గణితము అచ్యుతాయనమః - అనంతాయనమః

 

                       గణితము 

అచ్యుతాయనమః - అనంతాయనమః

https://ajaraamarasukthi.blogspot.com/2024/12/blog-post_12.html

సమస్త శాస్త్రములకు మూలము గణిత శాస్త్రము. ఆవిషయమును వేనకు వేల సంవత్సరములకు పూర్వమే మన శాస్త్రజ్ఞులు గుర్తించినారు. గణిత అంతరిక్ష ఖగోళ శాస్త్ర విషయములను వేదములయందే ఉతంకించబడినది. తురుష్కులు, బుడుతకీచులు తదితర అప్రాచ్యులు మన శాస్త్రములను సంస్కృతిని తమ శక్తివంచన లేకుండా సర్వనాశనము చేసినారు.

అయినా మన మేధావులు కొందరు మన గణితవైభవమును దుర్మతుల దురంతములనుండి కాపాడి మనకు అందజేసినారు. వారి దయవలన మనకు ఎందఱో మహనీయులగు గణిత శాస్త్రజ్ఞుల గూర్చి తెలుసుకొనగల్గినాము. వారిలో కొందరిపెర్లను ఈ క్రింద తెలియజేయుచున్నాను,

పాణిని, పింగళుడు,వరాహమిహిరుడు, ఆర్యభట్టు, యతి వృషభుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు-1,

శ్రీధరుడు, మహావీరుడు, పావులూరి మ ల్లన - మొదటి తెలుగు గణిత శాస్త్రవేత్త, ఆచార్య హేమచంద్రుడు,

భాస్కరాచార్యుడు-2, నారాయణ పండితుడు, మాధవుడు, పరమేశ్వరుడు, నీలకంఠ సోమయాజి

శంకర వారియార్, రఘునాధ శిరోమణి, జ్యేష్టదేవుడు, మునీశ్వరుడు, కమలాకరుడు, జగన్నాధ సామ్రాట్. ఇవి కొన్ని ప్రముఖమైన పేర్లు మాత్రమే! ఇక ఆధునికులలో శ్రీనివాస రామానుజన్ లాంటివాళ్ళు అనేకులు ఉన్నారు.

Equation of the form nx²+1= x2ny2=1,            where n is a given positive nonsquare intiger and integer solutions are sought for x and y.

పై సూత్రము Pell పేరుతో 18 వ శతాబ్దమున ప్రాచుర్యము లోనికి వచ్చినది కానీ 12 వ శతాబ్దమువాడైన భాస్కరాచార్యుడు-2 ఈ సూత్రమునకు ఆద్యుడు. అంటే తెల్లవారు ముష్కరులూ మరియు తస్కరులు అనియే కదా అర్థము. అట్టి భాస్కరులవారు ఆనంతము అచ్యుతమును గూర్చిన ఎంత గొప్ప పోలిక పరమాత్మ పరంగా ఇచ్చినారో చూడండి.

బీజగణితము, త్రికోణమితి యందు ఆనంతమునకు (Infinity)  అత్యంత ప్రాధాన్యముంటుంది. అంతము లేనిది ఆనంతము అన్న విషయము అందరకూ తెలిసినదే!

దీనిని మనము పైనచెప్పుకొన్న భాస్కరాచార్య 2, తన 'లీలావతి' లొ ఈవిధముగా వర్ణించినాడు.

అస్మిన్ వికారః ఖహరేన  రాశా 

వపి ప్రవిష్టే ష్వపి నిఃసృతేషుl

బహుష్వపి స్యాల్లయ సృష్టికాలే

అనంతే అచ్యుతే భూతగణేషు యద్వత్ll

ప్రళయకాలములో జీవులందరూ పరమాత్మలో కలుస్తారు.సృష్టి కాలములో జీవులంతా పరమాత్మ నుండి బయటికి వస్తారు.అనంతుడు (అంతము లేనివాడు) అచ్యుతుడు (చ్యుతిలేని వాడు అనగా నాశము లేనివాడు అనగా తరగని వాడు)అయిన పరమేశ్వరునిలో జీవరాశులన్నీ ప్రవేశించినపుడు ఆయనలో మార్పులేదు. అదేవిధముగా ఈ జీవరాశులన్నీ పరమేశ్వరుని నుండి వెలుపలికి వచ్చినపుడు అనగా పరమాత్మ నుండి విడిపడినపుడు కూడా ఆయనలో ఏ మార్పూ రాదు.అదేవిధముగా '0' హారమున (Denominator) గల సంఖ్యకు ఎంత పెద్ద సంక్గ్యను కలిపిననూ లేక తీసివేసిననూ ఏమీ మార్పురాదు.

ఈ అనంతాన్నే 'పూర్ణమదః పూర్ణమిదం' మంత్రార్తముగా వివరిస్తారు.

స్వస్తి.

 

Comments

  1. మన పూర్వీకులైన మహర్షులైన గణిత శాస్త్రజ్ఞులైన మహనీయులనెందరినో తెలుపుతూ క్రీ.శ. 12 వ శతాబ్దములోనే భాస్కరాచార్యుల వారు కనుగొన్న గొప్ప గణిత సూత్రమును తెలిపే
    సంస్కృత శ్లోకమునందించి వివరించేరు.
    ఆయన అనంతము,అచ్యుతము అను పదములకు అనంతుడు,అచ్యుతుడుతో గణిత సంబంధమైన విషయములను యెలా అనుసంధానించేరు
    అను విషయములను చాలా బాగా విశద పరచేరు..

    18 వ శతాబ్దంలో పాశ్చాత్యులు కనుగొన్న గణిత సూత్రములే ప్రథమంగా కనుగొనబడినవి అను భావనలు యెంత అబద్ధమో విశదపరచేరు.
    మీకు అనేక అభినందనలండీ రామ మోహన రావు గారూ.
    అపారమైన మీ జ్ఞాన వితరణకు అనేక అభినందనలండీ రామ మోహన రావు గారూ... వందనములండీ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి