ఒక చిన్న కథ
ఒక చిన్న కథ
https://ajaraamarasukthi.blogspot.com/2025/11/blog-post_22.html
సంస్కృతము చెల్లుబాటయ్యే రోజుల్లో ఇద్దరు పండితులు వీధి లో పోతూవుంటే ఒక కొట్టు యజమానియైన చక్కటి అమ్మాయి తన కొట్టులో కూర్చొని వుండినది . ఓ
ఒక పండితుడు ఆమె వద్దకు పోయి 'తూర్ణం ఆధీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే' అన్నాడు .
అక్కడికి శ్లోకముయొక్క ఒక పాదము పూర్తి అయ్యింది.
ఇక రెండవ పండితుడు వచ్చి రెండవ పాదమును ఈ విధంగా చెప్పినాడు :
'పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాన్తాకీర్ణ లోచనే'
అంటే బంగారు రంగులో వుండే తమలపాకులు(బాగా మాగినవి అని అర్థము) కూడా, ఓ చెవులవరకు కన్నులు కలిగిన మదవతీ, ఇవ్వు అని అన్నాడు .
రెండవ పండితుడు చెవులకింపుగా ఉండేవిధముగా రెండు విషయాలన్నాడు:
1. మొదటి పండితుడు మొదటి పాదములో 'ణ' మూడు పర్యాయములు రానిస్తే రెండవ వ్యక్తి తన రెండవ పాదములో 'ణ ' ను ఐదు పర్యాయములు రానిచ్చినాడు.
2. నీకళ్ళు ఆకర్ణాతము వున్నాయి తామర రెక్కలలాగా అని పొగడినాడు. అందువల్ల ఆమె అతనికే ముందు ఆకులు వక్కలు సున్నము కూడా ఇచ్చిందట.
ఇక్కడ తూర్ణం=కొద్దిగా చూర్ణం=సున్నము అధీయతాం=ఇవ్వుము అని అర్థము . మిగిలినదంతా మీకు తెలిసిందే .
Comments
Post a Comment