కాఫీనా టీ నా ఏది గొప్పది?
కాఫీనా టీ నా ఏది గొప్పది?
కర్మ సన్యాస యోగము (భగవద్గీత)యందు మొదటి శ్లోకము ఈ
విధముగా ఉన్నది.
సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ|
తయోస్తు కర్మసన్యాసాత్కర్మయోగో విశిష్యతేll
శ్రీ కృష్ణుడు ఈవిధముగా అనుచున్నాడు:కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి.
అయితే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది.
అని కర్మ యోగపు విశిష్ఠతను గూర్చి వ్యాఖ్యానించుచునాడు ఒక
సమూహమును ఉద్దేశించి. అంతలో పండితునికి టీ తెచ్చి ఇవ్వడం జరిగినది. అడి చవశశి
ముందువరుసలోని ఒక శ్రోత 'స్వామీ టీ శ్రేష్టమా లేక కాఫీయా?' అని ప్రశ్నించినాడు. అందుకు జవాబుగా ఆ పండితుడు
పైశ్లోకమును అనుసరించుతూ ఈ విధముగా చెప్పినాడు:
సయోస్తు కాఫికా పానాత్ టీ పానంతు విశిష్యతేll
స్వస్తి.
Comments
Post a Comment