గోమాత సకల శుభదాత
గోమాత సకల శుభదాత https://ajaraamarasukthi.blogspot.com/2023/10/l-ll.html గావౌ విశ్వస్య మాతరః -- వేదవాక్కు అదౌ మాతా గురుర్పత్ని బ్రహ్మాణి రాజపత్నిక l దేనుర్ధాత్రి తథా పృథ్వి సప్తైతాః మాతృ దేవతాఃll ధాత్రి = పెంపుడు తల్లి అసలు ఈ ఏడు మందిలో కన్నతల్లి, మిగత నలుగురు కన్నతల్లి లాంటివారు కాబట్టి ఈ ఐదుమంది మాత అన్న గొడుగు క్రిందికే వస్తారు. గోవు మాత. భూమి మాత. వీరిది మానవజన్మ కాకున్నా తల్లికన్న మిన్నయైన సేవ మానవాభ్యుదయమునకు చేస్తారు కాబట్టి వారిరువురు మానవులకు తల్లితో కూడి త్రి మాత్రుకలైనారు. వీరుకాక వీరిని కంటికి రెప్పలాగా చూసుకొనే పరాశక్తి అంటే లోకమాత కూడా చతుర్థ మాతృకగా పరిఢవిల్లినది. ధేనునాం కామ దేనుకాః (భగవద్గేత 10-28) ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. గవో మేచాగ్రతో నిత్యం! గావః పృష్టత ఏవచ! గావో మే హృదయేచైవ! గవాం మధ్యే వసామ్యహం! భావముః గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక (స్కాంద పురాణాంతర్గతము). 'ఆ గావో అద్మన్నుత భద్రమగ్రన్ ' అని శ్రుతి గోవులను ఆహ్వానించుతూ మీరు మీ దూడలతో మా ఇళ్ళముందు తిరుగాడుచుండండి అని తెలుపుచున...