బాదరాయణ సంబంధము
బాదరాయణ సంబంధము https://ajaraamarasukthi.blogspot.com/2024/09/blog-post_25.html బదరి అనగా రేగు చెట్టు. అట్టి చెట్లవనము కల్గినది బదరికావనము. కలికి పూర్వపు యుగములలో మహర్షులు మునులు ఇచట తపము ఆచరిన్చుకోనేవారు. మహాపురుశులగు నరనారాయణులు కూడా ఇచట తపమాచారించుకోన్నవారే!బహుశ ఇదేవానములో వ్యాస మహర్షి కూడా తపమాచారించుకొని యుండవచ్చును. అందుచే ఆయన బాదరాయణుడై ఉంటాడు. మహాభారతము 18 పర్వముల ఉద్గ్రంథము. ఒక్కొక్క పర్వమునకు అనేకానేక అధ్యాయాలో, ఆక్ఖ్యానాలు ఉపాఖ్యానాలు. కలగాపులగాముగా కనిపించినా అన్నీ ఒక్కటై కౌరవ పాండవ కథతో ముడిపడు ఉంటాయి. ఇందు కృతయుగపు కథలు మొదలుకొని అన్నీ వస్తాయి. ఇన్ని కథలు ఉన్నా గజిబిజి చేయకుండా భారత కథతో ముడిపెడుతూ సవ్యముగా సక్రమముగా సాన్థమూ నడిపించిన అపర విష్ణ్వవతారము బాదరాయణుడు. కొన్నివేల పాత్రలను ఎకసూత్రమునకు కూర్చిన మహనీయుడు. ఈ పాత్రలు నిజముగా కురుపాండవుల కథతో సంబంధము ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు. అందుచేతనే కురుపాండవుడవులతో వీర్ది బాదరాయణసంబంధమైనదను నానుడి వచ్చియున్దవచ్చునని నా ఉద్దేశ్యము. ఈ నానుడికి సంబంధించి ఈ పిట్టకథను చదవండి. ఒక బ్రాహ్మడు ఎద్దుల బండిప...