బర్బరీకుడు https://ajaraamarasukthi.blogspot.com/2025/11/blog-post.html
బర్బరీకుని వృత్తాంతము వ్యాస భారతమున లేదు. అయినా ఆ ఇతిహాసమును గూర్చి ఎక్కువమందికి తెలియని విశేషముల గూర్చి తెలిపి బర్బరీక వృత్తాంతము ప్రారంభించుతాను.
బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడినాడు. అయినా
భారతము పంచమ వేదము. ఆ మాటను పుష్టి చేస్తూ వ్యాసులవారే
ఈ విధముగా చెప్పినారు:
ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ।
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్॥
మానవ జీవితము చతుర్విధ పురుషార్థ సంయోజనము. మహాభారతమున ఈ పురుశార్తములకు సంబంధించి న ఏ సందేహమును ఈ మహాభారతము నివృత్తి చేయలేక పోతే ప్రపంచ సాహిత్యంలోని ఏ ఉద్గ్రంధము కూడా బదులు తెలుపలేదని నొక్కి వక్కాణించినారు.
వ్యాస మహాభారతము Milton వ్రాసిన Paradise Lost కన్నా రాశిలో
4 ½ రెట్లు పెద్దది. ఇందులోని శ్లోకముల సంఖ్య ఒక లక్ష ఇరవైఐదు వేలు. కాంచీ పురము లోని శ్రీమాన్ తాతాచార్యుల వారు ఈ మొత్తము శ్లోకములను ఒక నలభై సంవత్సరముల క్రితం దివంగతులగువరకూ గుర్తు పెట్టుకొరామ్ సాగరోపమంనియుండినారని ప్రతీతి. మహాభారతములో 1600 పాత్రలు ఉన్నాయని విన్నాను.
ఇక బర్బరీకుని విషయానికి వద్దాము.
బర్బరీకుని తల్లి మౌర్వి (అహిలావతి). తండ్రి భీమ హిడింబి కుమారుడు ఘటోత్కచుడు. బర్బరీకుడు బాల్యము నుండియే యుద్ధ విద్యలలో అపార ప్రతిభావంతుడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను ప్రసాదించినారు. ఆ మూడు బాణాలతో అతను ముల్లోకాలలోనూ అప్రతిహతుడౌతాడని ఆశీర్వదించినాథరు.
బర్బరీకుడు యౌవ్వనావస్థలోనికి ఆడుగు పెడుతుండగానే, కురుక్షేత్ర సంగ్రామము ఆసన్నమగు మయము వచ్చినది. భరతఖండంలోని
అనుకోవడం వింత ఏమీ కాదు. బర్బరీకుడు ఘటోత్కచుని కుమారుడు మరియు భీమసేనుని పౌత్రుడు. సహజ బంధుత్వము బర్బరీకుని పాండవుల పక్షమును గైకొన జేసినది.
• ఒక వాస్తవమైన విషయము ఏమిటంటే వ్యాసులవారి శిష్యులైన వైశంపాయనుడు , జైమిని మరియు సుమంతుడు.వీరిలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వేదము చొప్పున నలుగురికీ నాలుగు వేదములను విడివిడిగా తానూ విభజించి యుంచినవి ఈ క్రింది విధముగా ఇచ్చినాడు.
1. ఋగ్వేదము- పైలుడు,. 2.యజుర్వేదము- వైశంపాయనుడు, ౩. జైమిని- సామవేదము, 4. సుమంతుడు- అధర్వణవేదము
ఈ విభజన కాక జైమిని భారతమును తనశైలిలో వ్రాసి తనపపేరుతోనే జైమినీ భారతమని ఆ గ్రంధమును పిలిచినాడు.
ఇంతవరకు నేను తెలిపిన ఉపోద్ఘాతము తెలియని వారికి ఉపయుక్తమయి ఉంటుందని తలుస్తాను.
కథలో అడుగు పెడదాము.
మిగిలినది రెండవ భాగములో.......
.
2వ భాగము
ఒకానొక దినమున ఘటోత్కచుడు తనతల్లి హిడింబితో పిచ్చాపాటీ మాట్లాడుతున్న సమయములో ఘటోత్కచుని పెళ్లి వృత్తాంతము వచ్చింది. అప్పుడు హిడింబి తనయునితో ‘నాయనా నీవు ఇంద్రప్రస్థము వెళ్లి పెద్దనాన్న గారితో, ముందు నా నమస్కారములు తెలిపి, నీ పెళ్లి విషయము ముచ్చటించు’ అని చెప్పినది. వల్లెయని తనయుడు ఇంద్రప్రస్థము చేరుసంయమునకు శ్రీకృష్ణుడు ధర్మజునితో ఎదో ముచ్చటిస్తూ ఉండినాడు. ఘటోత్కచుడు ఇరువురికీ అభివాదనము చేసి, తగిన సందర్భమున తనపెళ్ళి ప్రస్తాపన తెచ్చినాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పదోదగినాడు “నాయనా! నా మాటలను శ్రద్ధగా ఆలకించు. నరకుడు లోక కంటకుడై ఉండిన కాలములో వానికి ‘మురుడు’ అను ఒక ముఖ్య దండనాతుడు ఉండేవాడు. వాడు చలరేగి ప్రజలను అతి క్రూరముగా హింసించుచున్న కాలములో నేను వానిని మట్టుపెత్తవలసి వచ్చినది. ఆ పగతో వాని చెల్లెలగు ‘మౌర్వి’ నాపై యుద్ధము ప్రకటించినది. ఆమె ప్రచండమైన ‘శ్రీమాత’ భక్తురాలు. ఎన్నోరోజులు అలుపూ సొలుపు లేకుండా యుద్ధము చేయుచున్న ఆ వీరవనిత మీదికి సుదర్శనమును నేను సంధించవలసి వచ్చినది. అప్పుడు ‘శ్రీమాత’ ప్రత్యక్షమై ‘ఆమె తనకు అపరిమితమగు భాక్తురాలని తెలుపుతూ చక్ర ప్రయోగమును నివారింపజేసి నేను శ్రీమహావిష్ణువు యొక్క అవతారమని తెల్పినది. ఆమె శ్రద్ధా భక్తులతో నమస్కరించి క్షమాపణ కోరినది. ఆ విషయము అంతటితో ముగిసినది. ‘ఘటోత్కచా! ఆమె నీకు తగిన ఇల్లాలు. నీవు వెళ్లి ఆమను వివాహమాడు’ అని చేప్పినాడు. వల్లెయని ఘటోత్కచుడు నమస్కరించి ఇరువురి వద్దా శెలవు తీసుకొన్నాడు.
తల్లికి విషయము చెప్పి ఒక శుభ ముహూర్తమున వివాహార్థియై మౌర్వి యొక్క నగరమునకు బయలుదేరినాడు.
ఘటోత్కచుడు రాజప్రాసాదము చేరినంత మౌర్వి యొక్క అంతేవాసి ఆయనను ఆపి వచ్చిన కారణము అడిగింది. విషయము తెలుసుకొన్న పిదప ఘటోత్కచునితో మౌర్వి యొక్క తీవ్రమైన ఆంక్షను ఈ విధముగా తెలియజేసింది. “తనకొరకు వచ్చిన వరుడు అడిగిన ప్రశ్నకు తానూ జవాబు చెప్పలేకపోతేనే తానతనిని పెల్లియాడుతాను అట్లు కానిచో అతనికి శిరచ్ఛేదము జరుగుతుందని చెబుతూ ఆవిడ ఘటోత్కచుని తనను పెల్లియాడమని ప్రోత్సహించింది. ఘటోత్కచుడు ససేమిరా అనుటతో విషయము మౌర్వికి తెలియజేసింది.
