నాసదీయ సూక్తము - Big Bang Theory 1వభాగము

విశ్లేషకుడు : చెరుకు రామ మోహన్ రావు.

https://ajaraamarasukthi.blogspot.com/2025/01/big-bang-theory-1.html

వేదాలు అపౌరుషేయాలు. అంటే , కావ్యపురాణేతిహాసముల మాదిరి వేదాలు మానవులు రాసినవి కావు. వేద వాఙ్మయములోని సంస్కృత భాషకు కావ్యపురాణేతిహాసముల సంస్కృతమునకు ఆంతర్యము ఉంటుంది. వేద భాషలో అనేకానేక నిగూఢా ర్థాలు  ఉంటాయి. అల్పజ్ఞుడనయిన  నాకు అవి అన్నీ అంతుపట్టే విషయాలు కావు. అందుచేత నా మేధోపరిధి లోపల, నేను తెలుసుకొన్న మేరకు ఈ నాసదీయ సూక్తమును సాధారణ తెలుగుభాషలో మీ ముందు ఉంచుచున్నాను. ఈ సూక్తమును ఎంచుకొనుటకు ముఖ్య కారణము ఇది విశ్వ ఆవిర్భావమును గూర్చి తెలుపుతుంది.

ఒక పని చేయుటకు మొదట ఏదో ఒక శక్తి ఉండవలె,ఆ పని చేయుటకు ఆ శక్తికి సంకల్పము కలుగవలె. అట్టి శక్తినే మనము దైవము అంటూవున్నాము . నన్ను ఈపనికి

పురిగొల్పుట ఆయన సంకల్పము. ఈ విస్పోటమును కలిగించుటకు ఆ పరమాత్మకే సాధ్యము. ఇందు నేను సందేహించవలసినది ఏమాత్రమూ లేదు.

 

అంచనాలకు అందని కాలములో విస్ఫోటము జరిగితే నేటి శాస్త్రజ్ఞులు ఈ విషయమును గూర్చి 1929లో ఆలోచింప మొదలిడినారు.

విశ్వము  ఉద్భవించడాన్ని, ఆనాటి నుండి తరువాత జరిగిన విశ్వ పరిణామాన్నీ వివరించే సిద్ధాంతాలలో ఒకటి Big Bang. దీన్ని మహా వ్యాకోచం అనవచ్చు. అనేక స్వతంత్ర పరిశీలనల ఫలితంగా ఏర్పడిన వాదము ఇది. ఇది విశ్వం యొక్క ఖగోళ భౌతిక నమూనా. 1929 లో ఎడ్విన్ హబుల్ పరిశీలనలలో 'నక్షత్ర మండలాల శక్తి ఆ పరతత్వమునకు  మధ్య దూరాలు వాటి Red Shift కు అనులోమానుపాతంగా వున్నాయని గుర్తించినాడు.

ఇప్పుడు అతి క్లుప్తముగా  Red Shift ను గూర్చి తెలియజేస్తాను.

రెడ్ షిఫ్ట్' అనేది ఖగోళ శాస్త్రవేత్తలకు కీలకమైన విషయము. కాంతి యొక్క తరంగమును దూరముగా విస్తరింప జేయవచ్చు. కాబట్టి కాంతి లోని వర్ణ వికిరణములో (7 వర్ణములలో) ఈ తరంగము ఎరుపు భాగం వైపు  'మార్చబడినట్లు' కనిపిస్తుంది. పరిశీలకుడికి సంబంధించి ధ్వని మూలం కదిలినప్పుడు ధ్వని తరంగాలకు ఇలాంటిదే జరుగుతుంది.

ఈ పరిశీలనన ఫలితంగా 'విశ్వం విస్తరిస్తూ  ఉంది' అనే నిర్ధారణకు రావడం జరిగింది. నేటికినీ విశ్వం విస్తరిస్తూ ఉంది అనగా, అది ప్రారంభ దశలో విపరీతమైన ద్రవ్యరాశి, ఉష్ణాన్ని  కలిగి వుండేదని తేటతెల్లమౌతుంది.

ఇపుడు భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత హాన్నెస్ ఆల్ఫ్ వెన్, ఈ మహావిస్ఫోట సిద్ధాంతాన్ని, "సృష్టి గురించి చెప్పడానికి 'శాస్త్రీయ కాల్పనికం'"గా అభివర్ణించినాడు. "విశ్వపు అనంత స్థితి, అనంత కాలంగా వున్నదని నిరూపించడానికి  తగిన 'హేతువులు లేవు' అని చాటీనాడు. విశ్వ సృష్టి, నాలుగువేల లేక 20 బిలియన్ల సంవత్సరాల వయస్సు కలిగివున్నదని నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవు అని ఈ సిద్ధాంతాన్ని తోసిపుచ్చినాడు.

ఆధునిక శాస్త్రజ్ఞులలో  ఇప్పటికీ ఇంత వైరుధ్యము ఉన్నా నాడే సృష్టి రహాస్యమును సవిస్తరముగా, సందేహము లేకుండా సంశ రహితముగా మన ముందు ఉంచినది నాసదీయ సూక్తము. నాసదీయ సూక్తము ఋగ్వేదము  యొక్క 10వ మండలము లోని 129వ సూక్తము . ఇక అసలు విషయము చదవండి.

అసత్ అంటే అవాస్తవమైనది, అసంబద్దమైనది, ఆస్తిత్వము లేనిది, వాస్తవదూరమైనది అన్నఅర్థమున వాడబడుతుంది.

సత్ , అంటే ",ఆస్తిత్వము కల్గినది " లేదా "ఉనికి కల్గి యుండునది, వాస్తవమైనది",లేదా "సంపూర్ణమైనది " అని అర్థము. , ఇది కలిగినది ఇక్కడ "వాస్తవికత". అస్థితత్వము అనే పదానికి మొత్తం ఉనికి అని అర్థం. దేవుడు, వాస్తవికత, ఉనికి, పర బ్రహ్మం మరియు సంపూర్ణం, అన్నీ ఒకే పరమాత్మను సూచించే పర్యాయపదాలు.

వ్యాసము సవిస్తారముగా వ్రాయకపోతే మన పూర్వుల గొప్పదనము గ్రహించుట కష్టము. Anduk

ఇక నాసదీయ సూక్తము లోని మొదటి శ్లోకమునకు వద్దాము:ె రెండు భాగములుగా జెసి మీ ముందుంచుచున్నాను. రెండవభాగముంచునపుడు మొదటి భాగము కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీరు శ్రద్ధతో చదివి మనపూర్వుల గొప్పదనము గుర్తించమని నావేడికోలు.

మిగిలినది రెండవ భాగములో..........



Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి