గీత - అధీత
గీత - అధీత- 1వభాగము https://ajaraamarasukthi.blogspot.com/2024/12/1.html భగవంతుడు తన సందేశమును తన అంశజుడగు వేదవ్యాసుని ద్వారా తాను అర్జునునికి తెలిపిన వేదాంత సారమును మనపై మక్కువ ఎక్కువగా కలిగినవాడై తెలియజేసినాడు. ఇక్కడ ఒక్క విషయమును తెలుపవలసి వుంటుంది. కృష్ణ శబ్దమునకు అర్థము నలుపు అన్నది మనకందరకు తెలిసినదే! అదే విధముగా అర్జున శబ్దమునకు ఒక అర్థము తెలుపు. ఒక తమాషా అయిన విషయము ఏమిటంటే ఈ రెండూ రంగులు కాదు. మనము వానిని రంగులుగా భావించుకొంటున్నాము. ఏదయినా చీకటి అంటే నలుపు వదిల్తే తెలుపు లోనికి రావలసిందే! అదేవిధముగా వెలుగు అంటే తెలుపు వదిలితే నలుపును చేరవలసినదే! ఈ తెలుపు నలుపే జీవాత్మ పరమాత్మ. అర్జునునము అన్న పదమునకు కసవు , బంగారు అన్న రెండర్థాలు వున్నాయి. అర్జుని అనగా ఆవు అని ఒక అర్థము. ఇపుడు చూడండి , పరమాత్మ కశ్మల దూషితమగు మనసును తన గీతా బోధనచే సువర్ణము గావించినాడు. పేరు మారలేదు కానీ మనిషిలోని ప్రకృతి మారింది. ఇక అర్జుని అంటే ఆవు అని చెప్పుకొన్నాము.ఆవు పవిత్రతకు దైవత్వమునకు సంకేతమన్నది మనకు తెలిసిన విషయమే! అంటే నారాయణుడు తన గీతా బోధచే నరు...