వింత పద్యాలు
వింత పద్యాలు 01\10\23
https://ajaraamarasukthi.blogspot.com/2023/09/blog-post_30.html
ఈ పద్ఈయములన్నీ నేనువ్రాసినవే! ఈ ప్రయోగములు తప్పక
కష్టముతో కూడుకొన్నవి. ప్రాచీన కవుల లేక
చాటుకవుల రచనలు ఈవిధమైనవి దొరుక వచ్చును. నేటి కవులలోకూడా ఎందరిలోనో ఈ
సామర్థ్యము ఉండవచ్చును. ప్రయత్నించినారో లేదో నాకు తెలియదు. చాలా మంది పాఠకులు
చాటు పద్యములు ఈవిధమైనవి పెట్టి ఆయా చాటుకవులను ఎంతగానో ప్రశంసించుతారు. కానీ
నావంటి అనామకులు ఎవరైనా వ్రాస్తే ఒకనమస్కార చిహ్నముముతో సరి. నాలుగు మంచిమాటలు
వ్రాయుటకు బహుశ బద్ధకము కామోసు. వీనికి మనము వ్రాయుట ఏమిటిలే అన్న నిర్లక్ష్యము
కూడా కావచ్చునేమో! ఇంతకంటే ఇంకా దారుణమైన విషయము ఏమిటంటే అత్యంత సులభమైన ఒక Like కొట్టి ఊరకుండుట. ఆ Like లేకున్నా నేను బాధపదబోఎది
లేదు. ఎందులకంటే నేను Likes కొరకు వ్రాయను.
ఇటువంటి రచనలు మన భాషా
సంపాదకు తార్కాణములు. కనీసము రెండు పంక్తులలోనైనా మీ అభిప్రాయమును తెలుపండి.
నేటికి కూడా ఈ విధముగా వ్రాసేవారు మీ మధ్యన ఉన్నందుకు గర్వించండి. మీరూ వ్రాసే
ప్రయత్నము చేయండి. భాషను కాపాడండి.
ఉద్ధరించండి. విస్తృతముగా పదుగురికి పంచి ప్రచారము చేయండి.
ఇది అహంకారము కాదు అభ్యర్ధన
మాత్రమే!
ఇక చదవండి.
అల్లా ఇల్లా ఎల్లా
ఖుల్లాగా కానలేని కుత్సితు
జతలో
ఎల్లాగ ఉండనౌ గన
అల్లానికి లడ్డుకెట్లు
అటుకును దోస్తీ
ఎక్కువగా పెదవులు కలిసే
కందము
అబ్బీ సుబ్బా నిబ్బర
మబ్బిన ఎబ్బెట్టు బెట్టు
అబ్బక నలుగున్
దబ్బర దిబ్బల గబ్బుల
బొబ్బట్టుల లిబ్బి కొరకు
బోవకు బాబూ!
ఒక అక్షరము పెదవులు తాకుతూ
ఒక అక్షరము తాకని కందము
దేవా రావా కావగ
సావాసివి నీవు నమ్ము
సమ్మతమొదవన్
కావగ అభయమొసంగుము
దేవా దుర్మార్గ హంత
దివ్య సుమేధా!
జలజ దళేక్షణ నినునే
నేలననే నిలిచి తలుతు
నీలతనుశ్రీ
సులలిత తలపుల నిలచిన
సలలిత శ్రీ నారదాది సన్నుత
శ్రీశా!
ఏకాక్షర కందము
నిన్నా నే నన్నా నా
నిన్నూ నిన నేను నిన్న
నిన్నన్నానా
నేనన నన్నెన్న న్నను
నిన్నన నిన్నను నేను
నిన్నననన్నా !
ద్వ్యక్షర కందము
ఈ కంద పద్యము కేవలము రెండు
వర్ణములచే నేయబడినది. గమనిచగలరు.
నా నెమ్మనమున మానిని
నీ నామమె మౌనమునను నేనన
మానన్
మానుము నీ మనమున నను
మానము మానిననె మనము మననౌ
నెమ్మిన్
ఓ మానినీ (బహుశ తన
ఇల్లాలిని సంబోధించుకొంటున్నాడేమో
నీ పనిని మానుకొని మాపనికి
నీ మగని పంపి సహాయము చేసినావే! నీకు సదా కృతజ్ఞులము.
పెదవుల తాకనివ్వని
వెలది
కాలికాలి కట్టె గాలిన
కలిసిన
గాంచనెంచ కళ్ళ గానగలనె
దరిన చెడ్డచేయ తలచి
చేరినయట్టి
ఖల జనాళి చెంత కలియగలనె
పదే పదే పెదవులు ముద్దాడే
పద్యము - భోజన ప్రియా!
ఒప్పులకుప్పా అప్పళ
దప్పళముల కొప్పు తోడు తప్పక
పప్పే
ఎప్పటికీ బహు గొప్పే చెప్పెద
పప్పే మన పంచవర్గ భక్షణ
శ్రేణిన్
పద్యం సరిగమ నేపథ్యం
మా పని నీపనిగాగని
మా పని సరి సరిగా సాగ మరి
మరి మగని
న్నీ పనిని మాని మా దరి
మా పని సరిగాగ మదని మరి
పంపితివే!
సర్వ లఘు ఆటవెలది
కన నడకన విరుపు కనుగవన
మెరుపు
బెడగు ముఖము నునుపు పెదవి
ఎరుపు
మగువలనిన మిగుల మరులగుట
విధికి
పురుషు చులకబరిచే పురుగు
వలెను
తలకట్ల కందము
నేను కవిని కాను, కానీ తపన ఉన్నది. ‘కవి
క్రాంతి దర్శకుడు’ అంటారు.
కవి నిరంకుశుడు, కవి ప్రయోగ శీలి అని అంటారు. అట్టి ప్రయోగములో
ఒక భాగముగా తలకట్లు తప్ప వేరు వత్తులు ఏవీ వాడకుండా వ్రాసిన
ఈ సర్వలఘు కందమును, ఒకపరి మనసారా చదవండి.
గజచర్మ వస్త్ర ధర పర
గజమదహర భస్మవపుష గళగరళ లస
ద్గజవదనజనక భవహర
అజ అవ్యయ ప్రవర అనఘ హర
దర్పహరా!
స్వస్తి.
అత్యద్భుతమైన రీతిలో రచించారండీ పద్యములన్నిటినీ..
ReplyDeleteవింత వింత రీతుల్లో..
అల్లా యిల్లా యెల్లా...
అని ప్రారంభించేరు.
1.ఎక్కువగా పెదవులు కలిసే కంద పద్యం
2.ఒక అక్షరం పెదవిని తాకితే
రెండవ అక్షరం పెదవిని తాకని కంద పద్యం.
3.ఏకాక్షర కందము
4.ద్వ్యక్షర కందము
5.పెదవులను తాకనివ్వని ఆటవెలది
6.పదే పదే పెదవులు ముద్దాడే పద్యము
7.సరిగమలతో పద్యం..
9.సర్వ లఘు ఆట వెలది.
10.తలకట్ల కందము
11.సర్వ లఘు కందము
పదకొండు రకముల అతి క్లిష్టమైన అక్షరవిన్యాసాలతో మీ ఛందోబధ్ధమైన పద్య రచనలు అత్యధికంగా కందమలే ఉండడం మహదాశ్చర్య కరము మహదానందకరమైన.
మీ పాండితీ ప్రకర్షకూ భావనా విన్యాసాలకూ జోహార్లండీ
రామ మోహన రావు గారూ.. మీకు అభినందన శతము..
జయహో...జయహో...మహాశయా బుధవరా...కవివరా...
మీ దంపతుల ఫోటో చూడ ముచ్చటగా ఉన్నదండీ.. మీ ఉభయులకూ నా శుభాకాంక్షలండీ.
🌹👌👌👌👌👌👌🌹🙏🙏🙏🙏🙏🌹😊