బాదరాయణ సంబంధము
బాదరాయణ సంబంధము
https://ajaraamarasukthi.blogspot.com/2024/09/blog-post_25.html
బదరి అనగా రేగు చెట్టు. అట్టి చెట్లవనము కల్గినది బదరికావనము. కలికి పూర్వపు యుగములలో మహర్షులు మునులు ఇచట తపము ఆచరిన్చుకోనేవారు. మహాపురుశులగు నరనారాయణులు కూడా ఇచట తపమాచారించుకోన్నవారే!బహుశ ఇదేవానములో వ్యాస మహర్షి కూడా తపమాచారించుకొని యుండవచ్చును. అందుచే ఆయన బాదరాయణుడై ఉంటాడు.
మహాభారతము 18 పర్వముల ఉద్గ్రంథము. ఒక్కొక్క పర్వమునకు అనేకానేక అధ్యాయాలో, ఆక్ఖ్యానాలు ఉపాఖ్యానాలు. కలగాపులగాముగా కనిపించినా అన్నీ ఒక్కటై కౌరవ పాండవ కథతో ముడిపడు ఉంటాయి. ఇందు కృతయుగపు కథలు మొదలుకొని అన్నీ వస్తాయి. ఇన్ని కథలు ఉన్నా గజిబిజి చేయకుండా భారత కథతో ముడిపెడుతూ సవ్యముగా సక్రమముగా సాన్థమూ నడిపించిన అపర విష్ణ్వవతారము బాదరాయణుడు. కొన్నివేల పాత్రలను ఎకసూత్రమునకు కూర్చిన మహనీయుడు. ఈ పాత్రలు నిజముగా కురుపాండవుల కథతో సంబంధము ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు. అందుచేతనే కురుపాండవుడవులతో వీర్ది బాదరాయణసంబంధమైనదను నానుడి వచ్చియున్దవచ్చునని నా ఉద్దేశ్యము.
ఈ నానుడికి సంబంధించి ఈ పిట్టకథను చదవండి.
ఒక బ్రాహ్మడు ఎద్దుల బండిపై తనకూతురిని పిల్చుకు వచ్చుటకు ఆమె అత్తగారి ఊరు వెళుతున్నాడు.మధ్యాహ్న సమయము. ఎర్రటి ఎండ, కరకర ఆకలి ఆకలి ఆతనిని ఒక ఇంటివద్ద నిలిపింది. ఇంటిని ఆనుకొనియున్న ఒక రేగు చెట్టుకు ఎద్దులను కట్టి బండిని అక్కడే విడిది చేసి ఇంటిలోనికి వెళ్ళుటకు ముందే కాళ్లుచేతులు కడుగుకొని లోనికి ప్రవేశించినాడు.ఇంట్లో ఇల్లాలు ఒక్కర్తే ఉంది.ఎంతో పాత పరిచయము ఉన్నవానివలె కుశ ల ప్రశ్నలు వేసి తానూ భోజనానికి సిద్ధము అన్న అర్థమును ఆమెకు స్పురింపజేస్తాడు.ఆమె అతనిని భర్త వైపు బంధువు గా భావించి, వేడి వేడిగా అన్నము చేసి మిగిలియున్న అనుపానములను వడ్డించి తృప్తిగా భోజనము అమర్చుతుంది.ఇంతలో భర్త వస్తాడు .తర్వాత భర్త వస్తాడు.ఆయన అగున్తుకునిచూసి తనభార్యవైపు బంధువుగా భావించి కుశలప్రశ్నలు వేసి చక్కగా భోజనము సమకూర్ప చేస్తాడు.అంతా అయిన తరువాత భార్యా భర్తలు ఇద్దరు మాట్లాడు కునేటపుడు బంధుత్వమును గూర్చిన వివరములు ప్రశ్నించుతారు. "అయ్యా మీకు మాకు అసలు సంబంధము ఏమిటో చెప్పండి." అని అడుగుతారు.అప్పుడు ఆయన ఇలా చెబుతాడు.
అస్మచ్ఛకటం బదరీ శకటం
యుష్మత్ వృ క్షం బదరీవృక్షంl
నాన్యం బంధం ఉభయోర్మధ్యే
భవంతి బాదరాయణ సంబంధంll
అంటూ వచ్ఛీ రాని సంస్కృతములో తెలిసీ తెలియని ఛందస్సుతో పై శ్లోకము చెప్పినాడు.
ఆయన భావమేమిటంటే మా బండి రేగు చెక్కతో తయారు అయినది.మీ ఇంటిముందు రేగుచెట్టు ఉన్నది.ఇదే మన బంధము వేరేమీ లేదని చెబుతాడు.అది విని వారిద్దరూ నివ్వెర పోతారు.ఇలా ఏ సంబంధమూ, బాంధవ్య ము లేకపోయినా కలిసి తిరుగుతుంటే "వారిద్దరికీ ఏ సంబంధము లేదు.అదొక బాదరాయణ సంబంధము" అన్న ఛలోక్తి
విసురుతూ ఉంటారు.
స్వస్తి.
Comments
Post a Comment