స్వస్తి మంత్రములు
స్వస్తి మంత్రములు
భద్రం కర్ణేభిః శృణుయాం దేవాః ।
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ।
స్థిరైరఙ్గైస్తుష్టువాఙ్ఞసస్తనూభిః ।
వ్యసేమ దేవహితం యదాయుః ।
ఓ దేవా! ,మాచెవులు సర్వథా శుభకరమైన
విషయములనే వినుగాక!ఓ (దేవతారాధనకు యోగ్యము, మంగళకరమైన
విషయములు మాత్రమె మాకు గోచరమగుగాక! సకలఅవయవాలు\ఇంద్రియములు స్థిరముగా నీ ప్రాతనకే అన్కితమగుగాక! దేవతలు కేటాయించిన
జీవితకాలమునంతా వారి ఆరాధనలోనే గడచిపోవు గాక!
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తిన పూషా విశ్వే వేదాఃసెమ
స్వస్తినః తార్క్ష్యో అరిష్టనేమిః
స్వస్తినో బృహస్పతిర్దదాతు
ఓం శాంతి: శాంతి: శాంతి:.
గొప్ప కీర్తిగల ఇంద్రుడు, జగత్తును గూర్చిన జ్ఞానము కలవాడు మరియు అన్ని విషయములలో స్మృతి పొందువాడు, మరియు అన్నింటిని పోషించేవాడు, పూష (సూర్యుడు) మాకు మేలు చేయుగాక! ఆపలేని చక్రము వంటి కదలికను గలిగిన గరుడుడు కల్యాణమును కలుగజేయు గాక! వేద భాషకు ప్రభువైన బృహస్పతి సదా అనుగ్రహించుగాక!
ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీశాంl
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినోభవంతుll
కాలే వర్షతు పర్జన్యః
పృథివీ సస్యశాలినీl
దేశోయం క్షోభరహితో
బ్రాహ్మణాస్సంతు నిర్భయాఃll
అపుత్రాః పుత్రిణః సంతు
పుత్రిణః సంతు పౌత్రిణఃl
అధనాఃసధనాః సంతు జీవంతు
శరదాం శతంll
ఓం సర్వేపి స్సుఖినస్సంతు సర్వే
సంతు నిరామయాఃl
సర్వే భద్రాణి పశ్యంతు మా
కశ్చిత్ దుఃఖభాక్భవేత్ll
ఓం సహనావవతు సహనౌభునక్తు
సహవీర్యం కరవావహైl
తేజస్వి నావధీతమస్తు మా
విద్విషావహైll
ఓం శాంతి శాంతి శాంతిః
Comments
Post a Comment