శంకరా-లోకశంకరా
శంకరా-లోకశంకరా!
https://ajaraamarasukthi.blogspot.com/2026/02/blog-post.html
లోకము లోలకమ్ము వలె లోప పథమ్మున ఊగుచుండగా
చీకటులావరించి జన జీవన ధర్మము గాడి తప్పగా
సాకతమూర్తివై భువిన సర్వమతమ్ములు సమ్మతించగా
ఏకము అద్వితీయమగు ఈశుని జూపితివీవు శంకరా!
చతురామ్నాయ విశేష శాసన
ములన్ శర్వాజ్ఞతో సాంతమున్
పతనంబయ్యెడు ఆర్షధర్మ విధులన్ పాటింపగాజేయుచున్
సతతతారాధ్యము చేయగల్గితివి
నీ చాతుర్యతన్ నాల్గెడల్
సతతానందము ధాత్రిపై వెలయగా సర్వజ్ఞ
అస్తంటివే
అద్వైత తత్వ మహితకు
విద్వాంసులు వేదవిధులు వివహితరణ నొసగా
విద్వేషివౌచు
విబుధుడపరమేశ్వరుని
విధ్వంసముచేయబూన విజ్ఞతయగునే
నేను ఎన్ని జన్మలెత్తినా
అద్వైతిగాత్రిమతాచార్యులలో మిగత ఇరువురికన్నా ఎన్నో వందల సంవత్సరాలు మున్డువాడయిన
జగద్గురు శంకరాచార్యుని అనుయాయి గానే ఉండవలెనని
కోరుకొనుచున్నాను. త్రికాశ్మీరములో ఇరువురికన్నా ఎన్నోవందల సంవత్సరాల
పూర్వీకులు. కాశ్మీరములో నాడు ఉండిన సర్వజ్ఞ పీఠమును, నాటి సకల పండిత ప్రకాండులను ‘వేద వేదాంగ వేదాంత స్పర్దల
యందు ఓడించి’, అధిరోహించి వారు జగద్గురువులైనారు. వారి తరువాత
అంతటి అత్యున్నత స్థానమును అందుకొన్న గురువులు లేరు.
అందుకే వారు మాత్రమే
జగద్గురువులైనారు.
కల్యబ్దే
ద్విసహస్రాంతే లోకానుగ్రహ కామ్యయాl
చతుర్భిఃసహ శిష్యైస్తు శంకరోవతరిష్యతి
ll
ఇది ద్వాపరయుగాంతమున వేదవేదవ్యాసులవారు
భవిష్య పురాణమున తెలియజేసిన విషయము. దీని అర్థమేమన ‘కలియుగము ప్రారంభమయి రెండు వేల
5సంవత్సరములు గడచిన పిమ్మట ఆ పరమశివుడే శంకరాచార్యుల వారిగా
నలుగురు శిష్యులతో ఈ భూమిపై సంచరించేదారు’. ఈ విషయమును విస్తారముగా నా ‘శంకరులవారి కాలము’ అన్న వ్యాసములో సవిస్తారముగా
తెలియబరచినాను. ఇందుతో లంకెను పొందుపరచుచున్నాను.
సాదికారికముగా శంకరులు 2593
సంవత్సరముఆశ్తోత్తరమున తేటతెల్లమౌతుంది.ల పూర్వము జన్మించినారు. నాటి షాంపాషాండ
మతములుగా పిలువబడుచున్న మత అధిపతులనోమదించి షణ్మత స్థాపకులై పంచాయతనమును
ఏర్పరచినారు. ఈ విషయము మనకు శ్రీ శంకరాచార్య అష్టోత్తర శతనామావళి యందు
తేటతెల్లమౌతుంది.
‘శంకరులవారి కాలము’ అన్న నా
వ్యాసము యొక్క లంకె ఈ దిగువన ఇవ్వబడినది:
https://cherukurammohan.blogspot.com/2013/09/blog-post.html
ఆ మహనీయుని గూర్చి తెల్పుటకు ఒక అజ్ఞాని
పూనుకోనుత సాహసమే అవుతుంది.అందుకే నా భక్తి విధేయతలు ఆ మహనీయ మూర్తికి ఈ విధముగా
సమర్పించుకోనుచున్నాను.
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయంl
నమామి భగవత్పాదశంకరం లోక శంకరంll
శ్లో|| గురుత్యాగి భవేత్‌రోగి
మంత్రత్యాగి దరిద్రవాన్l
గురుమంత్ర ద్వయత్యాగి రౌరవం నరకంవ్రజేత్ll
స్వస్తి.
Comments
Post a Comment