అజరామర సూక్తి --2 अजरामर सूक्ति --2 Eternal Quote --2

Eternal Quote --2
అజరామర సూక్తి-౩1
अजरामर सूक्ति
Eternal Quote
सद्भावेन जयेन्मित्रं सद्भावेन च बान्धवान्
स्त्रीभृत्यान् दानमानाभ्यां दाक्षिण्येनेतरं जनम्
- सुभाषितरत्नभाण्डागार
సద్భావేన జయేన్మిత్రం సద్భావేన చ బాంధవాన్
స్త్రీభౄత్యాన్ దానమానాభ్యాం దాక్షిణ్యేనేతరం జనం
- సుభాషితరత్నభాణ్డాగారము
మానవుడు సంఘజీవి. తాను సాటి మనుషులతో సవ్యంగా వుంటే వారూ అతనితో అలాగే వుంటారు. ఇది ప్రకృతి సహజమైన విషయము. దీనికి ముఖ్యం గా కావలసినది నిర్మలమైన మనసు. భూమి సారవంతమైతే కోరిన పంట పండుతుంది లేకుంటే పిచ్చి మొక్కలతో నిండుతుంది.
సమాజములో ఎన్నో విధములగు వ్యక్తులు తారసపడుతూవుంటారు. మరి అందరినీ ఒకే గాట కట్టివేయలేము. అందుకే పెద్దలు ఈ విధంగా చెప్పినారు.
మిత్ర బాంధవులను నీ సద్భావనలతో సదాశయాలతో సచ్చీలముతో ఆకర్షించుకోవాలి. ఇందులో మనము కపటము ప్రదర్శించితే అది బయట పడిననాడు మిగిలేది అవమానము, ఆత్మ న్యూనతా భావము. కావున మన వ్యక్తిత్వములో పారదర్శకత అవసరము. అది ఉంటే తప్పులు చేయ బెదురూ భయము వుంటుంది. ఇంటి స్త్రీలను కానీ పరాయి స్త్రీలను కానీ ఉచిత గౌరవముతో ఆదరించి వారి అనురాగము సంపాదించాలి. వారిది కోమలమైన మనస్తత్వం. పైగా
యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తూ అపూజ్యన్తే తత్రైస్తాత్ అఫలాక్రియాః
అన్నది ధర్మశాస్త్రము. వారికి సంతోషము కలిగించుటకు శక్తి కొలది ఏదయినా బహుమానమునొసగితే అమితానంద భరితులౌతారు.
అదేవిధంగా పనిచేసేవారిని గుర్తించి భుజముతట్టి సముచితముగా ఆదరించితే ఎంతో ఆప్యాతతో పనిచేస్తారు. ఆప్యాత వుంటే చేయాలనే ఆర్తి కూడా వుంటుంది. తావి పూవును చేరే కదా వుండేది. తన నౌకరు శ్రద్ధను, అతను చేపట్టిన పనిలో గల కష్టాన్ని గుర్తించి అడపా దడపా తన శక్తి మేరకు ఏదయినా ఉపహారము ఇస్తే అతడు ఉప్పొంగిపోతాడు. స్త్రీల విషయములో కూడా వారికి సముచిత గౌరవమునిస్తూ వారి మనసుకు ఆనందము కలిగించే చిన్న చిన్న బహుమతులతో ఆకట్టుకొన వచ్చును. మాటలాడే తీరులో మార్దవము ఉంటే మనిషి మన్నన పొందుతాడు.
सद्भावेन जयेन्मित्रं सद्भावेन च बान्धवान्
स्त्रीभृत्यान् दानमानाभ्यां दाक्षिण्येनेतरं जनम्
- सुभाषितरत्नभाण्डागार
एक अच्छी उपस्थिति के साथ दोस्तों को जीतो; अच्छी उपस्थिति के साथ सच्चे रिश्तेदार बन भी सकते हैं और उन के मन जीत भी सकते हैं; महिलाओं और आश्रितों द्वारा - देने और सम्मान; राजनीति के माध्यम से अन्य।
रिश्ते को आकार देने के तरीके पर प्रत्येक व्यक्ति को कैसे नियंत्रित किया जाता है, इसका बहुत बड़ा प्रभाव पड़ता है। और यह भी, एक ही नियम सभी रिश्तों पर लागू नहीं होता है। जिस तरह से एक दोस्त के साथ व्यवहार करता है, वह वैसा नहीं है जैसा वह अपने बच्चों के साथ करता है। इसलिए एक अच्छी उपस्थिति के साथ माने दोस्तों और रिश्तेदारों से निपटना है। परिजनों और परिजनों के साथ व्यवहार करते समय शांत और आदरणा के साथ व्यवहार करना है, क्योंकि बोले गए शब्द और चलायागया तीर कभी वापस नहीं लिए जा सकते हैं। एक गलत शब्द रिश्ते को हमेशा के लिए तोड़ सकता है। महिलाओं के साथ सम्मान के साथ व्यवहार करना है। महिलाओं या आश्रितों के साथ अमलीन मन के साथ व्यवहार करना चाहिए । वे प्राथमिक देखभाल करने वाले होते हैं, जब वे मूल्यवान होते हैं, तो घर आसानी से चलता है। बाकी सभी को विनम्रता से निपटा जाना चाहिए। अशिष्टता और अहंकार किसी के लिए अपील नहीं है। वह राजा हो या आम आदमी, घमंडी किसी के साथ अच्छा नहीं अपना नाथा जतासकता है।
विनम्रता वास्तविक विचारों को बाहर लाता है। लोगों को संघटित करनेका अनमोल तरीखा है।
sadbhāvena jayenmitraṃ sadbhāvena ca bāndhavān ।
strībhṛtyān dānamānābhyāṃ dākṣiṇyenetaraṃ janam ॥
- subhāṣitaratnabhāṇḍāgāra
Win friends with a good presence; win kinsmen with good presence too; women and dependents by - giving and respect; others through politeness.
How each person is handled has a huge impact on the way the relationship shapes up. And also, the same rule doesn't apply to all relationships either. The way one deals with a friend, is not the same as he would deal with his children. The poet hence says that one has to deal with friends and kinsmen with a good presence. One needs to be calm and composed when dealing with kith and kin, because spoken words and sped arrows can never be taken back. One wrong word can break the relationship forever. Women are to be treated with respect. Giving is another faculty that one needs to develop, be it with women or dependents. They being the primary care takers, when they are valued, the household runs smoothly. Everyone else should be dealt politely. Rudeness and arrogance isn't appealing to anyone. Be he a king or a common man, arrogance and high strung attitude doesn't sit well with anybody.
Politeness is the art of choosing amongst one's real thoughts! One of the greatest victories one can gain over someone is to beat him at politeness. Adapting it wins many a wins.
*************************************
107.
అజరామర సూక్తి-32
अजरामर सूक्ति
Eternal Quote
रिक्तपाणीर्नपश्येत राजानं दैवतं गुरुम् l
दैवज्ञं पुत्रकं मित्रं फलेन फलमादिशेत् ll
రిక్తపాణీర్నపశ్యేత రాజానం దైవతం గురుంl
దైవజ్ఞం పుత్రకం మిత్రం ఫలెన ఫలమాదిశేత్ll
రాజు వద్దకు,దేవునివద్దకు,గురువు వద్దకు, విద్వాంసునియొద్దకు,పిల్లలు లేక
సంతానము వద్దకు, స్నేహితునియొద్దకు రిక్త హస్తముల జనరాదు.
ఈ శ్లోకమును కాస్త విశ్లేషణ చేసుకొందాము (విశ్లేషణ తెలుగులో మాత్రమె
చేయుచున్నాను). పరమాత్మ ఇటు భగవద్గీతలోనూ అటు కుచేలోపాఖ్యానము లోనూ ఈ
మాటను చెబుతూ వున్నాడు.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 9-26 ।।
"నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా
గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను
సంతోషంగా ఆరగిస్తాను."
పరమేశ్వరుడిని ఆరాధించటం వలన కలిగే ప్రయోజనాలను వివరించిన పిదప, శ్రీ
కృష్ణుడు ఇక ఇప్పుడు, అది ఎంత సులువైనదో వివరిస్తున్నాడు. దేవతల మరియు
పితృదేవతల ఆరాధనలో, వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో
నియమాలు ఉన్నాయి. కానీ, భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో తో
సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది
సమర్పించండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వు
సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే భగవంతునికి కేవలం ఒక ఆకు
సమర్పించండి; ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా
దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి, కానీ ఇక్కడ కూడా అది
ప్రేమ/భక్తితో ఇవ్వబడాలి. భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ భాగాల్లో
రెంటిలో వాడబడింది. ఆరాధించే వాని (భక్తుని) యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని
ప్రసన్నం చేస్తుంది, ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు.
ఈ అద్భుతమైన ప్రకటన చేయటంతో, శ్రీ కృష్ణుడు భగవంతుని యొక్క కరుణాపూరిత
స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. తనకు సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ
ఆయనకు అవసరం లేదు. అన్నింటికన్నా ఎక్కువగా, ఎంత ప్రేమగా ఇచ్చామో అనేదే
అయనకు ముఖ్యం. ఈ విధంగా 'హరి భక్తి విలాస్' ఇలా పేర్కొంటుంది:
తులసీ దళ మాత్రేణ జలస్య చులుకేన చ
విక్రీణీతే స్వం ఆత్మానం భక్తేభ్యో భక్త-వత్సలః (11.261)
"భగవంతునికి నిజమైన ప్రేమతో, ఒక తులసి ఆకు మరియు మీ దోసిట్లో పట్టేంత నీరు
సమర్పిస్తే, బదులుగా ఆయన తననే మీకు సమర్పించుకుంటాడు, ఎందుకంటే ఆయన
ప్రేమకు వశమైపోతాడు." అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనిర్వచనీయమైన
మహాద్భుత గుణములు కలవాడు, ఎవరి సంకల్ప మాత్రం చేతనే అనంతమైన
బ్రహ్మాండాలు సృజించబడి, లయమై పోతుంటాయో, ఆయన తన భక్తునిచే నిజమైన
ప్రేమతో సమర్పించబడిన అత్యల్పమైన దాన్ని కూడా స్వీకరిస్తాడు. ఇక్కడ 'ప్రయతాత్మనః'
అన్న పదం వాడబడింది, అంటే, "కల్మషములేని పవిత్ర హృదయం (మనస్సు) తో ఉన్న
వారు సమర్పించే దానిని స్వీకరిస్తాను" అని. శ్రీమద్భాగవతం లో కూడా సరిగ్గా ఇదే
భగవద్గీత శ్లోకం ఉంది. సుదాముని ఇంట్లో అటుకులు తినేటప్పుడు, శ్రీ కృష్ణుడు ఇలా
అన్నాడు:
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః (భ.గీ. 10.81.4)
"నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా
గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను
సంతోషంగా ఆరగిస్తాను."
పరమాత్మ ఏమి చెబుతున్నాడంటే సమర్పణ అన్నది భక్తునికి అత్యవసరము. కానీ అది
భక్తియుతమై ఉంటేనే ఆయన గ్రహించుతాడు అట్లుకాకుంటే తాన కాళ్ళకు తానూ
మ్రొక్కి నూరేళ్ళాయుస్సు అని దీవించుకొన్నట్లే! తనకు పాత్ర పుష్పఫలాలే కాదు భక్తితో
నీరిచ్చినా చాలు అంటున్నాడు. కుచేలుని గుప్పెడు అటుకులే మనకు చక్కని ఉదాహరణ.
కురుసభకు రాయభారియై శ్రీకృష్ణుడు వెళ్ళినపుడు, భక్తి హీనుడు,
మాత్సర్యభరితుడునగు దుర్యోధనుడు ఏర్పాటుచేసిన షడ్రసోపేతమగు విందును కాదని
విదురుని ఇంటికి పోయి ఆయన ఏర్పాటు చేయించినది తిని భక్తి పారవశ్యముతో
పండున ఉన్న కండను పడవేసి తొక్క స్వామికి అందిస్తే అదే ఆనందముగా
ఆరగించినాడు స్వామి. మనము సాధారణ మానవులము. మనలో అంత తాదాత్మ్యము
కలుగదు. కానీ గుడ్డిలో మెల్లగా మనము సాధన చేయవచ్చు. ఈ జన్మకు కాకుంటే
తరువాత జన్మలకైనా ఆచరిన్చుతూ పోతే ఆ తాదాత్మ్యత సిద్ధించవచ్చు.
ఇక వేదము మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని
తెలియజేస్తూ ఉన్నది. మరి, మనము ప్రయోజకులమై సంపాదించే సమయములో
తల్లిదండ్రులకు అన్నివిధములగు ప్రీతిని సమకూర్చవలసిన బాధ్యత మనది. మూడవది
గురువు.
గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేనవాI
అధవా విద్యయా విద్యా చతుర్థం నోపపద్యతేII
అంటే విద్యను అభ్యసించే విషయంలో 1.గురువును సేవించి,సపర్యలు చేసి ,2. తన దగ్గర
ఉన్న విద్యను ఆయనకు నేర్పి ఆయన వద్ద ఉన్న విద్య ను గ్రహించట.
3. ఆయనకు పుష్కలమైన ధనమును ఇచ్చి, ఈ మూడు రకాలుగా తప్ప నాలుగో రకము
లేదు అని నీతిశాస్త్రము చెబుతూ వున్నది. కుచేల బలరామ కృష్ణులు ఆ విధముగానే కదా
ధనము శుశ్రూశాలతో నేర్చుకొన్నారు. ఇక చివరది, వారు రాజు కానీ. యోగ్యతగల
వేరెవరైనా గానీ మనము శక్తియుతముగా, భక్తియుతముగా వారికి తగిన
పారితోశికమును ఇచ్చి అటు వారికి, ఇటుమనకు సంతృప్తి కలిగించుకొని తీరవలసినదే!
रिक्तपाणीर्नपश्येत राजानं दैवतं गुरुम्
दैवज्ञं पुत्रकं मित्रं फलेन फलमादिशेत्
जब भी राजा,भगवान्,गुरु,विद्वान्,बच्चे और दोस्त के यहाँ जानेके समय खाली हाथ नहीं जाना चाहिए |
riktapaaNIrnapaSyEta raajaanaM daivataM gurum
daivaj~naM putrakaM mitraM phalena phaDo not go empty handed to see a king, God, teacher, a learned person, a child or a friend. Invoke fruitfulness with fruit!
There is a purpose for going to see someone. It could be love, reverence, devotion, affection or even fear! Without a purpose, one would have not taken the pain and effort to go to see anyone. For the visit to be fruitful, why not start with a fruit! Meaning, take some fruit to offer to the person.
స్వస్తి.
అజరామర సూక్తి-౩౩
अजरामर सूक्ति
Eternal Quote
किं मित्रमन्ते सुकृतं न लोकाः
किं ध्येयमीशस्य पादं न शोकाः ।
किं काम्यमव्याजसुखं न भोगाः
किं जल्पनीयं हरिनाम नान्यत् ॥
- रसगङ्गाधरम्
కిం మిత్రమంతే సుకృతం న లొకాః
కిం ధ్యేయమీశస్య పాదం న షొకాః |
కిం కామ్యమవ్యాజసుఖం న భొగాః
కిం జల్పనీయం హరినామ నాన్యాత్ ||
- రసగఞ్గాధరం
నీ స్నేహితులెవరు? నీవు చేసే మంచే, నీ అందుబాటు లోవుండే లోకము కాదు. మన
ధ్యానము ధ్యేయము పరమేశ్వరుని పద కమలాలే గానీ మన ఈతిబాధలు కాకూడదు.
మనము కోరవలసినది నిత్యమూ శాశ్వతమైన ఆనందమేగానీ లౌకిక క్షణిక సుఖాలు
కాదు. మన మనన హరినామ స్మరణమే అన్యథా కాదు. ఇక్కడ ఒక మాట
గమనించండి. లౌకిక సుఖమన్నదే చేరువ కానివ్వకండి అని నేను చెప్పుట లేదు. దానికి
దయతో ఒక హద్దును నిశ్చయించుకోండి. తదుపరి హరినో హరునో శరణాగతి
తత్వముతో ఆశ్రయించండి. ఈ సంసార సాగర తారకులు అంటే దాటించేవారు వారే!
మనసు పెట్టి ఒకసారి ఆలోచన చేస్తే మన గమనమేమిటో గమ్యమేమిటో
అర్థమౌతుంది.మన దృష్టి అంతా ధనము పైనే.అంతకన్నా ఘనమైనదే లేదు.మరి అది
మనకు పరమాత్మ దర్శనము చేయించ గలుగుతుందా! ఎడారిలో ఎంత డబ్బున్నా
దాహము తీర్చగాలుగుతుందా! అసలు పరమాత్మను వదలి లౌకికముగా ఆలోచించినా
రావణుని ,దుర్యోధనుని దుర్మార్గులుగా గుర్తు పెట్టుకోన్నామే గానీ మంచివారిగా కాదు.
వారి మంచితనము అంతా ఒక అవలక్షణముతో కప్పివేయబడినది. అందుకే పెద్దలు
'కుమ్మరికొక ఏడు గుదె(కుమ్మరివారు ఉపయోగించే కర్ర)కొక నాడు
అంటారు.సంవత్సరమంతా పడిన కష్టము గుదె వేటుకు నేలమట్టమే కదా. అందుకే
నిలుపు నిదానముగానైనా మంచి మాత్రమే సంపాదించ వలెను.
ఈ సందర్భములో జగద్గురువు ఆదిశంకరుల మాట గుర్తు చేసుకొందాము.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిస్చాలతత్వే జీవన్ముక్తిః
నాలుగు పాదాలలో నభోమండలము చేరే వివరము అతి సరళముగా తెలిపినారు. ఒక్క
సత్సాంగత్యము ఉంటె సర్వేశ్వరుడు నీ చెంతనున్నట్లే.
किं मित्रमन्ते सुकृतं न लोकाः
किं ध्येयमीशस्य पादं न शोकाः ।
किं काम्यमव्याजसुखं न भोगाः
किं जल्पनीयं हरिनाम नान्यत् ॥
- रसगङ्गाधरम्
दोस्त कौन होता है ? केवल तुम्हारा सुकृत (अच्छे काम), तुम्हारे आसपास के लोग नहीं|
तुम्हारा दृष्टी किधर होनी चाहिए परमेश्वर के चरनों पर रहना चाहिए व्यथाओं पे नहीं |
किस के बारे में सोचना चाहिए ? उस आनंद के लिए सोचना है जिस के अतिरिक्त कुछ भी नहीं है |
हर दम हर पल क्या गुनगुना है ? सिर्फ हरी के नाम और कुछ नहीं |
तो पहले पहल हमारा सांगत्य शुद्ध रहना चाहिए | जगद्गुरु आदि शंकराचार्यजी ऐसा कहते हैं|
सतंसंगत्वे निस्संगात्वाम
निस्संगात्वे निर्मोहत्वाम
निर्मोहत्वे निश्चला तत्वं
निस्चालातात्वे क्जीवंमुक्तिः
अगर सज्जन का सांगत्य मिलता है तो कोई और सांगत्य आदमी नहीं चाहता| दूसरा सांगत्य ही नहीं
चाहा तो ओस इंसान के मन में किसी भी तरह का मोह पैदा नहीं होता| निर्मोहत्वा चा जाताहै तो
निस्चाल्तात्वा आजाता| अगर मन निश्चल और अटल रहगया तो आदमी जीवन्मुक्त होजाता हैl
kiM mitramantE sukRtaM na lokaa@h
kiM dhyEyamISasya paadaM na shokaaऽ h |
kiM kaamyamavyaajasukhaM na bhogaaऽ h
kiM jalpanIyaM harinaama naanyaat ||
- rasaga~ngaadharam
Who is a friend in the end? Good deed(s), not people. What should be
contemplated upon? Eswaras’ feet, not sorrows. What should be desired?
Un-abound happiness, not indulgences. What should be prattled? Only the
name of Sri Hari, nothing else.
A friend in need is a friend indeed. True friends are hard to find. A single rose
can be my garden, a single friend, my world! All these statements are nice
to quote and very true as well. But they have their own boundaries. When
passing on, one's best friends are his vices & virtues, and his vices & virtues
alone! One needs to keep this in mind, at all times. Earn as many friends
here, but at the same time, keep thy sight on the friends that accompany
through the entire journey!
'Sat sangatve nissangatvam
Nissangatve nirmohatvam
Nirmohatve nischala tatvam
Nischala tatve jeevan mukthiH'
By Jagadguru Aadi Shankaraachaarya.
Once the friendship is good enough to lead you towards good it attains for you nonattachment. When there is no attachment there will not be any craze for anything. When you shun all your craze you will attain perfect stability. When you could keep your mind stable salvation is at your threshold.
The first and foremost thing to be cultivated in the youth is to listen to elders' words observe the good in it and then follow. If you don't like just keep yourself away but don't hurt them by your criticism.
అజరామర సూక్తి-34
अजरामर सूक्ति-34
Eternal Quote-34
क्षन्तव्यो मन्दबुद्धीनामपराधो मनीषिणा l
न हि सर्वत्र पाण्डित्यं सुलभं पुरुषे क्वचित् ll
క్షంతవ్యో మందబుద్ధీనామపరాధో మనీషిణాl
న హి సర్వత్ర పాణ్డిత్యం సులభం పురుషె క్వచిత్ll
జ్ఞానము భగవద్దత్తము. కావున జ్ఞాని తన జ్ఞానమును చూసి గర్వించనవసరము లేదు. ఒకరు జ్ఞానవంతుడై వేరొకరు అజ్ఞానియైనా అంతా భగవదేచ్చ యన్నది మనము గ్రహించవలసియున్నది. పండిత గర్వం విడచి మంద బుధ్ధులను గూడా గౌరవించమన్నారు మన పూర్వులు. దైవసృష్టిలో అతడుకూడా భాగమణి మనము మరువకుండా గుర్తిన్చావలసియున్నది. అందువల్ల సాటి మనిషిని తనతో సమానముగాగౌరవించడము సత్పురుష లక్షణము.
“మందోప్య మందతామేతి సంసర్గేణ విపశ్చితః" కాబట్టి వారిని దగ్గరకుదీసి జ్ఙానబోధ తోవిజ్ఙానులుగా తీర్చిదిద్దమనే సందేశం అంతర్లీనంగాఉందేమో?
क्षन्तव्यो मन्दबुद्धीनामपराधो मनीषिणा l
न हि सर्वत्र पाण्डित्यं सुलभं पुरुषे क्वचित् ll
बुद्धिमत्ता भगवान् की दें है | बुद्धिमान कभी भी बुद्धिहीन लोगों का निरादर नहीं करना चाहिए, क्यों की जो बुद्धिमत्ता इंसान को प्राप्त हुयी है वह तो भगवान् की देन है और कम बुद्धि वालों को भी अपने अपने कर्मानुसार भगवान् ने ही पैदा किया है |अहंकार बुद्धिमान को भी बुद्धिहीन बनादेता है |
kShantavyO mandabuddhInaamaparaadhO manIShiNaa l
na hi sarvatra paaNDityaM sulabhaM puruShe kvachit ll
The follies of the dull witted should be forgiven. For, erudition doesn't come easy to people everywhere.
Erudition and eloquence are God given gifts. It does not come easily to all. Those that are blessed with that gift, have no reason to be proud of it. They did not have much of a say in being intelligent, it was given to them! At the same time, the intelligent need to be tolerant to the follies of the less intelligent. They deserve forgiveness for, fastidiousness in not their best trait!
స్వస్తి.
**************************************
అజరామర సూక్తి-35
अजरामर सूक्ति-35
Eternal Quote-35
अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रिय निग्रहः ।
सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः ॥
ज्ञानं पुष्पं तपः पुष्पं शान्तिः पुष्पं तथैव च ।
सत्यमष्टविधं पुष्पं विष्णोः प्रीतिकरं भवेत् ॥
అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహఃl
సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతఃll
జ్ఞానం పుష్పం తపఃపుష్పం శాంతిః పుష్పం తథైవ చ l
సత్యమష్టవిధం పుష్పం విష్ణొః ప్రీతికరం భవేత్ ll
ఇది చాలామందికి తెలిసిన శ్లోకమే! మిగతావారు కూడా తెలుసుకొనేందుకు ఈ ప్రయత్నమూ. భగవంతునికి ఈ ఎనిమిది పుష్పాలూ అత్యంత ప్రీతికరమైనవి. 1.అహింస 2.ఇంద్రియ నిగ్రహత 3.భూత దయ 4. క్షమా 5. జ్ఞానము 6. ధ్యానము మరియు తపస్సు 7. శాంతి 8. సత్యము
ఇందులో మనకు తెలియనివి ఏవీ లేవు. కానీ వీనిని మనము సాధించినామా! సాధించ దలచినామా! లేక వీని ముసుగులో మనము సంఘాన్ని మభ్యపెడుతున్నామా! అన్నది ఆత్మ విమర్శకు అత్యంత యుక్తమైనది.
వీనిని సాధించిన జీవితము ధన్యము. వీనిని మనసునందే పాదుగొలిపి భగవత్ చింతన చేసినచో ఆయన ఆశ్రయము పొందుటలో ఆలశ్యముండదు.
अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रिय निग्रहः ।
सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः ॥
ज्ञानं पुष्पं तपः पुष्पं शान्तिः पुष्पं तथैव च ।
सत्यमष्टविधं पुष्पं विष्णोः प्रीतिकरं भवेत् ॥
आठ तरह के पुष्प भगवान् को अत्यंत प्रीतिदायक होते हैं | १.अहिंसा २. इन्द्रिय निग्रह्ता ३.
भूत दया ४. क्षमा ५. ज्ञान ६. ध्यान ७. शान्ति ८. सच्चाई
इन आठ पुष्प भगवान् के बहुत प्यारे होते हैं | अगर मनुष्य इन पुष्पों का प्राप्त कर सकताहै तो वही भगवान् का अनुग्रह प्राप्त करनेकेलिये काफ़ी है | अगर सदैव इन्ही पुष्पों से मनःपूर्वक प्रार्थना करेंगे तो हमारे लिए कमी महसूस होनेका सवाल ही पैदा नहीं होता है |
ahiMsaa prathamaM puShpaM puShpamindriya nigraha@h
sarvabhUtadayaa puShpaM kShamaa puShpaM viSEeShata@h
j~naanaM puShpaM tapa@hpuShpaM Saanti@h puShpaM tathaiva cha |
satyamaShTavidhaM puShpaM viShNo@h prItikaraM bhavEt ||
Non-violence is the first flower, control over the senses is a flower, compassion towards all beings is a flower, forbearance is a flower especially, (right) knowledge is a flower, penance is a flower, then, also, peace is a flower, truth being the eighth flower - these are dearest to Lord viShNu.
స్వస్తి.
**************************************
అజరామర సూక్తి-౩6
अजरामर सूक्ति-36
Eternal Quote-36
आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपुः ।
नास्त्युद्यमसमो बन्धुः कुर्वाणो नावसीदति ॥
-नीतिशतक
ఆలస్యం హి మనుష్యాణాం శరీరస్తో మహాన్ రిపుః |
నాస్త్యుద్యమసమో బంధుః కుర్వాణో నావసీదతి ||
-నీతిశతకము
ఈ శ్లోక సారాంశము అందరికీ తెలిసినదే కాబట్టి నీను దీనిని విశ్లేషించ దలచలేదు.
మానవునికి అలసత్వానికి మించిన శత్రువు లేనేలేదు. అదేవిధంగా ఉత్సాహానికి మించిన
మిత్రువు లేదు.
आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपुः ।
नास्त्युद्यमसमो बन्धुः कुर्वाणो नावसीदति ॥
-नीतिशतक
अलासत्व जो होताहै ओअही इंसान का बड़ा दुश्मन है | उत्साह से बढ़कर कोई साथी नहीं होता जो
हर नेक काम में साथ देता है |
aalasyaM hi manuShyaaNaaM SarIrastO mahaan ripu@h |
naastyudyamasamO bandhu@h kurvaaNO naavasIdati ||
-nItiSatakamu
Laziness present in one's body, is the biggest enemy of humans. There is no
kin parallel to zeal and he who is zealous certainly perishes.
Kusuma Piduri: ప్రపంచంలోనే మన సుభాషితాలు గొప్పవి, nice suuktulu Cheruku
Ramamohanrao gaaruu
112. అజరామర సూక్తి-37 प्रभुतं कार्यमल्पं वा यान्नरः कर्तुमिच्छति - చాణక్య నీతి వెనుక వగవ చాల వెర్రితనము కార్యశూరుడెపుడు కలిగియుండాబుద్ధి రామ మొహనుక్తి రమ్య సూక్తి పని ఎదయినాగానీ ప్రారంభించుటకు మునుపు ఎంతసేపయినా ఆలోచించవచ్చు, కానీ నిర్ణయించుకొన్న పిదప అది చిన్నదే కానీ పెద్దదే కానీ కష్టము కలిగియుండనీ కలిగియుండక పోనీ మధ్యలో వదలకూడదు. ఈ విషయములో సింహము మనకు ఆదర్శము. వేటాడు నిర్ణయమునకు వచ్చిన తరువాత అది కుందేలే కానీ కుంజరమే కానీ తన విధానము మార్చుకొనదు. అంటే ఒకసారి తాను పథకము వేసుకొన్న తరువాత అది అమలు పరచుటే గానీ అడుగు వెనక్కు వేసే పనియుండదు. ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అందుకే భర్తృహరి ఈ విధముగా అంటాడు ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. ధీరులు పని ప్రారంభించిన పిదప తగ్గే ప్రసక్తి ఉండదు. కార్యము పెద్దదా చిన్నదా అన్నది అతనికి అవసరము లేదు . చేతికి తీసుకొన్న పని జరిగిందా లేదా అన్నదే ముఖ్యము. सर्वारम्भेण तत्कार्यं सिम्हादेकं प्रचक्षते- चाणक्य नीति कार्य महत्वपूर्ण हो या तुच्छ हो - शुरू से समाप्त तक वह एक शेर की तरह, कुल समर्पण के साथ अपनी योजना लागू करनी चाहिए। एक शेर पहले, छिपकर फिर चुपचाप घूरघूरकर अपने शिकार की हर चाल देखता है और फिर सही समय पर आक्रमण करता है। यह शिकार की अपनी शैली है! व्यक्ति काम सोचकर हाथ में लेना है और लेनेके बाद फिर सोचना ठीक नहीं हैl काम लगन के साथ करेंगे तो पूरी दुनिया द्वारा मान्यता प्राप्त होता है । हमारे लगन के बारे में हमें खुद सोचना है दुसरे लोग नहीं । prabhutaM kaaryamalpaM vaa yaannaraH kartumichChati ************************************** 113. అజరామర సూక్తి-38 अजरामर सूक्ति-38 Eternal Quote-38 अकारणेनैव चतुराः तर्कयन्ति परेङ्गितम् । गर्भस्थं केतकीपुष्पम् आमोदेनेव षट्पदाः ॥ -प्रसन्नराघव అకారణేనైవ చతురాః తర్కయంతి పరేఞ్గితం | గర్భస్థం కేతకీపుష్పం ఆమొదేనెవ షట్పదాః || -ప్రసన్నరాఘవ अकारणेनैव चतुराः तर्कयन्ति परेङ्गितम् । -प्रसन्नराघव सामने वाले का आन्तार्य , उसे बिना पूछे ही पहचानने वाला चतुर होता है जैसे भंवरा , केतकी पुष्पको छुपकर रह्नेसेभी उसका सुगंध से पहचान सकता है| aakaaraNEnaiva chaturaa@h tarkayanti parE~ngitam | garbhasthaM kEtakIpuShpam aamodEneva ShaTpadaa@h || -prasannaraaghava Without any summons, the clever inquire into others' intentions; like the bees locate a hidden KETAKI flower with just its fragrance. The outward actions reveal one's hidden intentions. It is not necessary that a person expresses all his thoughts, in his actions or words. The reasons for this could be many. He may not have the necessary circumstances to express; or an ambiance; or may even lack the word skills to express himself. The intelligent should have the knack knowing it like the bee ************************************************************* అజరామర సూక్తి -39 अजरामर सूक्ति - 39 Eternal Quote - 39 भये वा यदि वा हर्षे सम्प्राप्ते यो विमर्शयेत् कृत्यं न कुरुते वेगान्न स सन्तापमाप्नुयात् - सुभाषितरत्नभाण्डागार భయే వా యది వా హర్షే సంప్రాప్తే యో విమర్శయేత్ కృత్యం న కురుతే వేగాన్న స సంతాపమాప్నుయాత్ - సుభాషితరత్నభాణ్డాగారము భయము కల్గినా సంతోషము కౌగిలించుకొన్నా తన మనసును, ఇంద్రియములను నిగ్రహించుకొన్న వాడేనాడు దుఃఖమునకు ఎరగాడు. भये वा यदि वा हर्षे सम्प्राप्ते यो विमर्शयेत् कृत्यं न कुरुते वेगान्न स सन्तापमाप्नुयात् - सुभाषितरत्नभाण्डागार जो भी भय वा हर्ष को एक सामान देखके अपने मन और इन्द्रियों को काबू में रख्लेता है वह सदा संतोष रहता है | bhayE vaa yadi vaa harShE sampraaptE yO vimarSayEt kRtyaM na kurutE vEgaanna sa santaapamaapnuyaat - subhaaShitaratnabhaaNDaagaaramu When in fear or in happiness, he who has total control on his actions thoroughly and does nothing in haste, will not undergo sorrow (suffering). ***************************************************************
జనితా చొపనేతా చ యస్తు విద్యాం ప్రయచ్ఛతి అన్నదాతా భయత్రాతా పఞ్చైతే పితరః స్మృతాః - చాణక్య నీతి
కన్నతండ్రి, దేవుని దరికి దారి చూపువాడు, విద్యాబుద్ధి చెప్పి, అడుగడుగునా సాయపడుతూ, సందేహ నివృత్తి చేసే గురువు,అన్నదాత,అభయ దాత అంటే ఆపద వేళల అక్కున జేర్చుకొని కాపాడేవాడు , ఈ ఐదుగురు కలకాలము తలుచుకోవలసిన తండ్రి సమానులు. ఆవిధముగా ఈ ఐదుమందినీ ఆత్మలో నిలిపి అనునిత్యమూ తలచుకోనువాడే భగవంతుని ప్రేమకు పాత్రుడు. వీరి గొప్ప పదుగురికి తెలుపుతూ తానూ అటువంటి వున్నతి సాధించువాడు సరియైన సుగుణశీలుడు.
