వినాయకచవితి ఎప్పుడు జరుపుకొనవలెను
వినాయకచవితి ఎప్పుడు
జరుపుకొనవలెను
ప్రతి పండుగ సూర్యోదయమున ఉన్న తిథి ప్రకారమే పండుగ చేసుకొనవలెను అన్నది సరికాదు. ఏవిధముగా కృష్ణాష్టమి అర్ధరాత్రి తిథి ని బట్టి చేసుకొన వలెనో ఆదేవిధముగా వినాయకచవితిని 'మధ్యాహ్న వ్యాపిణీ గ్రాహ్యా' అన్నారు, అంటే ఏరోజున అయితే మధ్యాహ్న సమయమున చవితి ఉంటుందో ఆరోజున వినాయక చవితి చేసుకొనవలసి ఉంటుంది. 'చతుర్థీ గణనాథస్య మాతృవిద్ధా ప్రశిష్యతే మధ్యాహ్న వ్యాపిణీ గ్రాహ్యా పరత్ష్చేత్ పారే హవిః' అని విద్వద్వచనము. 19వ తేదీ మధ్యాహ్నమునకు చవితి ఉండదు కావున వినాయక చవితి పండుగ ఈ నెల 18వ తేదీనే జరుపుకొనవలెను. ఇది నా అభిప్రాయము మాత్రమె!'లోకో భిన్న రుచి' అన్నది ఆర్యవాక్కు. కావున ఎవరి ఇష్టానుసారమూ వారు జరుపుకొనవచ్చును.
Comments
Post a Comment