Posts

Showing posts from May, 2025

నా తెలుగు

  నా తెలుగు  https://ajaraamarasukthi.blogspot.com/2025/05/blog-post_30.html Thug Life అన్న సినిమాలో నటించిన కమలహాసన్ గారు బహుశా బంగళూరు లొ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ శివరాజ్ కుమార్ గారిని చూపించి ఈయన మా మిత్రుడే, కన్నదాభాష తమిళము నుండి పుట్టినదే కదా! అన్నాడు. ఆమాటను ఒప్పుకోని అన్ని కన్నడ వర్గాలు నిరసనాలకు ప్రదర్శనలకు దిగినాయి. ఈ విషయము పై విశ్లేషించుతూ ఒక సాక్షాత్కార్య సంభాషణ (Jnterview)లో ఒక పాత్రికేయుడు ఇంచుము, తమిళము, దాక్షిణాత్య భాషలలొ మొదటిది పైగా ఆ భాషలోనే మొదట గ్రంథ రచన మొదలయినది. ఈ మాటలకు వత్తాసుగా, తోల్‌కాపియం, సగం కవుల రచనలను ఉటంకించుతారు. ఇది ఆగస్త్యుని రచనగా చెబుతారు. ఆగస్త్యుడు  విశ్వనాథుని ఆజ్ఞానుసారము ఉత్తరము నుండి దక్షిణమునకు వచ్చిన మహర్షి. అక్కడి అప్పటి స్థానికులకు అనుకూలముగా ఈ భాషను అందజేసినాడని ప్రతీతి. కంచి నాదచేదేవుడగు చంద్రశేఖర సరస్వతి స్వామివారు సంస్కృతము సకల భాషలకు మూలముకాగా, నవ వ్యాకరణములలో తమిళ వ్యాకరణము మొదటిదని చెప్పినారు. వ్యాకరణము లేని భాషలను మాట్లాడేవారు నేటికీ ఎందరో ఉన్నారు. కావున తమిళము ఆది దక్షిణాది భాషయానుటకు ఆధారాలు లేవు. ...

ఆది శంకరులవారి కాలనిర్ధారణ

ఆది శంకరులవారి కాలనిర్ధారణ https://ajaraamarasukthi.blogspot.com/2025/05/blog-post_27.html ఆది శంకరులవారి కాలనిర్ధారణ (ఇది ఉపోద్ఘాతము మాత్రమే! రేపు విషయము ప్రారంభించుతాను,) చరిత్ర మన గతవైభవమునకు అద్దము. కుహనా చారిత్రికులు హీన చరిత్ర గలవారిని Heroలగా చేసి పాఠ్యాంశముల పేరుతో మన నెత్తిన రుద్దినారు. కన్నుతెరిచే సమయము మనకు  పట్టినది 70 సంవత్సరములు. Better Late Than Never అన్న ఆంగ్ల సామెత ప్రకారము మనము ఇప్పటికైనా కళ్ళుతెరచి మన గత  ప్రాభవమును గూర్చి తెలుసుకొనుట ప్రారంభించినాము. చరిత్ర అను మణిహారమునకు పథకము జగద్గురువు శంకరులవారు. వివరముగా వారిని గూర్చి తెలుసుకొండి. ఈ వ్యాసము సాదికారుగా శంకరులవారి కాలనిర్ణయము చేయుచున్నది. జగద్గురు శంకరాచార్యులవారి కాలము  ఈ ఆర్యమత అనుయాయులు కనీసము ఆయనను స్మరించుకుంటే అంతకు మించిన కృతజ్ఞత వేరొకటి లేదు. నా వంతుగా ఆ అపర శంకరులకు పాదాభివందనము చేస్తూ వారి కాలమును గూర్చిన సందేహ నివృత్తి చేయ ప్రయత్నిచినాను ఈ వ్యాసమను చదివి మీరు తెలుసుకోవాలన్నది నాతపన.అసలు ఎప్పుడో జరిగిపోయినడనికి  ఈ ఒక్క శ్లోకము ఆయన గొప్పదనమును చెబుతుంది.ఆ శ్లోకమునకు ముందుగా ఈ విషయమున...