ఈ ఐదుగురు తండ్రులను గూర్చి క్లుప్తముగా విశ్లేషింకొందాము. 1. కన్నతండ్రి: తల్లి కడుపు నుండి బయట పడినది మొదలు నీ ఆరోగ్యము, చదువు, లౌకికము ఈవిధముగా ప్రతియొక్కటీ తన కష్టము ఎంత ఉన్నా వెలిబుచ్చక నీ ప్రతి అవసరమూ తీరుస్తాడు. ఒకవేళ అట్టి తండ్రి అనుకోని రీతిలో అసువులు బాసితే అప్పుడు నిన్ను అక్కున చేర్చుకొని నీకు తగిన విద్యాబుద్ధుల గూర్చి సంఘములో నిలుపుటకు ఒక వ్యక్తి చేయూత దొరికితే, అతనికి ఆజన్మాంతము రుణపడి యుండవలసిన బాధ్యత నీది అన్న మాట మరువ వద్దు. 2. దేవుని దరికి దారి చూపువాడు: బ్రాహ్మణులకయితే యజ్ఞోపవీత ధారణ చేయించి గాయత్రీ మంత్రోపదేశము నేరపినవానిని మరువకూడదు. ఒకవేళ నీవు ఆ ఉపదేశము ఆలంబనగా పరమాత్మ అనుగ్రహమునకు దగ్గరయితే అందుకు కారణము ఆయనే కదా! ఆ మాటకొస్తే నీవు బ్రాహ్మణుడవు కాకున్నా, గురుకులమునకు పోయి విద్య గడించవలసినదే! ఆ గురువు నిష్కల్మష హృదయముతో విద్యగరిపి ప్రయోజకుని చేసి సంఘములో సముచిత గౌరవమును కలిగించితే ఆయన తండ్రికన్నా మిన్న కాక వేరెవ్వరు? ఇందు సరియైన ఉదాహరణ, శ్రీకృష్ణ, బలరామ, సుదాములకు గురువగు సాందీపని. వీరిలో సుదాముడు (కుచేలుడు) మాత్రమే బ్రాహ్మణుడు. 3. విద్యాబుద్ధి గరిపే గురువు: గురువు అన్నమాట ఆంగ్లములోని ‘Teacher’ అన్న మాటకు సమానార్థము కాదు. పాఠము చెప్పి పని ముగించుకొనేవాడు ‘Teacher’. విద్యతో బాటు సద్బుద్ధిని కలిగించుటయేగాక, తన ఛాత్రునికి (Student) శిరస్త్రాణమై నిలిచి అన్ని విధములా కాపాడువాడే నిజమైన గురువు. ఆవిధముగా అతను ‘గురువు’ అన్న పేరుకు సార్థకత సమకూర్చుతూ ఉన్నాడు. అట్టి వ్యక్తి నీకు తండ్రికి మించిన తండ్రియని గ్రహించవలసియున్నది. 4. అన్నదాత: ఈ మాటకు స్థూలముగా ఆకలిగొన్నవానికి అన్నము పెట్టేవాడు అని తలచుతారు. నిజానికి దీనికి చాలా పెద్ద అర్థము ఉంది. ఆకలి అన్నది ఒకనాటి మాట కాదు. ఒక వ్యక్తిని, ఒకవేళ తండ్రి లేకపోతే, తనకాళ్ళపై తాను నిలువగలిగేవరకూ పెంచి పోషించేవాడు నిజమైన అన్నదాత. అట్టి వ్యక్తిని నీవు బ్రతికినంతకాలమూ అనుదినము ఒకక్షణమైనా మనసులో తలచుకొనవలసిన బాధ్యత నీలో ఉన్నది. నీ వలన ఆతనికి ఏదయినా సహాయము పొందవలసి వస్తే అది నీ అదృష్టముగా భావించవలసిన బాధ్యత నీది. 5. అభయదాత: ఒకప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అండగా తాను ముందు నిలిచి ఆపద నుండి గట్టెకించినవాడు అభాయదాత, ప్రాణత్రాత. అట్టివ్యక్తిని మరచినవాడు ఎంతటి నీచ నికృష్టుడో తెలుపుటకు నిఘంటువులో పదము దొరుకదేమో! ‘పంచైతే పితరః స్మృతాః’ అని భారతము లోని ఆదిపర్వమున శకుంతలో పాఖ్యానంలో కూడా చెప్పబడినది. ఇంత మంచివిషయమును గురించి తెలుసుకొని తమ పిల్లలకు చెప్పే తలిదండ్రులకే గతిలేదు ఈ కాలములో! యిక వీరి సంగతి ఆదేవునికే ఎరుక. కాలము మారినదనుకొనవలెనా లేక మానవుల యాలోచనా విధానమా! కాక పాశ్చాత్య ప్రభావమా? స్వస్తి. తెలుగులోనూ ఆంగ్లములోనూ విశ్లేషించుట చేత హిందీలో అంత విస్తారముగా వ్రాయలేదు. जनिता चोपनेता च यस्तु विद्यां प्रयच्छति अन्नदाता भयत्राता पञ्चैते पितरः स्मृताः - चाणक्य नीति
जन्मदाता, भगवान् को पानेकेलिये सही रास्ता दिखानेवाला,ज्ञानदाता, एना डाटा और भय से छुटकारा दिलाने वाला , यह पाँच पिता सामान होते है| इनलोगों का रन हम कभी भी चुका नहीं सकते | जीवन भर उनके महानता याद करलेते हुए खुद उसी तरह बननेका कोशिश करते रहना चाहिए |
janitaa chopanEtaa cha yastu vidyaaM prayachChati annadaataa bhayatraataa pa~nchaitE pitara@h smRtaa@h - chaaNakya nIti
One who gives birth, one who brings closer to God or to spirituality ( by means of initiating through the sacred thread ceremony for Brahmins and the like), he who gives knowledge, he who gives food, he who protects from fear - these 5 are deemed as fathers.
In the course of life, one comes across many a relationships that command respect. Respect, for their contribution, towards the growth in many different facets of his life.
1. A 'father' is one such figure. A father is an instigator, invoker and a propeller! In certain peculiar circumstances of life, one may come across, in the absence of father, a person who undertakes the said responsibilities is, in fact more than his father as he took all the pains to bring him up and place him in a respectable position in the society. As such, he is to be regarded with the same respect of one’s own father, who gave him birth!
2. 'Upanetaa' -. That is the first step one takes towards a spiritual way of life. He who counsels or guides one towards that path is a father figure and is hence revered. (Who does upanayana for Brahmins and the like), Even otherwise also when the boy is admitted to a Gurukula, the Guru takes it as a responsibility to bring up the ‘Chatra’ (disciple) on he sound lines of morals and ethics. Sandipani, the Guru of Krishna, Balarama and the other Brahmin Boy Sudama (Kuchela), as a concrete example of unbiased treatment of his Chatras.
3. He who gives knowledge - a preceptor, under whose care one falls educates him selflessly to the best of his ability. A true preceptor rejoices when his pupil excels him! He may come into your life after your graduation from Gurukula when you acquire a job, or even as a neighbor or anybody of that kind. Relationship is always directly proportional to the wavelength. If the wavelength is high the relationship is strong.
4. He who gives food – He is instrumental for your survival. It is not just serving food to needy. It is the support that you are getting from such a person who is supplementing everything for your growth and thus making you stand on your own in the society. He is in fact more than ones’ own father.
5. He who protects from fear - quells one's insecurities and helps him overcome the hurdles of life. When one's fears are dispelled, he sees life in a new light! Such a person is respectable as a father. The person who stands as a shield to avert any sort of blow to you is more than your father. In fact he is taking up your problem on to his shoulders and addressing it appropriately.
There is nothing in this world, by giving which, one can free himself from the debt of these 5 apostles, who are to be kept on a higher rung than ones’ own father. One has to be indebted all throughout his life. He can pass on the legacy to his own children, by exhorting their greatness of such people and advise the posterity to be like them. స్వస్తి. *************************************************** |
अजरामर सूक्ति-41
Eternal Quote--41
दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम् l
अज्ञाननाशिनी प्रज्ञा भावना भयनाशिनी- चाणक्य नीति ll
దారిద్ర్యనాశనం దానం శీలం దుర్గతినాశనంl
అజ్ఞాననాశినీ ప్రజ్ఞా భావనా భయనాశినీll - చాణక్య నీతి
దానము దాతను గ్రహీతను ఇరువురిని ఉద్ధరించుతుంది. దాతకు మనో నైర్మల్యము
పెంచి భగవంతునికి అతని ఆత్మను అనుసంధించుటకు దోహదపడుతుంది. పాత్రత
కలిగిన గ్రహీత తన కష్టమును తీర్చుకొనుటయేగాక, దాతకు కృతజ్ఞునిగా ఉంటూ, ఆ
పరమాత్మ పై విశ్వాసమును పెంచుకొంటాడు.
రెండవది శీలము.'ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాభిరక్షతు' అన్నారు ఆర్యులు.
మానము ఆడ మగ అన్న తేడా లేకుండా అందరూ కాపాడుకోవలెను. గుణశీలములు
లేని జన్మ వృధా కదా!
ఇక మూడవది ప్రజ్ఞ. ప్రజ్ఞ ఒక పగిలిపోని గాలి గుమ్మటము లాంటిది. దానికి ఎంత
జ్ఞానాన్నయినా గ్రహించి భరించి మనలను అనుగ్రహించే శక్తి కలిగియుంటుంది.
జ్ఞానము పెరిగితే అజ్ఞానము నశించవలసిందేకదా.
నాలుగవది అతి ముఖ్యమైనది మన ఊహ. ఆది శంకరులవారు ' రజ్జు సర్ప భ్రాంతి' ని
గూర్చి ఎప్పుడూ చెబుతూనే వుంటారు. తాడును చూసి పాము అని భ్రమించినంత
కాలము అది మనకు పాముగా నే అగుపించి భయము గొలుపుతూ వుంటుంది.
'యద్భావం తద్భవతి' అన్నది ఆర్య వాక్కు. కాబట్టి భయాన్ని బయటికి పంపితే మనలో
నిలిచిపోయేది ధైర్యము మాత్రమే.
दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम्
अज्ञाननाशिनी प्रज्ञा भावना भयनाशिनी- चाणक्य नीति
दान गुण लेनेवालेका दरिद्रता दूर तो कर ही देती है उस के साथ साथ, दाता पर, उनमे एक
कृतज्ञताभाव पैदा करता है|उसी तरह दाता को भी मन निर्मल बनाके आत्मा को भगवान् के नजदीक
प हूॅ चने का का मार्ग सुगम करता है|
दूसरा है शीलता | 'प्राणं वापी परित्यज्य मानमे वाभिराक्षतु' यह आर्य वाक्य है | इस का मतलब ये है
की प्राण जाए पर मान न जाए| जो सुशील होता है उन का आत्मा स्वच्छ होता है | स्वच्छता बढनेसे
बुरे भावनाएं बिना बोले दूर होजाते हैं|
तीसरा प्रज्ञा है| प्रज्ञा बिना फटनेवाला एक गुब्बारा जैसा होता है| जितना ज्ञान उस में घुसा सकतेहो
उतना ऊपर उड सकते हो|
चौथा भावना है| 'यद् भावं तद्भावति' यह आर्य वाक्य है | तुम्हारे सोच में जो है तुम्हे वही दिखाई देता
है|आदि शंकराचार्यजी अक्सर इस सिलसिलेमे 'रज्जु सर्प भ्रान्ति' का उदाहरण देते हैं| माने जब तक
हम कम रोशनी में रस्सी को साँप समझते हैं वह डर मन में वैसाही रह जाता है| जा वह भ्रान्ति दूर
होता है तो हमारे दिल में धैर्य भर जाता है |
daaridryanaaSanaM daanaM SIlaM durgatinaaSanam
aj~naananaaSinI praj~naa bhaavanaa bhayanaaSinI - chaaNakya nIti
Giving quells poverty, integrity dispels bad times, awareness dismisses
ignorance, and contemplation dissipates fear.
1. Giving is an action which quells poverty of the giver as well as the
receiver! The receiver gains what he wants and the giver gains on the
scale of virtue. Hence, it eradicates poverty on different levels for all the
people involved.
2. No matter, what the circumstance or conditions are, trading values
and integrity is not a choice. Everything else may be in shambles, at least
his soul won't be! Be it good times or bad, integrity of the person's
character is what protects and brings him out in one piece from any
adversity.
3. Awareness and ignorance are antonyms of each other, just as light
and darkness. These two swords can never fit in one scabbard, when one
is in, the other is out! When one has the awareness, there is no place for
ignorance. It gets dismissed automatically!
4. Would one be afraid in his own house even if it were dark? Because of
the familiarity of the dimensions of the house, he won't obviously bump
into the walls. That familiarity leads him to contemplate his space and
time. This contemplation dissipates all fears in him and makes his view
clearer.
To turn any weakness to strength, acquire the right tool that dispels it from
the very roots !
*************************************
అజరామర సూక్తి - 42
अजरामर सूक्ती - 42
Eternal Quote -42
सर्पाणं च खलानां च परद्रव्यापहारिणाम्
अभिप्राया न सिध्यन्ति तेनेदं वर्तते जगत्-
पञ्चतन्त्र, मित्रभेद
సర్పాణం చ ఖలానాం చ పరద్రవ్యాపహారిణాం
అభిప్రాయా న సిధ్యంతి తెనేదం వర్తతే జగత్
- పఞ్చతంత్రము, మిత్రభేదము
ఈ లోకములో అజగరములు అసజ్జనులు ఉన్నది వాస్తవమే . కానీ పరులను నాశనము
చేసే వారి దురాలోచనలు అన్నీ ఫలించే విధముగా వుండివుంటే ఈ లోకము బ్రతికి
బట్టగట్టేదా!