రంగము సిద్ధమయినా తరువాత మౌర్వి ప్రశ్నించమని ఘటోత్కచునికి తెలియబరచింది. ఘటోత్కచుడు తనప్రశ్నాను ఈ విధముగా సంధించినాడు. “ఒక యువకుఆడు అందమైన ఒక యువతిని మోహించి వివాహమాడినాడు. ఆ దంపతులకు ఒక అందాలరాశి జన్మించిన పిదప ఆ బాలిక మాతృవిహీన అయిపొయింది. కాలక్రమమున ఆమెకు ఆ దంపతులకు ఏమివరుస అవుతాడు?”క బాలకునికి జన్మనిచ్చినాడు. ఇపుడు ఆ బాలకుడు ఆ దంపతులకు వరుసకు ఏమవుతాడు?” జవాబు చెప్పలేక తన ఓటమిని అంగీకరించి మౌర్వి ఘటోత్కచుని వివాహమాడినది.
కొంత కాలము గడిచిన తరువాత ఆ దంపతులకు జలిగిన మగశిశువే బర్బరీకుడు. మరికొంత కాలము భార్యా పుత్రునితో గడిపి ఘటోత్కచుడు చనిపోయిన తన మేనమామ హిదిమ్బాసురుని రాజ్యమును చక్కదిద్ద అచటికి వెళ్ళినాడు. బర్బరీకుని ఆలనా పాలన అంతా మౌర్వియే స్వీకరించి పెంచినది.
మిగిలినది 3వ భాగములో .........
3వ భాగము
బర్బరీకుడు యుక్తవయస్కుడైనాడు. సకలవిద్యాపారంగాతుడైనాడు. యుద్ధవిద్య యందు రాతుదేలినాడు. అన్నిటికి మించి తల్లి ఆనతి మేరకు శివుని గూర్చి తపస్సుచేసి పరమేశ్వరుడు అనుగ్రహించిన ధనుస్సును మూడు దివ్యబాణములను పొందినాడు.
హస్తినలో శ్రీకృష్ణ రాయభారము విఫలమై కురుక్షేత్రము యుద్ధభూమిగా నిర్ధారించబడినది. కౌరవులవైపు 11 అక్షోహిణీల బలము ఉండగా పాండవుల పక్షాన 7 అక్షోహిణీల బలము సమకూరినది. బర్బరీకుడు తల్లితో, తానూ యుద్ధమునకు పోతానన్నాడు. యుద్ధమునకు పోవుటకు అనుమతించుతూ ధర్మము తమవైపు కలిగి కూడా బలహీన సైనికశక్తి కలిగిన తన తాతలయిన పాండవుల పక్షమున పోరాడమని ఆదేశించినది. కుమారుడు వల్లె యని తల్లికి నమస్కరించి యుద్ధభూమికి బయలుదేరినాడు.
కానీ బర్బరీకుని లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు.‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. ‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు.
‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న ఎండిపోయిన రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయాగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు.
శ్రీకృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఎండుటాకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద ఆకులన్నింటినీ గుర్తించి బర్బరీకుని అమ్ముల పొదిని చేరుతుంది మొదటి బాణము. రెండవ బాణమును వదులుతాడు బర్బరీకుడు అది చేట్టునకుగల అన్ని ఎండుటాకులపైన గుర్తులు వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది.
బ్రాహ్మణ వేషధారియైన శ్రీకృష్ణుడు, బర్బరీకుని కారణమడుగుతాడు. అపుడు బర్బరీకుడు ‘అయ్యా! మీ కాలి కింద ఒక గుర్తుపెట్టిన ఎండుటాకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు కాస్త ప్రక్కకు జరపండి’ అంటాడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకు జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు.
ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి శ్రీకృష్ణునికి.
అప్పుడు శ్రీకృష్ణుడు తన మిజరూపమున బర్బరీకుని మ్రోల ప్రత్యక్షమై అతనితో ‘బర్బరీకా! యుద్ధమున నీవు నినిలిస్తే యుద్ధము మూడు నిముసములలో ముగుస్తుంది. ఇరు పక్షములలోనివారూ ఎన్నో ప్రతిజ్ఞలు సల్పియున్నారు అవి అన్నియు నిరర్థకములగుటయేగాక వారి ప్రతినలు అర్తరహితములైపోతాయి, అందుచేత యుద్ధమునకు ప్రారంభమున తీసుకొనే బలివి నీవుకమ్మని తెలియజేయుచున్నాను.” అని అన్నాడు. అంత బర్బరీకుడు ఎంతయో సంతసించి “స్వామీ! నీ దివ్య దర్శనముతో నా జన్మపావనమైనది. మీ మాటను మీ ఆజ్ఞగా పాటించుతాను కానీ నాదొక విన్నపము. మీ చక్రఘాతముచే విడిపడ్డ నాశిరస్సును ఒక ఉన్నత పర్వత శిఖరముపై, యుద్ధభూమి వద్ద, ఉంచి మొత్తము రణమును తిలకిన్చానిమ్ము” అని అర్థించగా శ్రీకృష్ణుడు ‘తథాస్తు’ అన్నాడు. యుద్ధమున బ్రతికిన యోదులందరూ, శ్రీకృష్ణునితో సహా వెళ్లి యుద్ధమేతులున్దినదని అడుగగా ‘ ఒక చక్రధారి సందర్భోచ్జితముగా యుద్ధమున ఇరువైపులవారినీ చంపుట చూసినాను’ అన్నాడు.
మిగిలినది 4వ భాగములో.......
4వ భాగము
దక్షిణ భారతాన, ఖాటుశ్యాం పేరు విన్నవారి సంఖ్యే చాలా తక్కువ. కానీ
ఉత్తరాదిన, ఆ మాటకు వస్తే భారతదేశాన్ని దాటి నేపాల్లోనూ ఖాటు శ్యాం
బాబాను ఆరాధించేవారి సంఖ్య అసాధారణము. శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన ఖాటు
శ్యాంకు, తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది భక్తుల నమ్మకం.
మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల ఆయనకు, తమ కష్టాలను
కడతేర్చడం చిటికెలో పని అన్నది, ఆయనను నమ్ముకున్నవారి
విశ్వాసం.
జైపూర్ లో జరిగిన
ఒక వింత సంఘటన మీకు తెలిపే ప్రయత్నము చేస్తాను.
రాజస్తాన్ కు
చెందిన జైపూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. పదవ శతాబ్దంలో
ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా
పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన
గ్రామస్తులు, అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న
బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలందుకుంటాడని
శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యాంబాబాగా, ఖాటు గ్రామంలో
వెలిశాడు కాబట్టి ‘ఖాటు శ్యాం’గా కొలుచుకోసాగారు భక్తజనం. ఆ సాలిగ్రామం భక్తుల ఇంట
పూజలందుకుంటుండగానే, ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్న రూప్ సింగ్ చౌహాన్
అనే రాజుకి ఓ కల వచ్చింది. ఖాటు శ్యాం శిరసు కనిపించిన స్థలంలో కనీ,వినీ ఎరుగని
విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. దానికి అనుగుణంగానే రూప్
సింగ్ 1027లో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించినాడు. దానికే తరువాతి కాలంలో మార్పులూ
చేర్పులూ చేసినారు.
ఉత్తర భారతము లోనూ, నేపాల్ లోను వేరు వేరు పెర్లతోబర్బరీకుని ఆలయములు వేలయుతయే గాక భక్తుల కోర్కెలు తీర్చుచు ప్రముఖ దేవతగా ఆయాప్రాంతములలో కొనియాదబడుచున్నాడు,
స్వస్తి.
Comments
Post a Comment