శ్రీమచ్ఛంకర్ విరచిత సౌందర్య లహరి 3 వ శ్లోకము ఒక విశ్లేషణ

  శ్రీమచ్ఛంకర్ విరచిత సౌందర్య లహరి 3 వ శ్లోకము ఒక విశ్లేషణ https://ajaraamarasukthi.blogspot.com/2025/05/3.html సౌందర్యలహరి ఒక స్తోత్రమే కాదు, ఒక శాస్త్రము. చిచ్ఛక్తి స్వరూపమగు దేవతామూర్తి ఉపాసన ఇందులో ఇమిడి ఉన్నది. సౌందర్య అన్న శబ్దమునాకు సుందరి అన్న అమ్మవారి పేరు ఆలాబనము. అపర శంకర అవతారమూర్తులగు ఆదిశంకరులకు మాత్రమే ఈ స్తోత్రము వ్రాయ సాధ్యము. అట్టి మహా గ్రంథమునకు భాష్యము వ్రాసిన మహా పండితులగు సాధకులు ఉన్నారు.   ఆరచనా సారాంశమును తెలుఫూలవ చెప్పిన మహానుభానేను ఈ 3 వ వుల రచనలు చదివి ఈ 3 వ శ్లోక విశ్లేషణకు పూనుకొన్నానుయొక్క ప్రత్యామ్నాయ(సుబస్తితుతే). ఇందులో తెలుసుకోదగినదేమి కనిపించినా ఆ గొప్పదనము వారిదే! లోపములు మాత్రమే నావి. మిగిలినది రేపు ...... 2 వ భాగము సౌందర్య అన్న శబ్దము   ఆ శక్తి పేరుకు ప్రత్యామ్నాయము ( substitute ) అని తెలుసుకొన్నాము.   సచ్చిదానంద స్వరూపమే సౌందర్యము. వారాశిని పోలిన ఆ సౌన్దర్యరాశిని మనము సంపూర్ణముగా గ్రహించగలిగే స్తోమత లేనివారము అని తెలిసే జగద్గురువులు లహరిని అనగా ఒక కెరటమును మనకు అనుగ్రహించినారు. దానిని అనుసరించితే మనకు మోక్షప్రాప్తి నిశ్చ...

శ్రీమచ్చంకరాచార్య విరచితం శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం

  శ్రీమచ్చంకరాచార్య విరచితం  శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం https://ajaraamarasukthi.blogspot.com/2025/05/blog-post.html అవినయ మపనయ విష్ణో   దమయ మనః శమయ విషయ మృగతృష్ణామ్ భూతదయాం విస్తారయ తారయ సంసార-సాగరతః ( 1) ఓ విష్ణు మూర్తీ! నా అవినయమును పోగొట్టుము అంటే నాలోని అహంకారమును పోగొట్టుము. నాకు మనోనిగ్రహమును ప్రసాదించుము , ప్రాపంచిక విషయములనెడి   ఎండమావులను రూపుమాపుము , సర్వ ప్రాణుల (భూతదయ) యందు దయను పెంపొందింపుము , సంసార సాగరము నుండి బయటపడుటకు నాకు మార్గము చూపించుము. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్ఛిదే వందే ( 2) ఆకాశ గంగను మకరందముగా సచ్చిదానందమును పరిమళముగా కలిగి సంసార భయ దుఃఖములను నశింపచేసేవి అయిన శ్రీపతి (లక్ష్మి దేవి భర్త అగు విష్ణువు) యొక్క పాద పద్మములకు నమస్కరించుచున్నాను. అసలు శ్రీపతి అంటే సకల సంపదకూ అధిపతి. సంపద అంటే ధనము మాత్రమే కాదు విద్య, వివేక, వినయ, సద్గుణ, బంధు,   మొదలగుణవన్నీ సంపదలే! సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీన స్త్వమ్ సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ( 3) ఓ అనాథ నాథ , పరమ సత్యమును గ్ర...