ధర్మచింతకులు తెలియ వలసిన విషయాలు

 ధర్మచింతకులు తెలియ వలసిన విషయాలు


సప్తర్షులు 


కశ్యపో త్రిః భరద్వాజూ విశ్వామిత్రోచ గౌతమఃl

వషిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః తథాll

ఈ ఏడుగురు వైవస్వత మన్వంతరపు సప్తర్షులు.

****************************

మనకు జంతువులకు గల తేడా 

ఆహార నిద్రా భయ మైధునంచ సామాన్యమేతత్ పశుభిన్నరాణాంl

ధర్మోహితేషామధికో విశేషాం ధర్మేన హీనః పశుభి స్తమానాఃll

ఆహారము, నిద్ర, భయము, మైధునము, పశువులకు మనుషులకూ సమానమే! కానీ, ధర్మవర్తనము, దానాగుణమును కలుపుకొని, మరియు సాటిమానవ హితము అన్నవి 

రెండూ మానవుల కొరకు పరమాత్మ ఏర్పరచిన సుగుణాలు.  పాటించితే దైవ ప్రియులము లకుంటే దేవనామప్రియులం(అంటే మూర్ఖులము అనగా జంతు సమానులమే!

)********************************

జగద్గురువు ఆదిశంకరులవారు 

దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే l

సయేవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్యనాయకఃll

దూసహతాచారములను ఖండించి, శిష్టాచారములను ప్రతిష్ఠించుటకు భూతలము పావనము చేయనుద్భవించిన  జగద్గురువులు శంకరులవారు సాక్షాత్ కైవల్యాణాయకూడగు శంకరుడు గాక వేరెవ్వరు?

****************************

ఒక జిజ్ఞాసువు వ్యాకరణమనకు సంబంధించి ఒక ప్రశ్న అడిగినాడు. నిజానికి నేను ఆంధ్రము, వ్యాకరణము అభ్యసించలేదు. కానీ నాకు తెలిసిన మేరకు ఆ సందేహమును తీర్చ ప్రయత్నించినాను. రెండు పదాలు ఉదాహరణకు తీసుకొందాము. 1. సుంనము, 2.సున్నము . ఈరెండు పదాలూ పలుకుటకు ఇంచుమించుగా ఒకేమాదిరిగా ఉంటాయి. వ్రాతలో రెండవాడే వ్రాస్తాము కానీ మొదటిది వ్రాయము. 'ను పూర్ణానుస్వారము అంటారు. ఈ పూర్ణానుస్వారము తరువాత తాలయము(దవడాలతో పాలికేది) దంతయము(పళ్ళ సహాయముతో పాలికేది, కంఠ్యము ( కంఠము నుండి వెలువాడేది) మొదలగునవి ఓష్ఠ్యము తారువత పూర్ణానుస్వార యుక్తముగా వస్తే ''వత్తు రాడు. '0' మాత్రమే వస్తుంది. అదే పైన తెలిపిన అక్షరములు ఓష్ఠ్యము వచ్చినతరువాతనయితే '' వస్తుంది.  తెలుసుకొనగలరు.

**************************************



Comments

Popular posts from this blog

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి

విద్యారణ్యులు - విజయనగరము