శ్రీమచ్చంకరాచార్య విరచితం శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం

 

శ్రీమచ్చంకరాచార్య విరచితం 

శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం


https://ajaraamarasukthi.blogspot.com/2025/05/blog-post.html

అవినయ మపనయ విష్ణో  దమయ మనః శమయ విషయ మృగతృష్ణామ్
భూతదయాం విస్తారయ తారయ సంసార-సాగరతః (1)

ఓ విష్ణు మూర్తీ! నా అవినయమును పోగొట్టుము అంటే నాలోని అహంకారమును పోగొట్టుము. నాకు మనోనిగ్రహమును ప్రసాదించుము, ప్రాపంచిక విషయములనెడి  ఎండమావులను రూపుమాపుము, సర్వ ప్రాణుల (భూతదయ) యందు దయను పెంపొందింపుము, సంసార సాగరము నుండి బయటపడుటకు నాకు మార్గము చూపించుము.

దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్ఛిదే వందే (2)

ఆకాశ గంగను మకరందముగా సచ్చిదానందమును పరిమళముగా కలిగి సంసార భయ దుఃఖములను నశింపచేసేవి అయిన శ్రీపతి (లక్ష్మి దేవి భర్త అగు విష్ణువు) యొక్క పాద పద్మములకు నమస్కరించుచున్నాను. అసలు శ్రీపతి అంటే సకల సంపదకూ అధిపతి. సంపద అంటే ధనము మాత్రమే కాదు విద్య, వివేక, వినయ, సద్గుణ, బంధు,  మొదలగుణవన్నీ సంపదలే!

సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీన స్త్వమ్
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః (3)

ఓ అనాథ నాథ, పరమ సత్యమును గ్రహించి, నీకు నాకు భేదములేదు అను భావన కలిగినా కూడా, నేను నీకు చెందిన వాడినే కానీ నీవు నాకు చెందిన వాడవు కాదు ఎలాగంటే
 సముద్రమునకు  తరంగములు చెందినవి కానీ సముద్రము తరంగములకు చెందదు కదా!

ఉద్ధృతనగ నగభి-దనుజ దనుజ-కులామిత్ర మిత్ర శశిదృష్టే
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవ తిరస్కారః (4)

(గోవర్ధన)పర్వతమును ఎత్తిన వాడా (కృష్ణావతారమూర్తియైన శ్రీమహావిష్ణువా), పర్వతముల రెక్కలు వెరచిన ఇంద్రుని తమ్ముడా(అదితి మొదటి కుమారుడు ఇంద్రుడు, రెండవ పుత్రుడు వామనావతార విష్ణుమూర్తి)రాక్షస కుల శత్రువు అయినవాడా! సూర్యచంద్రులను కన్నులుగా కలిగిన వాడా!
నీ దృష్టి మాపై ప్రసరించినచో, సంసార బాధ నశించక ఎలా nnఇళువగలదు.

మత్స్యాదిభి రవతారై రవతారవతావతా సదా వసుధామ్
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాప భీతోహం (5)

ప్రపంచమును కాపాడుటకు నీవు మత్స్య కూర్మాది  అనేక అవతారముల నెత్తితివి. ఓ పరమేశ్వరా! భవ తాపముతో (సంసార తాపముతో) భయపడుచున్న  నన్ను కాపాడుము.

దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద
భవ జలధి మథన మందర పరమం దరమపనయ త్వం మే (6)

ఓ దామోదర (ఉదరము భాగమునతామరతూడు కలిగినవాడా)), గుణములకు  నిలయమై, సుందరమగు పద్మము వంటి ముఖము కలిగినవాడా! గోవిందుడా ( గోవులను , సకల ప్రాణులను చూసుకొనువాడా, అసలు గోః అన్నశబ్దమునకు వేదములు అన్న అర్థము కూడా ఊన్నది. మసత్యావతారములో వేదములను రక్షించినాడు కదా!)
సంసారమును, సముద్రమును మథించు మందర పర్వతము వలె,మథించువాడా, తీవ్రమగు (సకల విధములగు)  భయములను పోగొట్టుము.

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు (7)

ఓ నారాయణుడా, కరుణా మూర్తి, నీ పాదముల చెంత శరణు పొందుచున్నాను.
ఇట్లు ఈ ఆరుపాదములు కలిగిన షట్పదీ స్తోత్రం ఆరుపాదములు కలిగిన తుమ్మెద వలే నా ముఖమనే పద్మము నందు ఎల్లపుడు నెలకొని యుందువు గాక!

ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచితమ్ విష్ణు షట్పది స్తోత్రం సంపూర్ణం.

 

 

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి