శ్రీమచ్ఛంకర్ విరచిత సౌందర్య లహరి 3 వ శ్లోకము ఒక విశ్లేషణ

 

శ్రీమచ్ఛంకర్ విరచిత

సౌందర్య లహరి 3 వ శ్లోకము ఒక విశ్లేషణ

https://ajaraamarasukthi.blogspot.com/2025/05/3.html


సౌందర్యలహరి ఒక స్తోత్రమే కాదు, ఒక శాస్త్రము. చిచ్ఛక్తి స్వరూపమగు దేవతామూర్తి ఉపాసన ఇందులో ఇమిడి ఉన్నది. సౌందర్య అన్న శబ్దమునాకు సుందరి అన్న అమ్మవారి పేరు ఆలాబనము. అపర శంకర అవతారమూర్తులగు ఆదిశంకరులకు మాత్రమే ఈ స్తోత్రము వ్రాయ సాధ్యము. అట్టి మహా గ్రంథమునకు భాష్యము వ్రాసిన మహా పండితులగు సాధకులు ఉన్నారు.  ఆరచనా సారాంశమును తెలుఫూలవ చెప్పిన మహానుభానేను ఈ 3 వ వుల రచనలు చదివి ఈ 3 వ శ్లోక విశ్లేషణకు పూనుకొన్నానుయొక్క ప్రత్యామ్నాయ(సుబస్తితుతే). ఇందులో తెలుసుకోదగినదేమి కనిపించినా ఆ గొప్పదనము వారిదే! లోపములు మాత్రమే నావి.

మిగిలినది రేపు ......


2 వ భాగము

సౌందర్య అన్న శబ్దము  ఆ శక్తి పేరుకు ప్రత్యామ్నాయము (substitute) అని తెలుసుకొన్నాము.  సచ్చిదానంద స్వరూపమే సౌందర్యము. వారాశిని పోలిన ఆ సౌన్దర్యరాశిని మనము సంపూర్ణముగా గ్రహించగలిగే స్తోమత లేనివారము అని తెలిసే జగద్గురువులు లహరిని అనగా ఒక కెరటమును మనకు అనుగ్రహించినారు. దానిని అనుసరించితే మనకు మోక్షప్రాప్తి నిశ్చయము.

ఒక చెట్టుకు మూలము ముఖ్యము. చెట్టు నిలకడగా పెరుగుతూ పోవలేనంటే బలమైన పాతుకుపోయే గుణము ఉన్న మూలము ముఖ్యము. ఆ మూలమే ఈ స్తోత్రము యొక్క మొదటి శ్లోకము. ఈ స్తోత్రము సమయాచార సంప్రదాయములో నడుస్తుంది. లొల్ల లక్ష్మీధర పండితులవారు ఈ స్తోత్రమునకు భాష్యము వ్రాస్తూ ఈ విధముగా అంటారు. ‘ఇహ ఖలు శంకర భగవత్ పూజ్య పాదాః సమయ తత్వ వేదినః సమయాఖ్యాం     చంద్రకళాం  శ్లోక శతేన ప్రస్తువంతి’ సమయ అని పిలువబడే చంద్రకళ  స్వరూపిణి యగు అమ్మవారిని ప్రస్తుతించుచున్నది. శివశక్తులు ఉభయుల ఏకతత్వమును ఆరాధించుటయే సమయాచారము. అసలు సమయము అంటేనే ఏకత్వము. అందుకే ‘శివశక్త్యా యుక్తః ప్రభవితుమ్’ అని సౌందర్యలహరి ప్రారంభ శ్లోకముతో ప్రారంభమౌతూఉంది.  శివశక్తులు ఒకటాయితేనే ఈ సృష్టి ప్రారంభమైతుంది. ఆమాటే మొదటి శ్లోకములో తెలిపినారు జగద్గురువులవారు. ఆ శక్తి తోడు లేకపోతే పరమేశ్వరుడు స్పందించుట జరుగదు అని చెప్పబడినది ఈ శ్లోకములో. అంటే సృష్టిస్తి లయాలకు శివశక్తుల సమైక్యత అత్యంత అవసరము. ‘ఇచ్ఛాశక్తి సముపేతః శివః’ అని శాస్త్రవచనము. అంటే ఇచ్ఛతోనే శక్తి కలిసి ఉంటుంది. అందుకే ఇచ్ఛాశక్తిని జ్ఞానక్రియాశక్త్య వి భేదః’ అన్నారు. ఈ ఇచ్ఛా శక్తిని ఎల్లవేళలా జ్ఞాన క్రియాశక్తులు కలిసియే ఉంటాయి.     అదీ  మనము గమనించవలసిన విషయము.  అనగా పరమేశ్వర సంకల్పశక్తియే త్రిపుర సుందరి. ఆశక్తి హరిహరబ్రహ్మాదులచే ఆరాధించబడుతూ ఉంది. అయ్యవారిలో అమ్మవారు కలిసి యున్నది. వీరినుండి హరిహరబ్రహ్మాదులు, ఇంద్రాది దేవతలు ఆవిర్భవించుచున్నారు.  ఆ పరబ్రహ్మగు పరమేశ్వరుడు ఏ శక్తినయితే తన ఇచ్ఛా శక్తిగా తలపోయుచున్నాడో  ఆ శక్తియే త్రిమూర్తులు మరియు సకలదేవతాలూ ఆరాధించుచున్నారు. అలాంటితల్లిని స్తోత్రము చేయగలుగుతున్నామంటే అడిమన పూర్వజన్మ సుకృతమే! ఈ మొదటి శ్లోకములో అమ్మ గుణములను వర్ణించి అట్టినిన్ను నుతించినవారు ఎంనేనో పుణ్యకర్మలు చేసిఉంటారు. నాకు పూర్వజన్మ స్మృతి లేదు. నిన్ను స్తోత్రము చేయడాలచి ఆ కార్యమునకు గడంగుచున్నాను. అందుకే ‘ప్రణంతుం  స్తవతుంవ’ త్రికరణ శుద్ధిగా చేసే నమస్కారమును ప్రణతి అంటారు. ఆవిధముగా నమస్కరించుతూ నీ స్తోత్రము చేస్తాను అమ్మా! అంటున్నారు ఆదిశంకరులవారు.

రెండవ శ్లోకము అమ్మవారి పాద ధూళి కణమును గూర్చి తెలియజేయబడింది. సృష్ట్యాదిలోనే  శకత్తి ఉన్నది. ఆశక్తినే ఆదిపురుషుదాగు పరమేశ్వరుఆవహింప జేసుకొన్నా డు. ఆ శక్తిని స్త్రీ స్వరూపముగా భావించి పాదములను పద్మములతో పోల్చినాము.  ఆ పద్మము యొక్క పుప్పొడియే అమ్మ పాద ధూళి. అంతేకానీ కాలికి అంటుకొన్న మట్టి కాదు. రెండవ శ్లోక భావము ఈవిధముగా చెప్పుకొనవచ్చును. బ్రహ్మ అఅధూళిని పిసరంత తీసుకొని దానితో సృష్టికి నాంది పాలికినాడు. ఆ సృష్టిని శ్రీ మహావిష్ణువు తన అనంత శిరస్సులపై మోస్తూఉంటాడు. అంటే అమ్మ పాదధూళికి అంత ప్రాధాన్యత. లాయము పొందవలసిన సమామ్యయున శివుడు సృష్టినంతటినీ లాయము చేయగా వచ్చిన బూడిదను పూర్తిగా తన మెనికి అలాడుకొన్నాడట. తల్లి పాదరజముపై త్రిమూర్తులకు ఎంతటి అచంచల భావనో చూడండి. ఈ స్తోత్ర రచన మహానీయులైన జగద్గురువులు శంకరులవారికే చెల్లినది. ఇక ఆలస్యము లేకుండా మూడవ శ్లోకమునకు పోదాము.

రేపు చివరి భాగము .......

3 వ భాగము

విద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ

జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ ।

దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ

నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి ॥ 3 ॥

 సౌందర్యలహరి ఒక అనిర్వచనీయమైన, అత్యంత ప్రతిభాన్వితమైన స్తోత్ర రాజము. అవిద్యలో వున్నవారి అజ్ఞానమును పోగొట్టే అగణిత  సూర్య మండలములు కలిగిన ద్వీపముగా ఆ తల్లి భాసిల్లుచున్నది. పరతత్వ జ్ఞాన  శూన్యతయే ఆవిద్య. సమస్తజగదాయధారజ్ఞానమే పరతత్వము. ఆవిద్య అన్న అంధకారము ఒక సూర్యుని వెలుగుచే అంతరహుతము, అంటే మాయము, కాదు. ఈ అవిద్యలో జన్మ జన్మాంతర అజ్ఞాన తిమిరము దాగియున్నది. అందుచే అది పోగొట్టుటకు ఒక్క సూర్యుని వెలుగు చాలదు. అనేకములైన సూర్యుల వెలుగు కావలసి వస్తుంది. అట్టి సూర్య సముదాయమును కలిగినది ఆ తల్లి .

ఉద్యాద్భాను సహాస్రాభా’ అనగా అంటే ఆగణితములైన సూర్యబింబమూల కాంతి కలిగినది అని మన ఋషులు ఆ తల్లిని స్తుతించినారు. వైశంపాయనుడు ‘సహస్ర సూర్య కాయా భాంతి’ అనగా ఈ విశ్వములు లెక్కకు మిక్కుటములైన సూర్యులు ప్రకాశించుచున్నారు అని చెప్పినాడు. ఇక శ్లోకము యొక్క రెండవ పాదమునకు వస్తాము.

జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ । జడము (inert) అంటే చేతన అనగా స్పందన లేనిది. దానిని చైతన్యవంతము చేసేది అమ్మవారు. అమ్మ కూర్చే చైతన్యమునకు ఒక గొప్ప ఉపమానమును కూర్చినారు శంకరులవారు. అమ్మ యొక్క సౌందర్యము సౌష్టవము అత్యంత సున్నితము. ఆమె మనసు ఎనకెంత సున్నితమో మన ఊహకందదు. అందుకే ఆ మనసును అత్యంత సున్నితమైన (మన బాహ్య ప్రపంచమున) పుష్ప గుచ్ఛమునకు పోల్చినయారు అందులోని చేతనము అన్న మకరందము ఒక జీవఝరి వలె ప్రవహించుతూనే ఉంటుంది. అందుకే ఆమెకు గళ ఒక పెరు ‘లలిత’ ఆమె దమనము గావించిన రక్కసుని పేరు ‘భందాసురుడు’ అంటే ‘మూర్తీభవించిన జడుడు’. మన  పురాణములలోని పేర్లు ఎంతటి అన్వర్థములో చూడండి.

స్రుతి అనగా ప్రవాహము. ‘ఝరి’ అనగా స్రవంతి. ఆ తల్లి చేకూర్చే చైతన్యము ‘స్తబక  సుధా స్రవంతి’ అనగా పుష్పగుచ్ఛంు నుండి జాలువారు నిరంతర ప్రవాహము. అసలు ప్రవాహ లక్షణమే చైతన్యము కదా! ఇక మూడవ పాదమునకు వద్దాము.

‘దరిద్రాణాం చింతామణిగుణనికా’

‘గుణము’ అన్నమాటకు ఒక అర్థమ దారము, తీగ అని కూడా సందర్భోచితముగా గ్రహించవచ్చును. ‘గుణనిక’ అంటే కూర్చబడిన దారము. ఏమి కూర్చినారు అంటే  చింతామణులను. చింతామణి అంటే ఏమిటి? చింత అంటే కోరిక. చింతామణి అంటే కోరిన కోర్కెల తీర్చేది అని అర్థము. ఒక చింతాయమణే ఎట్టి కొరికనైనా తీర్చగలిగితే అట్టి చింతామనుల హారము కల్గిన తల్లి మన ఆనంతములైన కోరికల తీర్చగలదు అనేకడా అన్వర్థము.  ఇటువంటి ఉపమానములు శంకరుల వారికి వెన్నతో బెట్టిన విద్య.

ఇక నాలుగవ పాదమునకు వస్తే

జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి

జన్మ జలధౌ అంటే సంసార సాగరము. ఈ సంసార సాగరములో మునిగిన వానిని ఆది వరాహమూర్తి యైన విష్ణువు తన కోరలతో లేవనెత్తి వెలికి తీసినట్లు అమ్మవారు మనల నుద్ధరిస్తారు అని చెబుతున్నారు శంకరులవారు.

లొల్ల లక్ష్మీధర పండితులవారు ‘సమాఖ్యాం చంద్రకళాం ప్రస్తువంతి’ అన్నారు, అంటే ‘సమయ’ అన్న చంద్రకళను ప్రస్తువంతి అంటే స్తుతిస్తున్నారు అని అర్థము. అమ్మవారిది 16 వ కళ. చంద్రునికున్న కళలు 15. ఇవి దినదిన పురోగ్యమనము దినదిన తిరోగమనము 15 రోజులకోమారు చేస్తూ ఉంటాయి. అమ్మవారిది 16 వ కళ. దీనికి పూర్వధాన్యము తిరోధాన్యము ఉండవు. ఎప్పటికీ ఒకేవిధముగా స్థిమితముగా ఉంటుంది. ఈ 15 కళాలకూ మూలము ఆ కళే! అంటే కాలమును నియంత్రించే ఆ కళలకు మూలము ఈకళే! ఈచంద్రకళ తెల్లగా మెరిసే ఆదివరాహ దం ష్ట్ర వలె ప్రకాశించుటయేగాక  వరాహమూర్తి భూమిని లేవనెత్తినట్లుగా మనలను భవసాగరము నుండి బయటకుదీసి మనలను తన అక్కున చేర్చుకొంటుంది.  దీనినే సదా  కళ, ధృవ కళ, సమయా కళ అని పెరు. ఇది యోగ శాస్త్ర ప్రతిపాదితము. 

ఒక మాట ఈ శ్లోకమునకు చతుర్విధ పురుషార్థములతో అన్వయమును గూర్చి ముక్తసరిగా ముచ్చటించుకొందాము.  మొదటి పురుషార్థమగు ‘ధర్మము’నకు దారితీసే మార్గమును ఏవిధముగా సుగమము చేయుచున్నదో గమనింతము.

అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ

జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ ।

అంటూ పైన తెలిపిన మొదటి రెండు పాదములలో ధర్మము పట్ల స్పష్టత శాస్త్రజ్ఞానపు ఎరుక కలిగించుట కోసమై అమ్మ ఆవిద్యను జడతవాన్ని పోగొడుతూవుంది. ఆవిధముగా ధర్మాపేక్షకు దారి తీయించు చున్నది.

ఇక అర్థ కామములు. ఇవి పరస్పర ఆధారితములు. కామము లేనిదే అర్థము లేదు అర్థము లేనిదే కామము లేదు. అందుకే సకల కొరికలనూ తీర్చుటకు 

దరిద్రాణాం చింతామణిగుణనికా

అంటే సకల దారిద్ర్యములను తీర్చే చింతామణుల హారము ఈ తల్లి. అణే అసలు ఒక చింతామణే నిరంతరమూ, నిరంతారాయముగా కోర్కెలు తీరుస్తుంది. మరి అమ్మవార మెడలో చింతామణుల ఒక హారమే  ఉంది. అడి కామితములనూ తీరుస్తుంది, ధనమునూ చేకూరుస్తుంది. అందులో కూడా మొదటనే మనలను తల్లి ధర్మబద్ధులను గావిస్తున్నది కాబట్టీ మన అర్థకామములు కూడా ధర్మ బద్ధముగానే ఉంటాయి కదా! అటువంతపుడు ఆ శక్తిని ఆశ్రయించిన వానిని 

జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి ॥

జన్మజలధి నుండి తేలికగా లేవనెత్తి మోక్షప్రాప్తి వించుతుంది. అర్థకామములను ఒకటిగా జోడించితే గాఅమ్మను  త్రిపుర సుందరి అన్నారు. ఆటలలియొక్క పావన భావనయే మనకు మోక్షప్రాప్తి కలిగించుతుంది.

స్వస్తి .


Comments

Popular posts from this blog

చౌద్వీఁ క చాంద్ హో - ఇందుబిమ్బమండునా

హిరణ్య వర్ణా (సూర్య స్తుతి)