పన్నగము పరమ దుష్టుడు
ఎన్నగ ప్రాణాల ముప్పు ఇదినిజమైనా
మిన్నగ మానవ జనతతి
ఎన్నెన్నో రెట్లు పెరిగె ఇది గను రామా!
లోకములో పాములకు రెండు నాలుకలున్నాయి. దుష్టులకూ అంతే కానీ వీరి
రెండవ నాలుక కనిపించకుండానే పని చేస్తూ వుంటుంది. అయినా లోకము వృద్ధి
-చెందుతూనే ఉంది. కారణము వారిలో స్వార్థము, ఆత్మ రక్షణము ఉన్నందువల్ల వారి
దౌష్ట్యము అంతవరకే పరిమితమైఉన్నది. అట్లు కాకుండా ఉండియుంటే ఈలోకము
పరలోకము చేరియుండెడిది. అందుకే మనము దుష్టులచేత ఆకర్షించబడనంతవరకు
మనము క్షేమము, వాళ్ళూ క్షేమమే! ఎందుకంటే మంచి చెడుల కలయికయే ప్రకృతి.
పాముల మధ్యనే రోషము పెరిగి ఒకదానినొకటి చంపుకోనవచ్చును. అదేవిధముగా
ఇరువురు దుష్టుల నడుమగూడా అహంకారము అధికమై ఒకరికొకరు కీడు
చేసుకొనవచ్చును. అందుచేత మనము అనవసర విషయములలో జోక్యము
చేసుకొనకుండా సచ్ఛీలము సత్పురుష సంగమము,. సమ్యమనము, సాదువర్తనము
కలిగియుండుట సరియైన మార్గము.
सर्पाणं च खलानां च परद्रव्यापहारिणाम् l
अभिप्राया न सिध्यन्ति तेनेदं वर्तते जगत्ll - पञ्चतन्त्र, मित्रभेद
इस जगत में अजगर और असज्जन के इरादे पूरे होते ही रहेंगे तो इस संसार निर्जीव होजाता था| सत्पथ पर
चलने वालेको विनाश का सामना नहीं करना पड़ता |
sarpaaNaM cha khalaanaaM cha paradravyaapahaariNaam
abhipraayaa na sidhyanti tenEdaM vartatE jagat
- pa~nchatantra, mitrabheda
Snakes and evil doers (aim at) others' possessions. Their intentions never succeed,
hence the world is still surviving.
స్వస్తి.
*****************************************************
అజరామర సూక్తి-43
अजरामर सूक्ती-43
Eternal Quote-43
हस्ती अङ्कुशमात्रेण वाजी हस्तेन ताड्यते l
शृङ्गी लगुडहस्तेन खड्गहस्तेन दुर्जनः ll - चाणक्य नीति
హస్తీ అంకుశమాత్రేణ వాజీ హస్తేన తాడ్యతే l
శృఞ్గీ లగుడహస్తేన ఖడ్గహస్తేన దుర్జనాః ll - చాణక్య నీతి
ఈ ప్రపంచములో ప్రతి ప్రాణినీ లోబరచుకొనుటకు ఒక ఆయుధము అవసరము.
ఏనుగును అంకుశముతో,గుర్రమును చేతితో, ఆవు ఎద్దు,బర్రెలను చిన్న ముల్లుగర్ర
తో లోబరచుకోనవచ్చును. దుర్మార్గుని మాత్రము కత్తి తో లోబరచుకోవలసిందే !
నేటి నాయకులకు కత్తి కాదు కానీ వాళ్ళు చేసిన అకృత్యా, అవినీతి పనుల రుజువుల
యొక్క నాకాళ్ళను చూపి భయపెట్టి వారి ఉధృతిని అణచవచ్చు. అసలు
రాజకీయాలలో మునిగితే నీతిని కొంతకు కొంతయినా కోల్పోక తప్పదు. ఈ
విషయమై నేను వ్రాసిన ఈ పద్యము సందర్భోచితమని తలచి మీ
ముందుంచుచున్నాను.
రాజకీయమందు రాజిల్లు నేతలో
నీతి కొంత తగ్గు నిక్కముగను
ఆర్కెమెడిసు సూత్ర మరసిన తెలియదా
రామమోహనుక్తి రమ్య సూక్తి
ఇది పదహారణాల పచ్చినిజము.
చాణక్యునిపై మన నాయకులకు ఎప్పుడు గౌరవము ఏర్పడుతుందో!
हस्ती अङ्कुशमात्रेण वाजी हस्तेन ताड्यते
शृङ्गी लगुडहस्तेन खड्गहस्तेन दुर्जनः- चाणक्य नीति
संसार के प्राणियों को काबू में रखनेकेलिये अलग अलग तारीखे होते हैं'| हाथी को अंकुश से,घोड़ेको
हाथ से,गाय बैल, भैंस आदी जन्तुवों को लकड़ी के टुकड़े से काबू में लेते हैं | लेकिन दुर्जन को काबू में
लेने केलिए तलवार ही ठीक है|
hastI amkuSamaatrENa vaajI hastEna taaDyatE l
SR~ngI laguDahastEna khaDgahastEna durjanaa@hll - chaaNakya nIti
An elephant is (restrained) with just an anvil, a horse is hit with the hand, a horned
animal with a stick in hand, an evil doer with a sword in hand.
There is a restraint for everything and everyone. Only one needs to figure out the right
thing for the right one. Tried and tested are some of the means and hence we should
follow them.
స్వస్తి.
**********************************************
119.
అజరామర సూక్తి -44
अजरामर सूक्ती -44
Eternal Quote -44
गर्वाय परपीडायै दुर्जनस्य धनं बलम् l
सुजनस्य तु दानाय रक्षणाय च ते सदा ll
గర్వాయ పరపీడాయై దుర్జనస్య ధనం బలంl
సుజనస్య తు దానాయ రక్షణాయచ తేసదాll
దుర్జనుని వద్ద గల ధనము వానికి అహంకార హేతువగుటయే గాక పరులను
పీడించుటకు ఉపయోగ పడుతుంది. అదే ధనము సన్మార్గుని వద్ద వుంటే ఇతరులకు
సహాయ పాడుటకు గానీ పాత్రత నెరిగి దానము చేయుటకు గానీ
ఉపయోగ పడుతుంది. ఈ సందర్భములో తిక్కన భారతము విదురనీతిలోని పద్యము
గురుతుకొస్తూ వున్నది.
ధనమును, విద్యయు, వంశం
బును దుర్మతులకు మదంబు పొసగించును, స
జ్జనులైన వారి కడకువ
యును వినయము నివియ తెచ్చు నుర్వీనాథా ! ఉ.ప.ద్వి.ఆ.-35
భావము : రాజా ! ధనము, విద్య, మంచి వంశము అనునవి చెడిన వారికి మదాన్ని
కలిగిస్తాయి. ఇవే బుద్ధిమంతులకు వినయ విధేయతలు చేకూరుస్తాయి.
విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఇటువంటి ఉత్తమ సాహిత్యమును ఉంచితే
రాబోవుకాలమునకు దేశమే శీలవంతమౌతుంది. దీనిని యువత గ్రహించవలసిన
అవసరము ఎంతో ఉన్నది.
गर्वाय परपीडायै दुर्जनस्य धनं बलम्
सुजनस्य तु दानाय रक्षणाय च ते सदा
दुर्जन के यहाँ अगर धन है तो वह अहंकार के मारे दूसरों को तकलीफ़ देने मे ही जुटा रहता
है |लेकिन जो सज्जन होते हैं वे अपने धन और उन्नती को दूसरों के मदद में और पात्रता के
अनुसार लोगों में बाँटने में उपयोग करते हैं|
garvaaya parapIDaayai durjanasya dhanaM balam
sujanasya tu daanaaya rakShaNaaya cha te sadaaWealth and power of an evil
doer, are for vanity and afflicting others. For a good person, they are for giving
and protection always.
The sins are not committed by wealth and power that are used for the cause. It is
entirely on the person in charge of those possessions. His attitude and priorities
are what matter and how they are put to use.
అజరామర సూక్తి -45
अजरामर सूक्ति-45
Eternal Quote -45
उपसर्गे अन्यचक्रे च दुर्भिक्षे च भयावहे l
असाधुर्जनसंपर्के यः पलायति स जीवति ll - चाणक्य नीति
ఉపసర్గే అన్యచక్రే చ దుర్భిక్షే చ భయావహే l
అసాధుర్జనసంపర్కే యః పలాయతి స జీవతి ll - చాణక్య నీతి
ఓటమి నిశ్చయమని తెలిసినపుడు ఎదురొడ్డి పోరాడుట దుస్సాహసమే. అదేవిధంగా తన
సీమ కానపుడు తగిన జాగరూకత కలిగియుండుట అత్యంత అవసరము.కరువు
కాటకాలలో ఉన్నచోటే ఉండాలన్న మంకుపట్టు ప్రాణఘాతము.ఇటువంటి
సమయములలో పలాయనమే పరమావధి. పుట్టుక మన చేతిలో లేనపుడు చావును
మన చేతికి తీసుకొనుటకు హక్కు లేదు కదా. ' బ్రతికి యుండిన సుఖములు బడయ
వచ్చు' అన్నది ఆర్యోక్తి. బాటలో పయనించే బండికి ఎగుడు దిగుడు సామాన్యమే కదా.
కానీ అవి శాశ్వతము కావు కదా. నడిపే చాకచక్యము కలిగియుంటే , కష్టాలు తీరితే ఆపై
బండిది నల్లేరు పై నడకే గదా. పలాయనము పిరికితనము కాదు.శక్తిని
క్రోడీకరించుకోవటమే! అక్బరును తప్పించుకొనుటకు రాబ్నా ప్రతాపుడు రాజధానిని
వీడి అడవులకు ఏగినా జీవితాంతమూ అక్బరునెదిరించి పోరాడినాడేకానీ కలలో కూడా
లొంగిపోలేదు.
అటువంటి మహనీయులే మనకు ఆదర్శము.
उपसर्गे अन्यचक्रे च दुर्भिक्षे च भयावहे
असाधुर्जनसंपर्के यः पलायति स जीवति- चाणक्य नीति
अगर हारना तय ही हुआ है तो सामना करनेसे फ़ायदा क्या है| अपने सीमा से हटके दुसरे सीमाओं पे खदम रखना
पडा तो बहुत सावधान से रहना चाहिए |अकाल के समय पे उसी जगह पर अटल रहना अविवेक ही होता है| अपने
परिवार का देखबाल कौन करेगा| अगर जनम हम खुद नहीं लेसकते तो उसे गवानेका अधिकार कौन दिया है| हमारे
जनन, जीवन, मरण सब भगवान् के हाथो में हैं| तो उचित समय आये तक कहीं और जाने में ही आदमी का भलाई है|
upasargE anyachakrE cha durbhikShE cha bhayaavahE
asaadhurjanasaMparkE ya@h palaayati sa jIvati - chaaNakya nIti
In times of retreat, when in others' territory, in famine, in fear and in association with evil
doers - he who runs, survives. When the whole army is retreating, is it sane for a lone
soldier to charge forward! It is not a safe haven when one steps out of his boundaries and
lands in others' property. In times of a famine, if one cannot fend himself and his family,
what is the point in guarding the place? When the opponent is much stronger and instills
fear in the person, what is the point in marching on! When there is a lion in front, what if
one says, 'I won't run away, because only cowards run’! Company of the evil - this one's
the worst of all. It does no good in any which way. Knowing that, if one hangs around, just
so they don't call him a coward, doesn't make any sense.
In all these circumstances, if one steps back or runs away (keeps away), it is not called
cowardice. It is called common sense. Sometimes, taking that retreat is more appropriate
than charging ahead. Running away is not always cowardice, it is survival sometimes! So,
survive!
స్వస్తి.
అజరామర సూక్తి - 46
अजरामर सूक्ति - 46
Eternal Quote -46
अक्रोधेन जयेत् क्रोधमसाधुं साधुना जयेत् l
जयेत् कदर्यं दानेन जयेत् सत्येन चानृतम्- महाभारत, उद्योगपर्व ll
అక్రోధేన జయేత్ క్రోధమసాధుం సాధునా జయెత్ l
జయెత్ కదర్యం దానేన జయేత్ సత్యేన చానృతం ll - మహాభారతము, ఉద్యొగపర్వము
అంటే కోపరాహిత్యంతో కోపాన్ని జయించాలి.దుర్మార్గుణ్ణి సాత్విక లక్షణాలతో
జయించాలి. లోభిని దానంతో జయించాలి. అసత్యాన్నిసత్యంతో జయించాలి.
పరమాత్మ మాటను వినండి:
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః !
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ll 2-63
ఎప్పుడూ విషయ వాంఛల గురించి, సుఖాల గురించి ఆలోచిస్తే వాటి మీదే అనురక్తి
పెరుగుతుంది . ఆ అనురక్తే నెమ్మదిగా కామం లేక కోరికగా మారుతుంది .కోరిక
తీరకపొతే క్రోధం కలుగుతుంది .క్రోధం అవివేకానికి దారి చూపుతుంది. కాబట్టి
అవివేకానికి మూలం క్రోధం.
కోపము అంటే కోరి పాపము మూట కట్టుకోవడమేమో! కోపము అహంకార
హేతువు. సంయమనాన్ని పోగొడుతుంది. విచక్షణ ను కోల్పోవజేస్తుంది.
సత్సహవాసాలకు సమాధి కడుతుంది. తమ దారిన తాము పోయే మానవులపై పాము
కూడా కీడు తలపెట్టదంటారు. కానీ కోపము అట్లు కాదు. మానవుడు తన బుద్ధిపై
ఎప్పుడు నియంత్రణ కోల్పోతాడో, అప్పుడు అతని అసందర్భ ప్రేలాపనలు అతిసన్నిహితుని
కూడా అవలీలగా కోల్పోవచ్చును. కోపాన్ని జయించ గలిగిన సాధనము శాంతము.
అందుకే పెద్దలు తాలిమి తనను కాస్తుంది ఎదుటి వానిని కాస్తుంది అంటారు.
పెనుగులాట మొదలైతే పేడ బెల్లము ఒకటౌతుంది. అందుకే కదా సుమతి శతక కర్త
'తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ '
అన్నాడు. విషయము తెలుసుకోకుండానే అంతా నీతులు చేప్పేవాళ్ళే అని కొట్టి
వేయకుండా ఆ నీతిని పాటించుట తమకు మేలు కాదా అని ఆలోచించితే ఆనందాన్ని
అందుకోగలుగుతారు. నెత్తురు పోటు (blood pressure) ను అదుపులో
వుంచుకోగలుగుతారు.
అవినీతిని నీతితో జయించ మన్నారు పెద్దలు. దీనికి ఉదాహరణ గా ఒక భోజనము చేసే
దృశ్యాన్ని తీసుకొందాము.మనము తిండి తినే పరిసరమును సామాన్యముగా శుచిగా
శుభ్రముగా ఉంచుతాము. ఒకవేళ చిన్న పిల్లవాడే అశుద్దము చేసినా మనము అన్నము
తినగలుగుతామా? వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రము చేసి, చేయించి ఆతరువాతే భోజనము
చేస్తాము. అవినీతిని సహించ లేని వాడు కూడా అదే పని చేస్తాడు . దీనినే విలోమముగా
ఆలోచించుతాము. అంతా అశుద్దము గానే ఉన్నా, అక్కడే అందరూ తింటూ వున్నా
ఒక్కనికి మాత్రము అది నచ్చదు. వాడు తినడు. మిగతా తినేవాళ్ళు కూడా వానిని
తినమని అడగరు ఒకవేళ వారు అడిగినా అతను తినడు . అవినీతి కూడా అంతే కదా.
ఒక నీతి పరునికి అవినీతిపరుడు పని చెప్పుటకు పది మార్లు ఆలోచించుతాడు. తన
గుట్టు రట్టయితే తనకే ముప్పు. గది నిండా చీకటి ఉన్నా చిన్న దీపము వెలిగించితే
చీకటికి చీటీ చెల్లినట్లే కదా!
లోభము దానమునకు లొంగ వలసిందే. ప్రచారములో వుండే భారత కథ ఒకటి ఉంది.
కర్ణుడి దానపరత్వము చూసి దుర్యోధనుడూ దానము చేయ మొదలుపెట్టినాడట. కథ
ఇప్పుడు పూర్తిగా వ్రాయలేను. కావున చెడ్డ కూడా కంటిముందు మంచే కనిపిస్తూవుంటే
మారక తప్పదు. భాస్కర శతకములోని ఒక పద్యము ఈ విధముగా వుంది:
సిరి గల వానికె య్యెడల చేసిన మేలది నిష్ఫలంబగున్
నెరిగురి కాదు పేదలకు చేసిన మేలది సత్ఫలంబగున్
వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటన్
కురిసిన మేలు అంబుదుల కుర్వగ నేమి ఫలమ్ము భాస్కరా
ఇక నిజము అబద్ధము ను గూర్చి తలచుకొందాము.ఉన్నమాట చెబితే మనసు చాలా
తేలిక పడుతుంది. అదే అసత్యమాడితే దానిని కప్పిపుచ్చుటకు ఎన్నెన్నో అబద్ధాలు
ఆడవలసి వస్తుంది. ఇందులో కూడా, ఇతరులను గూర్చి చెప్పేటపుడు ఏ విధమైన
సత్యమును మాట్లాడ వలె అని మన పెద్దలు చెప్పినారు
'సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న భ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం భ్రూయాత్ ఏషా ధర్మః సనాతనాః'
ప్రియమైన సత్యము చెప్పమన్నారు అప్రియమైతే, ఎదుటి మనిషికి బాధ కలిగించేదైతే
చెప్పవద్దన్నారు. అట్లని ప్రియమైన అబద్ధము చెప్ప వద్దన్నారు. ఎంతటి ఆచరణ
యోగ్యమైన మాటలో చూడండి. 'సత్యం వద - ధర్మం చర' ఇది ఆర్యోక్తి. కానీ 'సత్యం
వధ - ధర్మం చెర' ఇది కార్యోక్తి. నిజామునకు సరియైన కార్యమును సత్యమార్గమును
సాధించ వచ్చును. కార్యమే దుష్ట కార్యమైతే మార్గమూ దుష్టమార్గమే అవుతుంది. దీనికి
మన ఆహార, విహార, సమాహారములు మానవుని బుద్ధిపై అత్యంత ప్రభావమును
చూపిస్తాయి. కానీ సత్యము తో కూడా పనులు చేసుకొనవచ్చును అన్నది గ్రహించితే
సమాజము ఎంతో ప్రగతి సాధించుతుంది.
अक्रोधेन जयेत् क्रोधमसाधुं साधुना जयेत् l
जयेत् कदर्यं दानेन जयेत् सत्येन चानृतम् ll - महाभारत, उद्योगपर्व
क्रोध को शांती से हरासकते हैं| दोनों हाथ मिलानेसे ही आव्वज निकलता है| अगर एक क्रोध होकर दूसरा शांत रह्जाता है तो झगडा कैसा पैदा होसकता है | नीति के पथ से हेट लोगों को ठीक पथ पे लाना है तो आप नीति को आजमाईये | दूसरा भी अपना राह बदल लेगा | लोभी को दान गुण से जीत सकते हैं| महा भारत का एक कथा बचपन में सूना करता था | उस का सारान्श ये है की राधेय को देखकर दुर्योधन भी दान गुण अपनालिया|
आज कल के कमाने में भी सत्य का सहारा लेके हम अपने काम बना सकते हैं | एक असत्य लाखो असत्यों का जनम देगी| अगर दिल रख के हमारा चाल चलन इस प्रकार करलेंगे तो समाज अपने आप सुधर सकता है|
akrOdhEna jayEt krOdhamasaadhuM saadhunaa jayet
jayet kadaryaM daanEna jayEt satyEna chaanRtam
- mahaabhaaratamu, udyogaparvamu
Anger can be won over with peacefulness and calmness i.e. without any anger at all; the immoral are to be won by morality; a miser is to be won by charity and generosity; lies are to be won over with truth.
Eye for an eye, tooth for a tooth, then, limb for a limb, life for a life. There is no solace inspite! This is no way to put an end to any kind of misery! Unfortunately this is the advice given by a most prevalent religious text.
If one displays anger all the time and the onlooker continually keeps his calm, how long can the angry man keep his temper? He would feel like he is kicking his arms and legs against the air - no matter how much he tries, can't hurt the air. Eventually, he shall learn to keep his calm as he has no choice. Hence Anger can be obliterated by piecefulness.When immoral laws are exercised, they are won over with morality. As a head, if you are morale your subordinates are bound to be morale. If you are a subordinate and you are moral then the boss, who is immoral, has to think twice before he entrusts any work. A man of morality will be gutsy and confronts any situation.
A miser is won over with generosity. Possessions are not for clinging on, but for putting it to good use for the welfare of those around. That is taught by giving. The story of Duryodhana related to Mahabharatha reveals that Duryodhana starts giving needy what is asked for, only by seeing Karna his subordinate who is otherwise called DANA KARNA.
Winning over lies is as simple as telling the truth! Honesty keeps the mind and soul peaceful. Lies need built up stories. Also, it is so much easier to be honest than not. When telling the truth, one doesn't have to remember anything! Don't have to keep track of all the lies or have the fear of being caught :). Moreover, truthfulness is the only way, when one's quest is the 'ultimate truth'. Truth is hence a win-win situation for anyone.
Keep thy calm, morality, generosity and honesty. Makes life simple and peaceful too.
స్వస్తి.
****************************************
అజరామర సూక్తి -47
అజరామర సూక్తి -47
अजरामर सूक्ति-47
Eternal Quote-47
विद्या विवादाय धनं मदाय l
शक्तिः परेषां परिपीडनाय l
खलस्य साधोर्विपरीतमेतत् l
ज्ञानाय दानाय च रक्षणाय ll
విద్యా వివాదాయ ధనం మదాయ l
శక్తిః పరేషాం పరిపీడనాయ l
ఖలస్య సాధోర్విపరీతమేతత్ l
జ్ఞానాయ దానాయ చ రక్షణాయ ll
విద్య, ధనము, శక్తి ఈ మూడు మానవునికి అత్యంత ఆవశ్యకములు.వీనినే బుద్ధిబలము,
అర్థబలము, అంగబలము అని కూడా అంటారు. సమాజము లో వుండే మంచివారికి
చెడ్డవారికి గూడా ఇవి కావలసిందే. కానీ వీని వాడకములోనే తేడా.
దుష్టులు విద్యను వివాదములకు,ధనమును విషయలోలతకు అంటే వ్యసనాలకు అంటే
దురలవాట్లకు ,శక్తి ని పరహింసకు, పర విత్త హరణకు ఉపయోగించుతారు. అదే
సాత్వికులు విద్యను ఇంకనూ ఇనుమడింపజేసుకోనేందుకు,ధనము పరుల
సహాయమునకు, శక్తి ఆర్తత్రాణ పరాయణతకు ఉపయోగించుతారు.
కావున ఒక వస్తువును సద్వినియోగము చేసినా, దుర్వినియోగము చేసినా, అది మన
బుద్ధిని బట్టి మాత్రమే వుంటుంది. అందుకే ఋగ్వేదములో ఈ మాట ఉటంకించ బడినది.
ఆనోభద్రాః క్రతవోయంతు విశ్వతోऽదబ్ధాసో అపరీతాస ఉద్భిదఃI
దేవానోయథా సదమిద్ వృధే ఆసన్నప్రాయువో రక్షితారో దివేదివేII (ఋగ్వేదము)
దశదిశలనుండి నిరంతర కళ్యాణకారకమగు ఆలోచనలే లేక భావనలే మాలో
ప్రసరించుగాక. అట్టి భావనలకు ఎటువంటి అవరోధము వుండకుండుగాక.
మంగళకరమగు అజ్ఞాత విషయములు కూడా మా కర్ణ శ్రావ్యమగుగాక.
నిరంతరమూ సకల దేవతలూ మమ్ము రక్షించుతూ మా ప్రగతికి కారణభూతులగుచుందురుగాక.
మరి ఇంతకంటే వేరు మంచిమాట వేరేమి కావాలి. ఈ మాట పదే పదే దినచర్యలో మనము మననము చేసుకొంటూవుంటే చేడుపుకు తావేదీ!
विद्या विवादाय धनं मदाय l
शक्तिः परेषां परिपीडनाय l
खलस्य साधोर्विपरीतमेतत् l
ज्ञानाय दानाय च रक्षणाय l
विद्या,धन और शक्ति मानव केलिए महत्वपूर्ण होते हैं| इन तीनोमे कोई परिवर्थान नहीं रहता लेकिन इंसानो में वह फ़रक रहता है| वे दो तरह के होते हैं| एक तो बुरे दुसरे अच्छे | बुरे लोग 'विद्या' को कुतर्क में, धन को विशयलोलता में और शक्ति को पर पीडन में इस्तेमाल करते हैं| ऐसा करके इस अजरामर धन का निधन करते हैं| वही अगर अच्छे लोग यानी दिल के सच्चेलोग विद्या को अभी व्याप्त करलेनेकेलिये, धन को गरीबों में, अच्छा बुरा परखकर बाँटतेहैं और शक्तिको दुर्बलों को बचानेकेलिये उपयोग करते हैं |
उसीलिये रुग्वेद ऐसा कहता है
आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरीतास उद्भिदः ।
देवा नोयथा सदमिद् वृधे आसन्नप्रायुवो रक्षितारो दिवेदिवे॥
ऋगवेद
अर्थ - हमारे पास चारों ओर से ऐंसे कल्याणकारी विचार आते रहें जो किसी से न दबें, उन्हें कहीं से बाधित न किया जा सके एवं अज्ञात विषयों को प्रकट करने वाले हों। प्रगति को न रोकने वाले
और सदैव रक्षा में तत्पर देवता प्रतिदिन हमारी वृद्धि के लिए तत्पर रहें।
अगर आदमी इस वचन को अपने दिल और दिमाग में रख्लेथा है तो दुनिया में बुराई कहाँ से आयेगी|
vidyaa vivaadaaya dhanaM madaaya
shaktiH pareShaaM paripIDanaaya
khalasya saadhorviparItametat
j~naanaaya daanaaya cha rakShaNaaya
Evil always consider Knowledge for argument, wealth for insolence, strength for tormenting others - On the contrary the noble use the same for awareness, giving and protecting respectively.
Getting a thing is not the problem but making use of it in the right way is all that matters.
Knowledge is applied for different purposes by different people. The evil apply their entire knowledge base to argue with others and to show off their prowess. Whereas, the noble are interested in learning more for their own awareness and bettering themselves than they were yesterday.
Money in an evil man's hand makes him arrogant and reckless. He walks around with the notion that the entire world is under his rule and everyone else is meant to serve him. The same asset in a noble man's hand is put to use for the benefit of others. His giving nature makes the resources available to those in need.
Strength is a faculty that can be dangerous when in wrong hands. The evil use it for torturing and tormenting others.
To a good man, either in life or after death, his goodness accompanies. The seeds he has sown outlive him and benefit the society long after he is gone as well.
Put thy invaluable assets and wealth to use in the right directions and leave an indelible mark in the hearts of your brethren. That is what makes a world of difference!
స్వస్తి.
**************************************************
123.
అజరామర సూక్తి -48
अजरामर सूक्ति -48
Eternal Quote-48
पात्रापात्रविवेकोऽस्ति धेनुपन्नगयोरिव l
तृणात्सञ्जायते क्षीरं क्षीरात्सञ्जायते विषम्- सुभाषितरत्नभाण्डागार ll
పాత్రాపాత్రవివేకోస్తి ధేనుపన్నగయోరివ l
తృణాత్సంజాయతే క్షీరం క్షీరాత్సంజాయతే విషం ll
- సుభాషితరత్నభాణ్డాగారము
యోగ్యతా యోగ్యత మధ్య గల అంతర్యాన్ని ఎంత విపులముగా కవి తెలిపినాడో
చూడండి. ఈ మాట మనము ఎన్నో పాత్రల ద్వారా చలన చిత్రములలో కూడా
వినియుంటాము. కానీ ఈ మాటలకు కుదురు ఈ సంస్కృత శ్లోకము లో వుంది అంటే
ఎంత ఆశ్చర్యమైన విషయమో చూడండి. పాత్రునికి అపాత్రునికి గల వ్యత్యాసము ఆవుకు
అజగరమునకు ఉన్నంత.ఆవు గడ్డితిని పాలిస్తే పాము పాలుత్రావి విషమిస్తుంది.
అందుకే పెద్దలు అపాత్ర దానము పనికిరాదన్నారు.
पात्रापात्रविवेकोऽस्ति धेनुपन्नगयोरिव
तृणात्सञ्जायते क्षीरं क्षीरात्सञ्जायते विषम्- सुभाषितरत्नभाण्डागार
चलचित्रों में हम कई बार इस वाक्य को सुने रहते की 'गाय घास खाकर दूध देती है और साँप दूध
पीकर जहर देते है| लेकिन इस बात का मूल इस संस्कृत श्लोक में है| शास्त्रों के अनुसार 'जो दान के
पात्र नहीं होते उन लोगों को कभी भी दान नहीं देना चाहिए|अच्छे आदमी को दान देनेसे वह समाज
को अपने तरफ से जितना होसके उतना
भलाई करता है| वही कुजन को देते हैं तो वह समाज को विघात पहूँचाके अपना स्वार्थ देखलेता है|
paatraapaatravivEkOsti dhEnupannagayOriva
tRNaatsanjaayatE kShIraM kShIraatsanjaayatE viSham
- subhaaShitaratnabhaaNDaagaara
Discrimination between the deserving and undeserving is, just as between a cow and a snake.
From grass is produced milk (in a cow); from milk is generated poison (in a snake).The deserving,
when offered even the slightest assistance, make maximum use of it and give back to the society
more than what they received. That keeps the goodness in the world alive. But those that take all
that is given to them and apply it to harm those around, were obviously undeserving, to begin with.
*************************************************
124.
అజరామర సూక్తి -49
अजरामर सूक्ति-49
Eternal Quote -49
दह्यमानाः सुतीव्रेण नीचाः परयशोऽग्निना l
अशक्तास्तत्पदं गन्तुं ततो निन्दां प्रकुर्वते- चाणक्य नीति
దహ్యమానాః సుతీవ్రేణ నీఛాః పరయశోగ్నినా
అశక్తాస్తత్పదం గంతుం తతో నిందాం ప్రకుర్వతే
- చాణక్య నీతి
ఓర్వలేనితనము ప్రళయాగ్ని వంటిది.ఆ చింత మనిషిని బ్రతుకనివ్వదు.'చింతా దహతి
జీవితం' అన్నారు పెద్దలు. నేను ఎదుటి వానికన్నా ఇంకా అభివృద్ధి లోనికి రావాలి
అన్న ఒక స్పర్ద మనసులో ఏర్పడితే ,దానికి కృషి తోడ్పడితే ఏదయినా
సాధించవచ్చు. ఎదుటివాని ఐశ్వర్యమును చూసి ఏడ్చుటవల్ల ‘తానేడిచి తన కళ్ళే
పోయె ఎదుటివాని కేడిచీ తన కళ్ళే పోయె’ నన్న చందమౌతుంది. కావున
మనకున్నదానితో సుఖపడదాము. ఇచ్చే వానికి ఏమివ్వాలో ఎంతివ్వాలో తెలిసినపుడు
ఎదుటి వాడిని చూసి ఎడ్చుట ఎందుకు?
दह्यमानाः सुतीव्रेण नीचाः परयशोऽग्निना l
अशक्तास्तत्पदं गन्तुं ततो निन्दां प्रकुर्वते- चाणक्य नीति ll
दूसरों के धन संपत्ति देख कर अगर कोई रोता है तो उन्हीका आरोग्य बिगडजाता है| संस्कृत में
'चिंता दहथी जीवितं' बोलते हैं, यानी चिंता आदमीको ज़िंदा जला देता है| जब देनेवालेको ये पता
है की हमें कितना देना है तब दूसरों को देख के जलना क्यों|
dahyamaanaa@h sutIvrENa nIChaa@h parayaSOgninaa l
aSaktaastatpadaM gantuM tatO nindaaM prakurvatE ll
- chaaNakya nIti
Niggard burn intensely in the fire of jealousy on others' prosperity.
Incapable of taking those measures by himself, he criticizes the
prosperous tirelessly.
Enmity is the dumbbell’s choice, for they cannot find a single
advantage to be gained from it. Enimity or jealousy only bring torment
on to himself. It is uncalled for self-inflicted pain, with no worthwhile
gain. Jealousy originates from inferiority and insecurity. These qualities
will not add anything to the positive character of a person and on the
contrary he invites all sorts of hazards including his own health. "The
envious die not once, but as often as the envied win applause." Be
thyself and leave the rest to Him!
స్వస్తి.
*************************************
అజరామర సూక్తి -50
अजरामर सूक्ति-50
Eternal Quote -50
अयुक्तं स्वामिनो युक्तं युक्तं नीचस्य दूषणम् l
अमृतं राहवे मृत्युर्विषं शङ्करभूषणम् ll - चाणक्य नीति
అయుక్తం స్వామినే యుక్తం యుక్తం నీచస్య దూషణం l
అమృతం రాహవే మృత్యుర్విషం శఞ్కరభూషణం ll - చాణక్య నీతి
మహనీయులకు అయుక్తమైనదే ఉండదు. వారికి ఏదయినా యుక్తమే. పరమేశ్వరుడు
గరళము మ్రింగి లోకరక్షణ చేసెను కదా. అదే నీచులకు ఎంత ఉపయుక్తమైనదైనా
తమ చేతకాని తనము వల్ల అది వారి దూషణ హేతువు కావచ్చు, వినాశాకారి కావచ్చు,
ప్రాణాంతకమే కావచ్చు. రాహువు నకు, అమృతము కొరకు పాల కడలిని మధించు
నపుడు జరిగినది అదే కదా.
None Can Destroy Iron but Its Own Rust Can
Likewise None Can Destroy A Person But
His Own Mind Set Can'... RATAN TATA
ఈ భామును నేను, కాకతాళీయము కావచ్చు, వారికన్నా చాలా పూర్వము వ్రాయుట
జరిగింది. సంబద్ధమని తలచి పై సూక్తికి అనుబంధముగా ఉంచుచున్నాను.
ఎవరు నీవారు ఎవరు పెర వారు
ఎవరు నీవారు ఎవరు పెర వారు
తెలుసుకోవాలి రా తెలిసి మసలుకోవాలిరా
వీడని తోడౌ నీడకు గూడా
వెలుగంటెనే వెరపు కదా
చీకటిలో మటుమాయము కాదా
నీ చేవయె నీ చెలువు కదా
నీ చేవయె నీ చెలువు కదా ॥ఎవరు॥
నెత్తురు పంచుకు పుట్టిన నలతే
చెరుపు చేయగా నీకెపుడూ
కొండల కోనల పండిన మాకుల
మూలికలే నీకండ కదా
మూలికలే నీకండకదా ॥ ఎవరు॥
అమరుల జేసే అమృతమే మరి
రాహువు పాలిటి మిత్తి కదా
హాలాహలమే ఆభరణముగా
శివుని గళములో నిలిచే కదా
శివుని గళములో నిలిచే కదా ॥ఎవరు॥
अयुक्तं स्वामिनो युक्तं युक्तं नीचस्य दूषणम् l
अमृतं राहवे मृत्युर्विषं शङ्करभूषणम् ll
- चाणक्य नीति
महापुरुष योग्य अयोग्य के बारेमे नही सोचते| वे, कुछ अयोग्य वस्तु को भी योग्य बनादेते हैं|
महाशिव गरल को भी अपना कंठभूषा बनादिये | उसी तरह जो नीच लोग होते हैं ,अगर कोई
बेहद अच्छा चीज भी मिलता है तो भी उस का लाभ नहीं उठा सकते| उसी लिए राहू अमृत पी कर
भी बच नहीं पाया| कंठ तो काया से अलग होगया |
ayuktaM svaaminE yuktaM nIchasya dUShaNam l
amRtaM raahavE mRtyurviShaM Sa~nkarabhUShaNam ll
- chaaNakya nIti
Even that which is inappropriate is suitable for a master, (but), even that which is
approved is a misfit for the inferior. The divine nectar brought death to Raahu,
whereas, poison became an adornment to Lord Siva. One size fits all', isn't the
rule always! Even that which is grossly inappropriate may fit quite alright with the
master. But even that which is deemed perfectly perfect, brings disgrace to the
inferior! The example given by the poet is that of Rahu and Siva. Being a demon,
Rahu, stealthily sat amidst the Devas (demi Gods) and consumed the divine
nectar (which bestows immortality). Seeing this, Lord Vishnu slew his head off.
But as he had already consumed a portion of the nectar, he lived on, with his
head separated from his body! Hence, even the divine nectar proved disastrous
for Rahu! On the other hand, Lord Siva drunk the poison that ensued in the
process of churning out the nectar, in order to save the world of its ill effects. His
wife, Goddess Parvati, held it down at his neck, making him Neelakantha (the
blue necked one). Even poison became an adornment for Lord Siva.
అజరామర సూక్తి-51
अजरामर सूक्ति-51
Eternal Quote-51
दुर्जनः परिहर्तव्यो विद्ययाऽलङ्कृतोऽपि सन् ।
मणिना भूषितः सर्पः किमसौ न भयङ्करः ॥ - नीतिशतक, भर्तृहरि
దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోపి సన్ |
మణినా భూషితః సర్పః కిమసౌ న భయఞ్కరః ||- నీతిశతక, భర్తృహరి
నీతి శతక కర్త యైన భర్తృహరి మహనీయుని ఈ శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి గారి
తెలుగు సేత ఈ విధంగా వుంది.
విద్యచే భూషితుండయి వెలయుచున్న
తొడరి వర్జింపదగు సుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషితశస్తమస్త
కంబు గల పన్నగము భయంకరము గాదె
ఎంతటి విద్యావంతుడైనా సహవాసానానికి యోగ్యుడు కాదు. ఎంతటి విలువగల
మానిక్యమును తలపై కలిగియుండినా సర్పము సమీపమునకు కూడా భయము వలన
పోలేము కదా!
दुर्जनः परिहर्तव्यो विद्ययाऽलङ्कृतोऽपि सन् ।
मणिना भूषितः सर्पः किमसौ न भयङ्करः ॥ - नीतिशतक, भर्तृहरि
दुर्जन कितना भी पदेलिखे हो हम उन से दोस्ती नहीं करसकते| क्योंकि अपने फण पर कितनाभी
अनमोल मणि रह्नेसेभी दर के मारे उस का करीब नहीं जासकते|
durjana@h parihartavyO vidyayaalankRtOpi san |
maNinaa bhUShita@h sarpa@h kimasau na bhaya~nkara@h ||
- nItiSataka, bhartRhari
An evil doer should be evaded, even if he is ornate with knowledge too! Just because it is adorned with a jewel, isn't a snake scary?
అజరామర సూక్తి-52
अजरामर सूक्ति-52
Eternal Quote-52
मित्रद्रोही कृतघ्नश्च यश्च विश्वासघातकः ।
ते नरा नरकं यान्ति यावच्चन्द्रदिवाकरौ ॥ - पञ्चतन्त्र, मित्रभेद
మిత్రద్రొహీ కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతకః |
తే నరా నరకం యాంతి యావచ్చంద్రదివాకరౌ || - పంచతంత్ర, మిత్రభెద
మిత్రద్రోహి, కృతఘ్నుడు, విశ్వాస ఘాతకుడు అయినటువంటివారు ఆచంద్ర
తారార్కమూ నరకలోకవాసులే.
मित्रद्रोही कृतघ्नश्च यश्च विश्वासघातकः ।
ते नरा नरकं यान्ति यावच्चन्द्रदिवाकरौ ॥
- पञ्चतन्त्र, मित्रभेद
जो मित्रद्रोही ,कृतघ्न और विस्वासघात होते हैं वे, जब तक सूरज, चाँद और तारे अम्बर पे होते हैं तब तक नरकावास ही करते हैं|
mitradrohI kRtaghnaScha yaScha viSvaasaghaataka@h |
tE naraa narakaM yaanti yaavachchandradivaakarau ||- panchatantra, mitrabheda
He who is treacherous to a friend; he who is ungrateful for rendered benefactions; he who is a
traitor will attain hell as long as the sun and moon exist. Back stabbing that credence is not dharma
in any which way.
**************************************************
అజరామర సూక్తి-53
अजरामर सूक्ति-53
Eternal Quote-53
दुर्जनेन समं वैरं प्रीतिं चापि न कारयेत् ।
उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करम् ॥
దుర్జనేన సమం వైరం ప్రీతిం చాపి న కారయేఎత్ |
ఉష్ణొ దహతి చాఞ్గారః శీతః కౄష్ణాయతే కరం ||
దుర్జన సాంగత్యానికి ఎప్పుడైనా దూరంగా ఉండటమే మంచిది. ఉదాహరణకు బొగ్గును
తీసుకొందాము. అది కాలునపుడు పట్టుకొంటే చేతిని కాలుస్తుంది. చల్లగా ఉన్నప్పుడు
పట్టుకొంటే చేతిని నలుపు చేస్తుంధి. కావున ఎప్పుడూ దుష్టునికి దూరముగా ఉండుటే
మంచిది.
దుష్టుడు నిప్పయి భయంకర అగ్నికీలలు ప్రసరింపజేస్తూవుంటే దగ్గరికి పోయిన
మనము మాడి మశియై పోతాము. పోనీ అతను సాధారణ స్థితిలో ఉన్నపుడు
సాంగత్యము కోరుకొని దగ్గరకు చేరి క్కిసి మెలిసి యుందామా అంటే ఆ బొగ్గునలుపు
అంటే అతనిలోని దుర్గుణములు మనలనంటుకొంటాయి.
బొగ్గు కాలు చుండ పోయి తాకగలేము
చేయి కలుప చెంత చేరలేము
అట్టులైన బూది ఇటులైన నలుపంటు
దుష్ట జనులకెపుడు దూరముండు
दुर्जनेन समं वैरं प्रीतिं चापि न कारयेत् ।
उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करम् ॥
दुर्जन को कभी भी दूर रखना चाहिए. इसका एक उदाहरण देखिये|कोयला अगर जलते समय
हाथ में लेंगे तो हाथ जल जाता है और बिना जलते समय लियेंगे तो हाथ काला होजाता है| इस का
टिपण्णी ये है की उसे कभी भी दूर रखना ही है| इसी तरह दुर्जन कोभी किसी भी हालत में
अपनाना नहीं चाहिए|
durjanena samaM vairaM prItiM chaapi na kaarayet |
uShNo dahati chaa~ngaaraH shItaH kRuShNaayate karam ||
Do not develop enmity or affection with the evil. When hot, coal burns; when
cold, blackens the hand! When one comes across an evil doer, what kind of
bond should he build? Should he make friends with him, so that he doesn't get
on the evil doer's bad books? Or, should he rub him on the wrong side and erupt
an argument, declaring open enmity?
Poet says..., neither! He establishes his stance thus - a piece of charcoal, when
hot, will burn the hand holding it. Now, can we say, it is okay when it is not lit up?
Not necessarily. Because, a piece of charcoal, when cold, will blacken the hand
that handles it!! It is not a pleasant outcome either way. The best way is to keep
evil at arm’s length.
స్వస్తి.
*****************************************************
అజరామర సూక్తి-54
अजरामर सूक्ति-54
Eternal Quote-54
आत्मनो मुखदोषेण बध्यन्ते शुकसारिकाः l
बकास्तत्र न बध्यन्ते मौनं सर्वार्थसाधनम् ll - सुभाषितरत्नसमुच्चय
ఆత్మనో ముఖదోషేణ బధ్యంతే శుకశారికాః l
బకాస్తత్ర న బధ్యంతే మౌనం సర్వార్థసాధనం ll - సుభాషితరత్నసముచ్చయము
శుక శారికలు తమ అందమో మాటకారితనమో ఆకర్షించుటకు ఉపయోగించి వేటగానికి దొరికిపోతాయి. దీనిని మూర్ఖత్వమనక ఏమననౌతుంది. అదే కొంగలు నోరు విప్పవు. అందుకే అవి తప్పించుకొంటాయి. కావున మౌనము అధిక ప్రయోజనకారి.
అందుకే రామదాసు రాములవారిని 'పలుకే బంగారమాయెనా! ‘అని అన్నాడు.
చిలకలు మరియు ఇతర పక్షులు, తమ నోరు కారణముగా అవాంఛితముగా వేటగాని దృష్టిని ఆకర్షిస్తాయి. కాబట్టి పంజరములో బంధించుటకు వేటగాడు వానిపై వలను విసరియుంచుతున్నాడు. . కానీ కొంగలు తమ మౌనము కారణముగా వేటగాళ్ళను అధికముగా ప్రలోభపెట్టుట లేదు. కాబట్టి మనము మౌనము పాటించుటలో కొంగను అనుసరించవలసి యున్నది.
మాట అన్నది ఒక సమ్మోహక మంత్రము. మనము నోరు విప్పి మాట్లాడితే ఎదుటివానికి తిరిగీ నోరుతెరిచే అవకాశము రాకూడదు.ఆవిధముగా లేని పక్షములో నోరు మూసుకొని యుండుటే మంచిది. విజ్ఞానుల సాంగత్యము కోరదగినదే కానీ ఆ సమయయములో మౌనము పాటించి వింటే మనకెంతో విజ్ఞానము లభిస్తుంది. లేదంటే మనకు మిగిలేది ఈసడింపే. నోరు తెరువనంత వరకే కాకికీ కోకిలకు పోలిక . నోరుతెరిస్తేనో కాకి కాకే కోకిల కోకిలే! అందుకే వూరకున్నంత ఉత్తమము బోడిగుండంత సుఖము లేదన్నారు పెద్దలు.
మాట గొప్పదనమును ఈ చాటువు ఎంత గొప్పగా చాటినదో చూడండి.
మాటలచేత దేవతలు మన్నన జెంది వరంబులిత్తురున్
మాటల చేత భూవరులు మన్నన జేసి పురంబులిత్తురున్
మాటల చేత కామినులు మన్నన జేసి మనమ్బులిత్తు రా
మాటలు నేర్వకున్న నవమానము న్యూనము మానభంగమున్
అది మాట గొప్పదనము.
కొందరికి మాటలాడుట ఒక కళ, మరికొందరికి మాటలాడుట కేవలము కల. మాట నిజముగా వరహాల మూట. అభ్యసించితే ఆనందమే! అవమానము దరిజేరదు.
మాట వలన జరుగు మహిలోన కార్యముల్
మాట వలన పెరుగు మైత్రి ,కనగ
మాట నేర్వకున్న మనుగడ లేదిది
రామమోహనుక్తి రమ్య సూక్తి
నా ఉద్దేశ్యంలో మాటకు ఇంత ప్రాధాన్యత వుంది.
కొన్ని తేనె ఊటలు కొన్ని బంగారు గొలుసు పేటలు, కొన్ని మంచికి బాటలు, కొన్నిహాయిని కలిగించే పాటలు, కొన్ని అందాలీనే తోటలు, కొన్ని రక్షించే కోటలు, కొన్ని అతి మెత్తని దూటలు (దూటను అరటి బొందె అనికూడా అంటారు),కొన్ని కష్టాలిచ్చేపూటలు, కొన్ని చెడ్డను చెరిగే చేటలు, కొన్ని ఎండిన చెట్లకు తాటలు ( అంటే చెట్టు బెరడు, Bark),కొన్ని జీవితముతో ఆడుకొనే ఆటలు,కొన్ని గాయము చేసే ఈటెలు,తుపాకి పేల్చే తూటలు, కొన్ని నీటి మూటలు,కొన్ని పదును కత్తులు, కొన్ని నక్క జిత్తులు. కొన్ని విషపు విత్తులు, కొన్ని ఆపదల గుత్తులు. కానీ సుమతి శతక కారుడు మాటను, సత్యము అనే ఒక మేకు తో గోడకు తగిలించినాడు.
ఈ మాట గమనించండి.
వాక్కువలన గలుగు పరమగు మోక్షంబు
వాక్కువలన గలుగు పెక్కు ఘనత
వాక్కువలన గలుగు నెక్కుడు సంపద
వాక్కు ఒకటి చాలు వరల భువిని
ఈ పద్యము చదవండి.
వినదగు నెవ్వరు చెప్పిన
వినిననంతనే వేగుపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ
మాటను, ఆకర్ణించుట, అవగాహన చేసుకొనుట ఆచరించుట యొక్క గొప్పదనము ఈ పద్యములో తెలుస్తుంది. అంటే ఒక మాటను ఆకళింపు చేసుకోనేదానికి ఎంత అవగాహన అవసరమో అర్థము చేసుకోన గలరు. అసలు ఇవన్నీ డబ్బుతీసుకొని చెప్పే Management Science లోని భాగాలే!
నేను వ్రాసిన ఈ రెండు పద్యములను చదవండి.
మనసు మాటలోన మాటేమొ పనిలోన
పనికి పట్టుదలను పదిలపరచి
కష్ట పడెడు వాడు కడు గొప్ప వాడురా
రామ మొహనుక్తి రమ్య సూక్తి
పాటకు పల్లవి ప్రాణము
ఆటకు ‘లయ’యౌను ప్రాణమాలోచింపన్
మనిషికి నడతే ప్రాణము
మాటకు ప్రాణమ్ము’నిజము’మరువకు రామా!
భావము సుబోధకము.
అయినా ఒక్క మాట. మాట త్రికరణ శుధ్ధి గా ఉండాలన్న మాట. త్రికరణములు అంటే మనోవాక్కాయకర్మలు. భావము మొదట మనస్సులో కలుగుతుంది. అది వాకు ద్వారా బహిర్గతమౌతుంది. దానిని క్రియారూపమున పెట్టె కర్మమునాచరించితే మనము ఒక కార్యమును బాహ్యాభ్యన్తరశ్శుచితో చేసినట్లు. అప్పుడే మనసుకు తృప్తి,మనిషికి ఆనందము.
తల్లి తన సంతుకు మొదటి గురువు. ఒక వ్యక్తిని చూపి యితడు మీనాన్న అంటే అది ఆశిశువు తక్షణము గ్రహించుటయే కాక నాన్న అని పిలుస్తూ అనుబంధము ఏర్ప్రచుకోవడము జరుగుతుంది. తండ్రి వ్రేలు పట్టుకు నడుస్తూ ఎన్నో విషయాలు తెలుసుకొన్న పిదప గురువుకు అప్పగించడం జరుగుతుంది. 'గురువు' 'teacher' కు సమానార్తకము కాదు. Teacher అంటే one who teaches. అతని బాధ్యత అక్కడితో ముగుస్తూంది. 'గురుత్వ'మది కాదు. అసలు గురుత్వము అంటే 'density',అంటే గాఢమైన అని అర్థము . పాఠము చెప్పి ఇక పోయిరమ్మనుట కాదు గురువు యొక్క బాధ్యత. శిష్యుడు తనంతవాడయ్యేవరకు తన చత్ర ఛాయా (గొడుగు నీడ)లోనే వుంచుకొంటాడు కావున వానిని ఛాత్రుడు అన్నారు. ఎంత మంచి మాటో చూడండి.అదే student అనే మాటకు one who studies అనే గదా అర్థము. కావున గురుశిష్య సంబంధమునకు teacher--student సంబంధమునకు హస్తిమశకాంతరము, అజగజ సామ్యము,పర్వత పరమాణు సారూప్యము. కావున గురువు ఏమి మాట్లాడవలె ఎట్లు మాట్లాడవలె ఎంత మాట్లాడవలె అన్నవి కూడా తన శిక్షణ లో భాగంగా చెబుతాడు. అందుకే నే నంటాను:
అమ్మ మాట సద్ది యన్నంపు మూటౌను
అయ్యా మాట చూడ అందు పెరుగు
గురువు గారి మాట గురుతుంచు లవణము
రామమోహనుక్తి రమ్య సూక్తి
హనుమంతుడు మారువేషములోవెళ్లి మొదటి సారి రామలక్ష్మణులను చూసి వారిని ప్రశ్నించిన తీరును రాములవారు వాల్మీకి రామాయణము లో ఈ విధంగా మెచ్చుకొంటాడు :
నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః l
న సామవేద విదుషః శక్యమేవాభ్యభాషణం ll
ఋగ్వేద వినీతుడు అంటే వేదమును గురువు వద్ద అధ్యనం చేసిన వాడు. యజుర్వేద ధారిణుడు అంటే ఉదాత్త అనుదాత్త స్వరాలతో షడంగ సముపేతమైన వాక్ శుధ్ధి, సందర్భోచిత సమాధానాలు కలిగిన వాడు. సామ వేద విదుషః అంటే శాస్త్ర సంగ్రహుడే కాక గాన ప్రాధాన్యమైన సామవేదం సాంగోపాంగంగా నేర్చి తన ఊహా వైదుష్యంతో శ్రోతలకు రససిద్ధి కలిగించినవాడు. మాటకు అంత ప్రాధాన్యత వుంది. అడుగుటలో అణకువ వుండాలి.
ఈ భర్తృహరి పద్యానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత ఒక సారి తిలకించండి .
భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్
భూషణ మే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్
ఇదండీ మాట యొక్క మహిమ.
చివరిగా రెండు మాటలు చెప్పి నా విశ్లేషణ ముగిస్తాను.
ఈ భర్తృహరి పద్యానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత ఒక సారి తిలకించండి .
భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్
భూషణ మే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్
ఇదండీ మాట యొక్క మహిమ
ఇక విమర్శను గూర్చి ఒక్క మాట. విమర్శ అన్నది నోటికొచ్చినట్లు మాట్లాడుట కాదు. చదరంగములో పావులను ఆలోచించి కదిలించిన రీతిలో అక్షరములను ఏర్చి పేర్చి కూర్చవలె. అప్పుడే ఆమాటకు కలుగుతుంది అర్థము అడిమనకందిస్తుంది పరమార్థము. అందుకే
విమర్శ చిరుజల్లులు కురిసినట్లుండాలి కానీ జడివాన లాగా కాదు. అంటే ఎదుటి వారికి బాధ కలిగించుట కానేకాకూడదు. హాయిగా పూల జల్లు వలె ఉండవలెను.
ఎంత హాయిగా వుండాలనుటకు సుమతి శతకకారుని మాటే కొలబద్దను హాస్యరస దూరనిలో నేను యతిప్రాసల నియమము లేకుండా ఈ విధముగా తెలిపినాను :
ఎప్పటికెయ్యది వాంటెడొ
అప్పటికా టాకు టాకి అన్యుల హార్టుల్
హర్టింపక హర్టవ్వక
ఎస్కేపై తిరుగు వాడు ఎక్స్పర్ట్ సుమతీ
తిక్కన మాటతో ఈ వివరణను ముగిస్తున్నాను.
ఎదిరికి హితమును, బ్రియమును,
మదికింపును గాగ బలుకు మాటలుపెక్కై
యొదవినను లెస్స, యటు గా
కిదయది యన కూరకునికి యెంతయు నొప్పున్
అందుకే ఊరకున్నంత ఉత్తమము బోడిగుండంత సుఖము లేదని పెద్దలు చెప్పినారు.
ఔచిత్యంతో పదాలను ఉపయోగించండి. మనిషికి మౌనము బంగారమునకు తావి లాంటిది.
आत्मनो मुखदोषेण बध्यन्ते शुकसारिकाः
बकास्तत्र न बध्यन्ते मौनं सर्वार्थसाधनम्- सुभाषितरत्नसमुच्चय
तोते और उसी तरह के कुछ अन्य पक्षी अपने ही मुख के कारण कब्जा कर लियेजाते हैं। निरा को कब्जा नहीं करते क्यों की वह बोलनेमे उत्सुकता नहीं दिखाती और मौन रहना ही उस का गुण है। तो मौन साधना सभी प्रयोजनों को प्राप्त करने में महत्वपूर्ण भूमिका निभाती है! भाषण चांदी है और मौन सुनहरा है!
उनकी बकबक के कारण या सुन्दरताके कारण तोते और अन्यपक्षियों, खुद पर अवांछित ध्यान आकर्षित करती हैं। वसे पक्षियों को पिंजरे में बंद करनेकेलिए शिकारी, उन पर जाल बिछाता है। लेकिन 'मूक'निरा, उनकी चुप्पी रखने के कारण और रूप से शिकारी को न लुभाने के कारण से वह बाख जाता है। तो कभीभी बक्नेसे मौन रहना अच्छा होता है।
आदमी रूपसे और अपने वेशभूषा से सुन्दर तो लगसकता है लेकिन उन्होंने अपना मुख खोलके
बात करनेसे लोग समझ जाते हैं की वह मूख है या ज्ञानी। उसी लिए जब हम पंडितों के कूट में बैठते हैं तो हम सावधान और सतर्क से बर्ताव करना चाहिए । किसी भी विषय पर हम मुह खोलनेके पहले, जो विषय के बारे में हम बोलना चाहते हैं यह चिंता करना चाहिए की हमें उस विषय का पूरी
जानकारी है।
कव्वा और कोयल देखनेमे तो एक होते हैं लेकिन क्व्वेको मूँ खोलनेसे भागना ही पड़ता है।
इसीलिए अगर हमें विषय का पूरा ज्ञान है तो नहीं बोलना बेहतर होताहै या अगर बोलनेका उतना ही
जरूरत पड़ता है तो कम बोलना बहुत बेहतर है । शब्द शस्त्र जैसा है, सिर्फ समय आनेसे ही अकलमंद उसका इस्तेमाल करता है ।
aatmanO mukhadOShENa badhyantE SukaSaarikaa@h l
bakaastatra na badhyantE maunaM sarvaarthasaadhanam ll- subhaaShitaratnasamuchchaya
Parrots and other talking birds get captured due to their own folly. Storks are not captured. Silence
is instrumental in attaining all purposes! Speech is silver, silence is golden!
Parrots and other talking birds, due to their chattering, attract unwanted attention on to themselves. Hunters aspiring to cage a talking bird, spread nets to capture them. But the 'dumb' storks :), keep their silence and don't entice the hunters as much. Ever heard of a stork being captured to adorn a cage! It is as if, his silence saved him from trouble.
It is very true for humans as well. Time and again, it is felt by all, 'why ever did I open my mouth!', after letting words slip through his lips! Before speaking, is the time to remind oneself 'Silence is instrumental in attaining all purposes!' for, sped arrows and spoken words can never be taken back.
Use thy words judiciously. Also, know when it is best not to use it at all!
****************************************************1130.
అజరామర సూక్తి-55
अजरामर सूक्ति-55
Eternal Quotell-55
इन्द्रियाणि च सम्यम्य बकवत् पण्डितो नरः l
देशकालबलं ज्ञात्वा सर्वकार्याणि साधयेत् ll - चाणक्य नीति
ఇంద్రియాణి చ సమ్యమ్య బకవత్ పణ్డితో నరః l
దేశకాలబలం జ్ఞాత్వా సర్వకార్యాణి సాధయేత్ ll - చాణక్య నీతి
ఇంద్రియులందు సంపూర్ణ సమ్యమనము పాటించుతూ కొంగ ఒంటికాలుపై నిలిచి తన ఆహారమైన చేపలను పట్టుకొంటుంది. తెలివిపరుడు కూడా కార్య సాధన కొరకు తగిన సమయమునకై వేచియుంటాడు గానీ తొందర పడడు. కొంగ తన ఆహారము అందుబాటులోకి వచ్చే వరకు కదలదు మెదలదు. అది అలసత్వమా అంటే కాదు కానే కాదు. అవకాశము కొరకు అవసరమైన నిరీక్షణ అది. అందువల్లనే తానూ తలచిన ఆహారాన్ని పొందగలుగుతూ వుంది. వివేకి కూడా అవసరము కొరకు అవకాశమును వదలడు. ఎంత సేపయినా వేచియుంటాడు. కానీ అవకాశమును జార విడువడు. నిరీక్షణ ఎప్పటికీ అలసత్వము కానేరదు. అట్లని అలసత్వమూ నిరీక్షణ కానేరదు. తానూ కదలనంత మాత్రాన ఏమీ చేయుట లేదని కాదు. తన పరిసరములను, తగిన సమయమును తగిన ఫలితముకై ఎదురు చూచుచున్నాడు. ఓర్పు అన్నది మానవునికి ఇస్తుంది నేర్పు. నేర్వకుంటే మిగిలేది ఓదార్పు.
इन्द्रियाणि च सम्यम्य बकवत् पण्डितो नरः l
देशकालबलं ज्ञात्वा सर्वकार्याणि साधयेत्- चाणक्य नीति ll
समय और ताकत के बारे में पता रखतेहुए, एक सारस उसकी जगह से नहीं हिलती, उसी तरह एक
सुविज्ञ , अपने होश काबू में रखते हुए, अं मौकेके इन्तजार में रहतेहुए उसके सभी कार्यों में सफल
होता है।
एक सारस, यहां तक कि एक पैर पर खड़ी , अपनी पकड़ के लिए धैर्यपूर्वक इंतजार किए बिना,
अपनी जगहसे नहीं हिलती और आसपास की घटनाओं के बारे में ध्यान भी नहीं रखती, और मौका
आने पर अपने शिकार को पकड़ लेती है | सफलता पाकर ही सांस लेती है |
उसी तरह एक चतुर व्यक्ति भी अपने परिवेश के बारे में पता रखते हुए , अपने होश के सुख में
उपज नहीं होने देता है। उनकी इच्छाओं या इंद्रियों की कमजोरियाॅ व अपने तर्क प्रबल नहीं होने
देंता। परिस्थिथि के अनुसार उन्होंने खुद को समायोजन करलेता है या अपने आप को परिवर्तन कर
लेता है, फिर भी प्रतिबद्धता से अटल रहता है। उसकी शक्तियों और कमजोरियों, समय और स्थान
के लिए उनकी जागरूकता, सभी को अपनी बुद्धि के लिए योगदान करते हैं। उनके धैर्य और दृढ़ता
के जरिये अंत में उसे सुफल देके सफल करता है|
सब्र कभी भी निष्क्रिय नहीं होता, वह तो अं मौकेका इंतज़ार होता है |उस आदमी आलसी नहीं है!
धीमी गति से मुश्किलों को पार करके अपना वंचित फल पाता है । धैर्य ज्ञान का साथी है शत्रु नहीं !
indriyaaNi cha samyamya bakavat paNDito naraH l
deshakaalabalaM j~naatvaa sarvakaaryaaNi saadhayet ll - chaaNakya nIti
By restraining the senses, like a stork, a learned person, aware of his space,
time and strengths, succeeds in all his tasks.
A stork stands still in a place, without moving even a bit, waiting patiently for
its catch, on one foot. It is very aware of the happenings around, yet restrains
its senses. He knows his patience gets paid eventually!
Same is done by a shrewd person. He is very aware of his surroundings, but
doesn't yield into the pleasures of his senses. He will not let his desires or
weaknesses of the senses, overpower his reasoning. He is flexible to
changes, yet firm in his conviction. His awareness to his strengths and
weaknesses, time and space, all contribute to his wisdom. His patience and
perseverance pay off eventually!
Patience is waiting, not passively waiting - that is laziness! But to keep going
when the going is hard and slow - that is patience. Patience is the companion
of wisdom!
Patience is virtue.
స్వస్తి.
*********************************************************************
అజరామర సూక్తి -56
अजरामर सूक्ति - 56
Eternal Quote -=56
एकवृक्षसमारूढा नाना वर्णा विहङ्गमाः |
प्रभाते दशसु दिक्षु तत्र का परिवेदना ||- चाणक्य नीति
ఏకవృక్షసమారూఢా నానా వర్ణా విహఞ్గమాః |
ప్రభాతే దశసు దిక్షు తత్ర కా పరివెదనా || - చాణక్య నీతి
ఎన్నో పక్షులు ఎన్నో గూళ్ళు. అన్నీ అదేచెట్టుమీదనే! రాత్రంతా సేద తీర్చుకొంటాయి అన్నీ
అక్కడే తెల్లవారుతూనే పొట్ట చేత పట్టుకొని దశదిశల కూ ఎగిరి పోతాయి. అంత
మాత్రాన చెట్టు ఆ పక్షులను గూర్చి అవి తనకు కృతజ్ఞతతో ఉండలేదని అనుకొనుట
తప్పు కదా!
