నాస్తిక ఆస్తిక సంవాదం
నాస్తిక ఆస్తిక సంవాదం
స్వామీ పరిపూర్ణానంద.. గోగినేని బాబు మధ్య సంభాషణ
https://ajaraamarasukthi.blogspot.com/2024/01/blog-post.html
నేను జాతకాలు నమ్మను.
జ. అవును అది మీ జాతకంలోనే ఉంది*.
నేను దేవుడిని నమ్మను.
జ. తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు*.
నాకు దేవుడిని చూపించగలరా?
జ. ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా*.
ప్రసాదాలు సమర్పిస్తారు. మరి దేవుడు స్వీకరిస్తే ప్రసాదాల్లో ఒక్క మెతుకు కూడా తగ్గదేం?
జ. మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం*.
మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?
జ. అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమనే ఏడుస్తారుగా*?
దేవుళ్లకు, రాక్షసులకు పిల్లలున్నారుగా. మరి వాళ్ల పిల్లల పిల్లలు ఎవరూ లేరా?
జ. ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమేగా*?
దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
---- *నీకు నిగ్రహం తక్కువ కదా. దాన్ని నిలపటానికి*.
దేవుడిని తలచుకోకపోతే జరగదా?
జ. ఏమో! నువే చెప్పాలి. క్షణం వదలకుండా తలచుకుంటున్నావుగా*...
ఇంకేముంది గోగినేని తలవంచుకుంటు వెనుదిరిగారు.
స్వస్తి.
Comments
Post a Comment