భోజనం దేహి...
భోజనం దేహి...
https://ajaraamarasukthi.blogspot.com/2024/09/blog-post_13.html
కాళీదాసుకు,
భోజుని ఆస్థానానికి సబంధించినదే మరోచాటుశ్లోకం. ధారానగరమునకు దగ్గరలోని ఒక అగ్రహారములో పేదబ్రాహ్మణ దంపతులుంటారు. తాను పెద్దకవినని బడాయి పోతూ వుంటాడు ఆబ్రాహ్మడు భార్యతో! ఆమె వినివిని వేసారి 'పేదరికమునకు తోడుగా గంపెడు పిల్లలున్నారు కదా మనకు కుటుంబ పోషణతో సతమతమౌతున్నారుకదా, మీరెందుకు భోజునిఆస్థానమునకు పోయి మీకు తోచిన కవిత్వము ఏదయినా చెప్పి ఆయన వద్దనుండి బహుమతులను గ్రహించుక రాగూడదాఅంది. బ్రాహ్మడు బిక్కమోగమువేసినాడు కానీ ఎట్లయితే అట్లావుతుందని మేకపోతు గాంభీర్యమును ప్రదర్శిస్తూ భార్యతో "అలాగే" అన్నాడు.అతడు ధారానగరము చేరుసరికి సాయంకాలమైపోవుటతో నగరములోని ఒక సత్రములో బసచేసినా డతను.
భోజనము ముగించుకొని సత్రములోని గుడ్డిదీపము ముందు కూర్చొని కవితా రచన చేయ మొదలు పెట్టినాడు. ఎట్టకేలకు,
కట్టకడపటికి, తుట్టతుదకు, చిట్టచివరకుఒకపాదమువ్రాయగాలిగినాడు. అదికూడాఏమిటంటే
“ భోజనం దేహి రాజేంద్రా ఘృత సూప సమన్వితం" అని. అంటే రాజా నాకు పప్పు నెయ్యితో కూడిన అన్నము పెట్టించమన్నాడు. దానివల్ల ఆబ్రాహ్మణుడు ఈక్రింది శ్లోకాన్ని రుజువుచేసినాడు.
అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః
నమస్కార ప్రియో సూర్యః బ్రాహ్మణో భోజనప్రియః
అర్థము నేను విశదపరచ నక్కర లేదు. తరువాత వ్రాయుటకు చేతగాక ఆ తాళపత్రమును తలక్రింద పెట్టుకొని నిద్రకు ఉపక్రమించినాడు.
ఆ కాలములో రాజు మారువేషములో పరాయి వూర్లనుడి శత్రుదేశపు గూఢచారు లేవరైనా దేశములో ప్రవేశించినారా అని ముఖ్యముగా సత్రములు చావిళ్ళు చూసేవారు. ఆ రోజు రాజుతోబాతూ కాళీదాసు కుడా వున్నాడు. రాజు గమనించకుండా ముందుకు సాగినాడు కానీ కాళీదాసు బ్రాహ్మణుని తలక్రింద గాలికి రెపరెపలాడే తాళ పత్రమును చూసి అందులో ఏమి వ్రాయబడి ఉన్నదో అన్న సంశాయముతో మీలాగా అచ్చోటికి వెళ్లి ఆ తాలపత్రమును దీసి చదివినాడు. కాలీదాసుకు బ్రాహ్మణి బాధ అర్థమైనది.
ఆతను వెంటనే "మాహిషంచ శరశ్చంద్రః చంద్రికా ధవళం దధి” అనగా శరదృతువులోని పండువెన్నెల ధవళ కాంతితో నొప్పారె బర్రె పెరుగుతో కూడిన డై వుంటే మిక్కిలిసంతోషమని పూర్తిచేసి ఆ బ్రాహ్మణుని తలక్రింద పెట్టి తన దారిన రాజుతో గూడా చక్కగా వెళ్ళిపొయినాడు.
తెల్లవారి లేచి తన స్త్నాన సంధ్యాడులను ముగించుకొని తాళపత్రమును చూస్తె అది పూర్తీ చేయబడివుంది. సంతోషముతో ఎగిరి గంతేసి బిరబిరా భోజరాజువద్దకు బయలుదేరినాడు బాపడు. ఆస్థానమునకు వెళ్లి తన ప్రవర చెప్పుకొని (Introduction ) తన శ్లోకమును విన్నవించినాడు. రాజు రెండవపాదమువిని మురిసి మైమరచి ఇది మా కాళీదాసు రచనను బోలివుంది దానికి అక్షర లక్షలు గ్రహించామన్నాడు. బ్రాహ్మణుడు విషయము అర్థము చేసుకొన్నవాడై కృతజ్ఞతా పూర్వకమైన చూపును కాళీదాసునివైపు సారించి అశ్రునయనాలతో అక్కడ నుండి కదిలినాడు.
ఆ కాళీ వరప్రసాదుని కనికరము అటువంటిది.
భోజన ప్రియులనిపించుకోనేకంటే బహు జన ప్రియులమనిపించుకొందాం.
స్వస్తి.
Comments
Post a Comment