ప్రతిమ

ప్రతిమ 

https://ajaraamarasukthi.blogspot.com/2025/07/blog-post_7.html

న తస్య ప్రతిమా అస్తి’ ఇది ఛాందోగ్యోపనిషత్తు చెప్పే మాట అంటే ఆయన బొలీన ప్రతిమ లేదు అని అర్థము. ఇప్పుడు ప్రతిమ అంటే తెలుసుకొందాము. ప్రతిమ అన్నమాటకు మనకు అత్యంత పూర్వీకులైన ఉపనిషద్ భాష్య కారులు చెప్పిన అర్థము ; సమానమైనది’ అని. అంటే పరమాత్మ స్వరూపామునకు సాటియయినది అని అర్థము.

అదే ఉపనిషత్తు వేరొకచోట ఈ విధముగా చెబుతూ ఉన్నదిహుదధీతోనూ :

‘హిరణ్య శ్మశ్రుః హిరణ్య కేశః ఆప్రణఖాః సర్వ ఏవ సువర్ణః’

ఆపరమాత్మ గడ్డము కురులు నఖములు అన్నీ స్వర్ణమయమై ఉంటాయి అని అర్థము. ఇటువంటి వివరములను చిత్తశుద్ధితోనూ ఆరూపాములుగా చూస్తాడు. సుతర్కముతోనూ అర్థము చేసుకొనవలెను. సాధారణమగు వ్యక్తికి అత్యంత శ్రేష్ఠమని అనిపించే వస్తువులను భాగ్యవంతునివి అని తలుస్తాడు. అందుకే వేదము వర్ణించిన విధముగా చిత్రకారుడు\శిల్పి  ఒక మూర్తి లేక ప్రతిమను సృష్టించుతారు. దానిని ఎన్నో వైదిక విధులకు వేదయుక్తముగా గురిచేసిన తరువాత ప్రాణప్రతిష్ట చేస్తారు. అంటే అప్పుడు ఆ విగ్రహములో ె మూర్తిని ఊహించి శిల్పి సృష్టించినాడో ఆమూర్తి సజీవ మూర్తిగా పరిగణించబడిభక్తులు ఎన్ని విధముల కొరికాలతో  ధూప దీప నైవేద్యములతో అర్చన చేయబడుతూ ఉంటుంది. ఈ మూర్తిని ఎన్ని విధముల కొరికాలతో వివిధ భక్తులు పూజించుతారు అన్నది పరమాత్మయే భగవద్గీత లో ఈ విధముగా తెలిపినారు:

చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోర్జున |

ఆర్తో జిజ్ఞాసురర్థార్థీజ్ఞానీచభరతర్షభ|| (భగవద్గీత 7-16)

భరతర్షభ = భరత కుల శ్రేష్ఠా ; సుకృతినః = శుభకర్మలు చేసేవారు ; అర్థార్థీ = సంపదలను కోరేవారు; ఆర్తః = ఆపదలో ఉన్నవారు; జిజ్ఞాసుః = ఐహిక విషయాలపై ఆసక్తిని వీడి, సర్వాత్మ జ్ఞానాన్ని పొందగోరే వారు; చ = మరి ; జ్ఞానీ = పరమాత్మ ప్రాప్తి పొందిన జ్ఞాని ; చతుర్విధాః = నాలుగు విధాలైన ; జనాః = జనులు ; మాం = “ నన్ను ” “ ఆత్మను ” ; భజంతే = సేవిస్తున్నారు

పండిన జ్ఞానానికి గుర్తు నీలో లోకులపై పెరిగిన ఔదార్యము, ప్రేమ. అంతేగానీ హేళన లోకువ కాదు.

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్

జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ ।। (భగవద్గీత ౩ - 26 )

గొప్ప వ్యక్తులు మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు, ఎందుకంటే సాధారణ ప్రజలు వారిని అనుసరిస్తారు. కాబట్టి, అజ్ఞానులను మరింత పతనానికి గురి చేసే ఎలాంటి మాటలను, చేతలను జ్ఞానులు చేయరాదని శ్రీ కృష్ణుడు అభ్యర్థిస్తున్నాడు. జ్ఞానులకు అజ్ఞానుల పట్ల కరుణ కలిగితే, వారికి అత్యున్నత జ్ఞానం - భగవత్ ప్రాప్తిని కలిగించే  జ్ఞానం – ప్రసాదించవచ్చు . శ్రీ కృష్ణ భగవానుడు ఇంకొక మాట చెబుతున్నాడు: 'న బుద్ధి భేదం జనయేత్' అన్నాడు, అంటే, అజ్ఞానులకు అర్థం కాని ఉన్నత స్థాయి ఉపదేశం చెప్తూ, వారి విధులను విడిచి పెట్టమని ఎన్నటికీ చెప్పరాదు అని. అంటే ఎంతో సున్నితముగా మనసు నొప్పించకుండా నిలుపు నిదానముగా తెలుపుతూ పోవలసి ఉంటుంది.

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 2 - 38 ।।

సాంఖ్య యోగము అంటే పరమాత్మ తత్వము. అనగా శుద్ధచై తన్య తత్వము. నిష్కామ కారమును అనుష్ఠించి సాధించిన తరువాతనే నిర్గుణోపాసన సాధ్యమౌతుంది. కావున సగుణోపాసన భగవత్సాధనకు తొలిమెట్టు.

స్వస్తి.

 

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి