2024 సంవత్సరపు పద్య తోరణము

 

2024 సంవత్సరపు పద్య తోరణము

కామాక్షీ స్తోత్రము  - రచన : చెరుకు రామ మోహన్ రావు

 

2024 సంవత్సరపు పద్య తోరణము

కామాక్షీ స్తోత్రము  - రచన : చెరుకు రామ మోహన్ రావు

 

కామాక్షీ పంచ రత్నావళి స్తోత్రం(కామాక్షి స్తుతి)

 

1.       కామారాతి మనోతటాక జలజాం కామ్యార్థ ఫలిత ప్రదాం

కాంచీ క్షేత్ర విరాజితాం సురనుతాం కరుణా కటాక్షాన్వితాంl

కంసారాతి సహోదరీం భగవతీం కాత్యాయనీమంబికాం

కామాక్షీం కలితారణోద్యమ ప్లవాం  కారుణ్యవారానిధింll 

 

2.   ఓంకారాంకిత పంజరాంతర శుకీం హ్రీంకార బీజాక్షరీం

ముక్తావిద్రుమహేమనీలమకుటాం మాతంగ వనవాసినీంl

ఇన సోమాగ్ని త్రినేత్ర ధారిణి పరాం ఈశాన అర్దాంగిణీం

కామాక్షీం కలితారణోద్యమ ప్లవాం కారుణ్య వారానిధింll

 

3.    కాన్చీనూపుర రత్నకంకణ లసత్ కేయూర హారోజ్వలాం

కాలాకాల దయార్ద్ర కల్ప క్షితిజాం కర్పూరికా చర్చితామ్l

కల్హారాంచిత-హస్త-యుగ్మ-లసితాం కరుణ్య కల్లోలినిమ్

కామాక్షీం కలితారణోద్యమ ప్లవాం కారుణ్య వారానిధింll

 

4.    లీలాలోలక రత్నకుండల యుతాం నీలాభ్ర వస్త్రాన్వితాం

మాతా మంగళదాయినీం సురనుతాం పీయూష నేత్రాన్వితాంl

శుంభద్వీర్య సమాహితాం ధృతియుతాం ఆవేశ వ్యారోషితాం

కామాక్షీం కలితారణోద్యమ ప్లవాం కారుణ్య వారానిధింll

 

5.    శ్రీ వాణీ ఇంద్రాణి సేవ్య ప్రధితాం శ్రీగంధ వక్త్రాంచితాం

శర్వాణీ శరదిందు మోహనముఖాం కమలాంఘ్రి సంసేవితాంl

ప్రాచీనం పర మాతృకాం బుధనుతాం కాంచీపురాదీశ్వరీం

కామాక్షీం కలితారణోద్యమ ప్లవాం కారుణ్య వారానిధింll

 

చెరుకు రామ మోహన్ రావు.

విశ్వావసు 

విశ్వవాసతతికి విపుల సంపద గూర్చి 

విశ్వ వసువు ఇవ్వ విరివివి గాను  

విశ్వశాంతి యనెడు వింజామరల గాలి 

వీచదొడగె జూడు విశ్వమంత 

సంపద లిచ్చి సత్వరము సద్గుణ సాంద్రత తోడితెచ్చి తా 

నింపగు సత్ప్రవర్తనము సజ్జన సంగతి చేరనిచ్చుచున్

 సొంపగు శాంతిసౌరభము సుంతయు వీడక పిల్లపాపతో 

పెంపు గడించు నీ గృహిణి పేరిమి గూర్చ యుగాది ప్రజ్ఞతోన్  

 

 

 

 

1. వల్లీ వల్లభ వత్సలార్ద్రత మతే హె దేవసేనా పతే

విఘ్నేశానుజ!వీర!శౌర్య వితతే!వేదాంత సూత్రాంబుధే l

మల్లీ మాలతికా సుమార్చిత మతే! మాంగళ్య శోభాకృతే

సర్వ వ్యాకుల మాత్మతత్వ విరతం స్కంద!ప్రభో!పాహిమామ్ll

 

2. విశ్వేశ ప్రియ పుత్ర!మిత్ర విబుధానీకై స్సదావంద్య  వే

దారణ్యాశ్రిత పుండరీక మనిశం దాక్షాయణీశాత్మజం  

సర్వారిష్ట నివారకం శుభకరం షణ్మాతృకానందనం

వందే షణ్ముఖ!దైత్య భంజక మణే వందారు కల్పా కృతే  ll

3.భస్మాలంకృత భాసమాన వపుషం సంపూర్ణ తేజోనిధీం

బాధాఖేద విమోచనే కృతమతిం భకైక దివ్యద్వరం l

బర్హోత్తంసిత  వాహనం బహుముఖం బాలార్క వర్ణద్యుతిమ్

భాగ్యానంత వరప్రదాన నిరతం భాస్వన్మతిం భావయే ll 

4. సౌవర్ణాన్విత రత్న భూషణ మణే సదభక్త చింతామణే

తారానాయక శేఖరాత్మజ వారం సంతోష వారాం  నిధింమ్ l

సుబ్రహ్మణ్య మానంత దివ్య చరితం  శుద్ధాత్మ విద్యా మృతం

వందే స్కంద గుహాభిధాన రుచిరం వల్లీశ మస్మద్గురుం ll

5. గంగాసంభవ గాత్ర భూషణ మతే  కారుణ్య సీమాకృతే

ఛందోబద్ధ సుధారాసాప్లుతమతం సుశ్లోక దివ్యాక్షరమ్  l

స్వామిన్ సంయమి రాట్ తవాంకితమిదం  సారస్య సంపూరితం  

ప్రాప్నోతీప్సిత భోగభాగ్య మఖిలం య స్తోత్ర మేతత్ పఠేత్ ll

 

గౌరీమాత సుతా సుచరితా కందర్ప వైరీ ప్రియా

కారుణ్యాలయ కల్పభూజ  కపిలా  గాంభీర్య వక్త్రాంచితా

ధారావర్ధితప్రేమసాగరమయా దారిద్ర్య విధ్వంసకా

ఘోరోపద్రవ హంత శాంత సరితా  గోప్రీతి ప్రతిబద్ధకా !

తల్లిని బాయగా తపన తల్లట చెందక తండ్రి నిల్చి నా

విల్లుగ తానె ఆర్జనుని విజ్ఞత గూర్చుచు లక్ష్య కక్ష్య నే

తల్లటలేక  కూల్చి తగు తానక మర్పడ జేసి వేడె నా (తానకము=నివాసము)

తల్లికి తల్లినిన్ తగిన ధర్మ నిబద్ధత తొడ పెంచగాన్    

కృపణుడి ఔదార్యంబును

కృప తెలియని వాని అండ కూళల చెలిమిన్

కృపిటకశౌచవివర్జిత

కూపము కొరగానివిలను గుణమతి రామా!

కరగని కర్పూరమ్మును

పెరగని యొక చంటిబిడ్డ పేరని నేయిన్

పరుగును తీయని లేడియు

పరిపక్వత లేనివాడు భారము భువికిన్ 

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి