సంస్కృత సంస్కృతి(19.11.2013)

 సంస్కృత సంస్కృతి(19.11.2013)

సంస్కృతం=సమ్యక్ +కృతం  అనగా సంపూర్ణముగా సంస్కరింప బడినది అని అర్థము. సృష్ట్యాదినుండి అది ధ్వనిరూపములో ఆకాశాన్ని అంటిపెట్టుకొనే వుంది. ధ్వని శబ్ద సంకలనమే. సూత్రాను సారిణి యైన శబ్ద సంకలనమే భాష. వ్యాకరణము ఛందస్సు భాషామతల్లి స్తన్యములు అంటారు. బుడ్డిపాల కలవాటుపడి తల్లి పాలు త్రాగే అవకాశము పోగొట్టుకొన్న వానికి తల్లి పాలరుచి తెలిసే అవకాశమేదీ! అపౌరుషేయమైన వేదము యేభాషలో ఉన్నదో ఆ భాష కూడా అపౌరుషేయమే కదా. ఆవేద భాషే ఆది భాషఆ ఆది భాషే సంస్కృతము. రామాయణము ఆది కావ్యము. 
వేదభాష గా బ్రహ్మ నుండి దేవతలు ఋషులు వారి నుండి భూలోక వాసులకు ఈ భాష సంక్రమించినది. వేదానికి షడంగములైన శిక్షవ్యాకరణ,ఛందస్,నిరుక్త,జ్యోతిష కల్పములలో వ్యాకరణము కలదు ఆ వ్యాకరణమును విడమరచి విశధీకరించిన మొదటి మహానుభావుడు పాణిని. 
పాణిని మహర్షి తన 'అష్టాధ్యాయి'అను వ్యాకరణ ప్రామాణిక సూత్రగ్రంథమందు ఈ క్రింది శ్లోకాన్ని తెలియబరచినారు :
    'నృత్తావసానే నటరాజరాజో నానంద ఢక్కాం నవపంచ చారం
     ఉద్ధర్తు కామః సనకాది సిధ్ధా నేతద్విమర్శే శివసూత్రజాలమ్'
కైలాసము లో తాండవ మూర్తి యైన పరమ శివుని నృత్తావసాన సమయమున ఆయన చర్మ వాద్యమైన తన డమరుకమును వాయించుచూ నృత్యాన్ని ముగించుతారు . దాన్ని 'చోపు'  అంటారు . ఆ తాండవ నృత్యానికి తన్మయులైనా ప్రేక్షకులలో సనక,సనందన,సనాతన సనత్కుమారులు మరియు పతంజలి వ్యాఘ్రపాద పాణినీ ప్రభ్రుతులు ఉండినారు. ఆ చోపు లోని నవ పంచ చారం అంటే 9+5=14 దరువులను ఏక సంతాగ్రాహియైన పాణిని గ్రహించి తన 'అష్టాధ్యాయిఅన్న సూత్ర గ్రంథము లో పొందు పరచిరి. వీనిని మాహేశ్వర సూత్రములందురు. 
శివుని   డమరుకము నుండి ప్రభవించిన ఆ దరువులీ విధంగా వున్నాయి. 
1. ఆఇఉణ్ 2. ఋల్క్ 3. ఎఒఙ 4. ఐఔచ్ 5. హయవరట్ 6. రణ్ 7. ఞమఙణనమ్ 8. ఝభణ్ 9. ఘడధష్ 10. జబగడదశ్ 11.  ఖఫఛద్ధయ చటతవ్ 12. కపయ 13. శషసర్ 14. హల్ ఇందు స్వరములు 16. 
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఋూ ఌ ౡ ఎ  ఐ ఒ ఔ అం అః 
వ్యంజనములు :
క్ ఖ్ గ్ ఘ్ ఙ్  చ్ ఛ్ జ్ ఝ్ ఞ్  ట్ ఠ్ డ్ ఢ్ ణ్  త్ థ్ ద్ ధ్ న్  ప్ ఫ్ బ్ భ్ మ్ య్ ర్  ల్  వ్ శ ష్ స్ హ్    క్ష ్  త్ర్ జ్ఞ్
ఇందు వ్యంజనముల వర్గీకరణము ఒక గొప్ప విషయమైతే వీటి జన్య స్థానములను నిర్దేసించి కంఠ్యములుగా,తాలవ్యములుగామూర్ధన్యములుగా, అనునాసికములుగా, వర్గీకరించడం మరొక గొప్ప విషయము. ఈ వివరణ పురాతన భాషలని గొప్పలు చెప్పుకొనుచున్న గ్రీకు లాటిన్ ఫార్సీ అరబ్బు  వంటి ఎ భాషకును లేదు. పాణిని వారిది మొదటి వ్యాకరణ శాస్త్రమని భాషజ్ఞులు (philologists) నిర్ద్వందంగా అంగీకరించిన విషయము. కానీ పాణిని గారే తనకు పూర్వము ఎన్నో వ్యాకరణ గ్రంథాలుండేవని  తన అష్టాధ్యాయిలో పేర్కొన్నారు. అసలు వీనికి 'అక్షరములుఅన్న పేరు పెట్టడంలోనే అసలు రహస్యం దాగివుంది. న+క్షరము=అక్షరము . క్షరము కానిది అంటే నశించనిది యని అర్థము. 
పరమేశ్వరుడు అక్షరుడు. వేదములు అక్షరములు. ఈ సంస్కృత భాష అక్షరము. ఇటువంటి పదజాలముల ఉత్పత్తియే ఈ భాష ఘనతను చాటుతూ వుంది. 
ప్రపంచ పురాతన భాషలలో మాయమైన  భాషలు కొన్నిమార్పుకు నోచుకోలేని భాషలు కొన్నిమారుతూ మారుతూ ఉన్కినే కోల్పోయిన భాషలు కొన్ని. కానీ ఈ భాష భగవత్ స్వరూపము ఇది అవినాశము. హిమాలయోత్తుంగము. గంగా పవిత్రము. ఈ భాషను  పొందిన మన జన్మలు పునీతములు. 
భాష భూమి అయితే విత్తనం ధాతువు . ధాతువు అన్నది సామాన్యముగా ఒక అక్షరము. పదజాలము ఆ విత్తనమునుండి ఏర్పడిన వృక్ష జనిత ఫల సంపద. ఒక ధాతువును వచనములు (ఏక,ద్వి,బహు) 3 పురుషలు మరియు 10 అంతర్భాగములుగా విభజింపబడిన కాలములు (భూత, భవిష్యత్, వర్తమాన) తో కలిపి పదములు 90 విధములగును. ఈ శబ్ద వాచక సంబద్ధమైన ఈ భాష భారతీయతకు సనాతన ధర్మమునకు పట్టుగొమ్మ. నేటికి కూడా సంస్కృతము  భారతదేశపు 23 అధికారిక భాషలలో ఒకటి.  నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135 (2011 గణాంకములు నాకు దొరకలేదుఅని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. 
కర్ణాటక లోని 'మత్తూరుఅనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. అచట అన్నివర్ణములవారూ ఇదే భాష మాట్లాడుతారు. ఈ విషయమును గూర్చి ఆంగ్లములో ఒక వ్యాసము కొన్ని సంవత్సరముల క్రితము వ్రాసియుండినాను. సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటిలోపాలు లేకుండా ఏర్పడినఅని అర్థమని ముందే చెప్పుకొన్నాము. ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతము ఉపజీవ్యము. సంస్కృతమునకు అమరవాణిదేవభాషసురభాషగీర్వాణము మొదలగు పేర్లు కలవు. శౌరసేనిపైశాచిమాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనముబహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియుశబ్దములనియునుక్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులని వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపి గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి  లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి తమిళ లిపి బెంగాలీ లిపి,మొదలగునవి లింగవచనవిభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.ఏదృష్టితో చూచినను సంస్కృతభాష ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమైవివిధ భాషామాతయైయలరారు చున్నదిమరియు భారతజాతీయతకు జీవగర్రయై, భారతీయ భాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై, సరస సాహిత్య జ్ఞానవిజ్ఞాన రత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడ ప్రధానభూమికను నిర్వహింపగల్గుట పరమ విశేషము. ఇది మహామహోపాధ్యాయ శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు  (Lecturer in Sanskrit, S.R.R. & C.V.R College, Vijayawada) చెప్పిన మాట. సంస్కృతము యొక్క గోప్పతనమేమిటన్నది చాటుటకు వారు వ్రాసిన ఈ ఒక్క శ్లోకము చాలు: "సుధా స్రవంతీ సుర భాషి తాయా -సుచ్చాన సూక్తి సురత్న వార్ధిః -సుకావ్య సందోహ నిధిశ్చ వాణీ -సా సంస్కృతాఖ్యా, సుకృతిః కలాభ్యా" "నా మాతృభాషా భువి సంస్కృతాఖ్యా" సంస్కృతమే సర్వ భాషలకు, సర్వ కళలకు మూలము సమస్త సంస్కృతికి మూలము అని స్థూలముగా ఈ శ్లోకములకర్థము.
మిగత వివరములు రేపు.....

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి