారు. ఆయన
కాలంలో శ్రీరంగపట్నాన్ని ఒడయారు రాజులు స్వతంత్రం ప్రకటించుకున్నారు.
స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోకపోయినా కొందరు రాజులు స్వతంత్రించే వ్యవహరించేవారు.
విద్యారణ్యులవారు చ్ప్పినట్లుగానే 330
సంవత్సరములు అఖండముగా పాలింపబడి విజయనగర సామ్రాజ్యమనే, మూడు సముద్రాలలో యధేచ్ఛగా
పయనించిన మహానౌక ముక్కలు చేక్కలయిపోయినది.
స్వస్తి.
Comments
Post a Comment