జీవితం లో నైనా ఇదే జరుగుతుంది! ఎవరెవరో ఎక్కడెక్కడ నుండియో వస్తారు . తమ
పని తీరిపోతూనే ఎవరిదారి వారిదే! ఈ విషమై వాల్మీకి రామాయణములో ఈ విధముగా
అంటాడు.
యదా కాష్టంచ కాష్టంచ సమేయేతాం మహార్ణవే l
సమేత్యపి వ్యపేయేతాం కాలమసాధ్య కంచన ll -అరణ్యకాండ 105.26
ఒక పెద్ద వరదలో అటువైపునుండి ఒక దుంగ ఇటువైపునుండి ఒక దుంగ కలిసి కొంత
దూరము పయనించుతాయి. కానీ ఆవి కాలమనే ఒరవడికి విడిపోతాయి. ఇది ప్రకృతి
సహజము. పైగా ఇక కలవవు అని కూడా చెప్పలేము. లేక తప్పక కలుస్తాయి అనలేము.
ఒకే చెట్టు పక్షులు ఎటు తిరిగినా రాత్రికి రావలసినదే కదా! చెట్టుకు కూడా ఆ సహనము
కావాలి.
మనకైనా పై విషయము అదే విధముగానే వర్తిస్తుంది. ఏవేవో కారణాలతో ఒకేచోట
పోగైనవారు తమ అవసరము తీరగానే తమదారి తాముచూసుకొంటారు. వారు
కృతజ్ఞత చూపలేదే అని మనము బాధపడితే కోరి రోగాలు కొనితెచ్చుకోవడమే!
దానికంటే వారి రాకపోకలవల్ల మనకు వచ్చిందీ లేదు పోయిందీ లేదు అని ఊరకుంటే
ఆరోగ్యము వుంటుంది ఆనందమూ వుంటుంది.
ఆశ్రయించినవారికి అయినంతవరకు సమకూర్చు. కృతజ్ఞత చూపలేదని కృంగిపోవద్దు.
एकवृक्षसमारूढा नाना वर्णा विहङ्गमाः |
प्रभाते दशसु दिक्षु तत्र का परिवेदना ||- चाणक्य नीति
अलग अलग रंग पंख के पक्षी, सभी एक पेड़ पर आराम कर, सुबह आते ही, दस दिशाओं में उड़ जाते
हैं। उन के बारे में पेड़ को तड़पना क्या है?
एक पेड़ कई तरह के रंगीन पक्षियों को सोने के लिए सुरक्षित ठिकाना देता है। यहां तक कि सुबह की
थोड़ी सी दरार से पहले, वे सब एक बीज या कीड़ा की तलाश में, अलग अलग दिशाओं में उड़जाते
हैं। पेड़, इन पक्षियों के बारे में अगर ऐसा तड़पता है की - 'ओह, मैं उन्हें रात भर आश्रय दिया!वे मेरे
लिए बिना कुछ भी परवाह किए सुबह होतेही उड़ान भरे बिना कोई कृतज्ञता दिखाए ।' यह कितना
तक ठीक है हम इस नीचे विचार करते हैं।
जीवन के विभिन्न क्षेत्रों से लोग, सभी के जीवन में, विभिन्न बिंदुओं पर विभिन्न प्रयोजनों के लिए मिलते
हैं। उस उद्देश्य की सेवा की जाती है, तो वे आगे बढ़ते हैं। क्या उन के बारे में तड़पना ठीक है? किसी
को हमेशा आभारी रहना या अधीन में रहना नमुमकिन है और इस तरह का उम्मीद रखना भी ठीक
नहीं है! मिलना बिचाद्ना तो वक़्त का दस्तूर होता है। जुदा होक भी कोई यादों से दूर ना होता है। सुबह
चले जाते हैं तो रात को आजाते हैं । लेकिन इतने में उतना परेशान क्यूँ? अगर उन लोगों का आना ना
भी होतो पेड़ वैसाही रहता है ।
पेड़ तो न कुछ खोता है न पाता है।
EkavRkShasamaarUDhaa naanaa varNaa viha~ngamaa@h |
prabhaatE daSasu dikShu tatra kaa parivedanaa || - chaaNakya nIti
Birds of different colored feather, all resting on one tree, come morning, shall fly off in ten directions.
What is there to agonize about?
A tree houses many a colorful birds and gives them a safe haven to sleep in. Come morning, even
before the slightest crack of dawn, they all fly away in different directions, in search of a seed or
worm. Does it make sense for the tree to agonize about the birds - 'Oh, I gave them shelter all night
long, in the morning they did not care for me and flew away on their own accord!'
Same happens in life! People from different walks of life, all meet for different purposes at different
points in life. When that purpose is served, they move on. What is in it to agonize about? Feeling
that someone should be indebted to him forever and be subservient to him is baseless! People who
leave for various reasons cannot obliterate the past from the mind. If they leave in the morning will
surely come in the evening. It is the question of waiting with patience. We meet people for a
reason, season or a lifetime. Sometimes, there are short lessons to be learnt or to be shared. At
times, the exchange of lessons needs a little longer time. But there are certain people and
relationships that need a whole lifetime, to learn, share and grow together with. But then, when
their growing is done here, even they, pass on!
The lesson is that the tree neither loses nor gains. Then why worry in the middle?
**************************************************************
అజరామర సూక్తి-57
अजरामर सूक्ति-57
Eternal Quote-57
मूर्खस्तु प्रहर्तव्यः प्रत्यक्षो द्विपदः पशुःl
भिध्यते वाक्यशल्येन अदृष्टो कण्ठको यथा- चाणक्य नीति ll
మూర్ఖస్తు ప్రహర్తవ్యః ప్రత్యక్షో ద్విపదః పశుః l
భిధ్యతే వాక్యశల్యేన అదృష్టో కణ్టకో యథా ll
- చాణక్య నీతి
ఏవిధముగా ఒక ముల్లు శరీరములో కుచ్చుకొన్న తరువాత కంటికి కనపడకుండా
బాధపెడుతూనే ఉంటుందో , ఒక మూర్ఖుడు కూడా తన విషపూరితమైన ప్రేలాపనలతో
మనసును గాయ పరుస్తూనే ఉంటాడు. ఆతను ద్విపాద పశువుతో సమానము.
ఒక ముల్లు శరీరములో కుచ్చుకొంటే అది బాధిస్తుంది. అది సహజమే! కానీ దానిని
తొలగించుదామంటే కంటికి కనిపించదు. పోనీ అది వూరకుంటుందా అంటే
బాధపెడుతూనే వుంటుంది. అదేవిధముగా ఒక మూర్ఖుడు తన మాటల తూటాలతో
నొప్పించుతూనే వుంటాడు గానీ ఆలోచించి అది అనవసరమని గ్రహించాడు. అటువంటి
వానిని రెండు కాళ్ళ జంతువు అని పిలువక వేరేమని పిలువగలము. ఒక జంతువు
భావోద్వేగాలు అర్థము చేసుకోలేని జంతువులు కూడా కొన్ని అసాధారణ సమయాలలో
దయ జాలి కరుణ సానుభూతి చూపిస్తాయి. కానీ ఈ రెండు కాళ్ళ జంతువు తన బఠానీ
మెదడు లోనికి అటువంటి ఒక ఆలోచన రానివ్వలేడు. జీవితములో మనము
అలాంటివారిని ఎదుర్కొంటే అధిగమించుట కష్టము కాదు, కష్ట తరము. అందుకే
ఆంధ్ర భారతములో ఉద్యోగ పర్వములో విదురుడు ధృతరాష్ట్రునికి ఈ విధముగా
చెబుతాడు.
తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!
తనువున దిగిన బాణములను అతికష్టముమీద బయటకు తీయవచ్చు,
కాలాంతరములో ఆగాయాలు మానిపోనూవచ్చు.. కాని ఇతరులకు కష్టాన్ని
కలిగించేట్లు మాట్లాడిన మాటలను తొలిగించడం ఎన్ని ఉపాయాలచేతకూడా సాధ్యం
కాదు. మన శాస్త్ర, ఇతిహాస పురాణాలు మహా మహిమాన్వితమైన సూక్తి నిధులు. అవి
చదివి ఆకళింపు చేసుకొంటే ఎటువని ‘Western Quotations’ కు పోనవసరము లేదు.
मूर्खस्तु प्रहर्तव्यः प्रत्यक्षो द्विपदः पशुः
भिध्यते वाक्यशल्येन अदृष्टो कण्ठको यथा
मूर्ख को एक दो पैर वाले पशु के रूप में समझा जाना चाहिए। एक अदृश्य काँटा शरीर में छेद किया,
बस के रूप में वह अपने भाले जैसे अनागरिक बातोंको शरीर में घुसाकर दर्द पहूँचाता है। एक काँटा
शरीर में घुसजाता है और प्रयाण करनेसे नहीं मिल पाटा है तो दर्द सह्नाही पड़ता है । मूर्ख ,जो इस
तरह के एक कांटा है,से भी इसीतरह छुटकारा पाना आसान नहीं है। , एक मूर्ख व्यक्ति लगातार
असभ्य शब्दों के साथ हमला करता ही राहता है। ऐसे लोग दो पैर वाले पशु होते हैं। साधारनतय एक
जानवर दूसरों की भावनाओं के साथ सुसंगत नहीं होगा, लेकिन असामान्य परिस्थितियों में करुणा
दिखाने वाले जानवरों को सुने हैं और देखेभी होंगे।लेकिन यह दो पैर वाले जानवर अपने मटर
मस्तिष्क मेंऐसे विचार नहीं ला सकता है। ऐसे लोगों के साथ सामना करेंगे, तो उन के ऊपर काबू पाने
के लिए कठिन है।
mUrkhastu prahartavya@h pratyakShO dvipada@h paSu@h
bhidhyateE vaakyaSalyEna adRShTO kaNTakO yathaa
- chaaNakya nIti
The imbecile should be deemed as a two legged animal. He pierces with verbal
spears, just as an invisible thorn pierced into the body.
When one is pricked with a thorn, it hurts alright! First thing he would want to
do, is, remove it. But if it is invisible, or deep seated with in that he can't reach
it? An imbecile is such a thorn, which cannot be easy to get rid of it. Till it is
removed it pricks constantly. Similarly, an ignoramus person constantly
attacks with rude words, as if they were verbal spears. He keeps poking and
prodding without respite. Such people can be called as a two legged animal!
An animal would not be coherent with the emotions and feelings of others
but at times we see animals showing compassion under atypical
circumstances. But this two legged animal will never budge an inch as he
cannot let his pea brain to think. It is hard to overcome if we are encountered
with one such fellow.
స్వస్తి.
**************************************
అజరామర సూక్తి-58
अजरामर सूक्ति-58
Eternal Quote-58
सुश्रान्तोऽपि वहेद्भारं शीतोष्णं न च पश्यति l
सन्तुष्टश्चरते नित्यं त्रीणि शिक्षेच्च गर्दभात् ll - चाणक्य नीति
సుశ్రాంతో పి వహేద్భారం శీతోష్ణం న చ పశ్యతి l
సంతుష్టశ్చరతే నిత్యం త్రీణి శిక్షేచ్చ గార్ధభాత్ ll - చాణక్య నీతి
గడ్డి గాద మెసవి కడు భార మెత్తుచు
గాలివాన ఎండ చలిని గనక
కష్ట మందు తృప్తి కలిగి యుండు ఖరము
రామ మొహనుక్తి రమ్యసూక్తి
బరువుకు లొంగిపోక, వాతావరణమునకు క్రుంగిపోక, సంతృప్తితో జీవనము సాగించే
గాడిద ఈ మూడు వైఖరులను నేర్పుటకు మనకు గురుతుల్యము కాదా!
ఒక గాడిద నుండి కూడా నేర్చుకోవలసి పాఠాలు ఉన్నాయి! ఒక గాడిద బరువు
మోయుటకు ఉపయోగిస్తారు. 'వీడు గాడిద బరువు మోస్తున్నాడు' అన్న సామెత కూడా
కద్దు. నవ్వేందుకు ఒకమాట చెబుతాను. ఒక ఆకతాయి గురువు గారిచేతిలోని పిల్లల
'వ్యాస వ్యాసంగ పొత్తము' ను (Composition Book ) జూచి ' గురువుగారూ గాడిద
బరువు మోస్తున్నారే' అన్నాడట. అందుకు ఆయన 'ఇది గాడిద బరువు కాదు నలభై
గాడిదల బరువు అన్నాడట.' అంటే గాడిద బరువు మోయుటకు ప్రతీక అన్న
విషయమునకు ఈ మాట చెప్పుట జరిగింది.
అది ఎండ గాలి అనకుండా ఎంత పనయినా చేస్తూనే వుంటుంది. పని దప్ప
పరిసరాలకు, పర్యావరణకు స్పందించదు!
ఇది అందుబాటులో వున్నా ఎందు గడ్డి ఎండుటాకులు పారవేసిన కాగితములను
తినుటలోనే సంతృప్తిని పొందుతుంది. కృషి పట్టుదల ఆదర్శము కలిగిన మానవులకే ఇది
సాధ్యము.
ఈ మూడులక్షణములను కలిగిన వ్యక్తి లోకారాధ్యుడు కాడా! కాబట్టి సృష్టిలో దేనినీ
చిన్నచూపు చూడకుండా స్థావర జంగాములలో దేనినుడయినా మనము
నేర్చుకొనుటకు వెనుదీయరాదు. అందుకే ఆదిశంకరులు 'చండాలోస్తు సతుద్విజోస్తూ
గురురిత్యేషామనీషా మమ ' అన్నారు.
అసలు ఖరమును గూర్చిన ప్రసక్తి ఋగ్వేదము (3.53.23); ఐతరేయ బ్రాహ్మణము (4.9);
తైత్తరీయ సంహితలలో (5.1.2.1) మనకు కనబడుతుంది. ఖరము ఎంత
పురాతనమైనదో మనకు తెలియవస్తుంది.
सुश्रान्तोऽपि वहेद्भारं शीतोष्णं न च पश्यति
सन्तुष्टश्चरते नित्यं त्रीणि शिक्षेच्च गर्दभात्
- चाणक्य नीति
वजन उठाने और ठीक जगह पर पहून्चाने मे थक नहीं जाता ,गर्मी या ठंडक बिना मन में लिए वहन
करता है, हमेशा तुष्टि से जीवन बितानेवाला - एक गधे से इन तीन गुण हमें सीख्नेको मिलता है।
एक गधे से भी हम सीखने का सबक हैं! एक गधा वजन ले जाने के लिए प्रयोग किया जाता है। यह
बोझ उठाना ही अपना फ़र्ज़ मानता है। लेकिन यह शिकायत करनेकी बात ही नहीं पैदा होती !
यह, धूप हवा, बरसात या धूल भरी वातावरण में भी अपने काम से बिना हटे करलेता है। यह
जानवर,भेदभाव या किसी तरह का प्रतिक्रिया नहीं करते हुए काम में लग जाता है!
सूखी घास या कुछ पत्ते, और रद्दी कागज़ जो कुछ भी उपलब्ध है वही खाके संतुष्ट होता है । अपना
काम खुद करलेनेके बिना किसीसे कोई स्पर्धा नहीं मोललेता है ।
इन 3 लक्षण गधेसे हमें सीखना है । प्रशंसा के लायक लक्षण हम किसी से भी सीख सकते हैं। मेहनती ,
संकटों से निडर और संठुष्टि को सतत अप्नानानेवाला अगर हम अंतर्दृष्टि से देखेंगे तो एक गधे में
मिलते हैं।
भारतवर्ष में इसका प्राचीनतम उल्लेख वैदिक साहित्य में मिलता है (ऋग्वेद 3.53.23;
ऐतरेय ब्राह्मण 4.9; तैत्तिरीय संहिता 5.1.2.1)।
suSraantO pi vahEdbhaaraM SItOShNaM na cha paSyati ।
santuShTaScharatE nityaM trINi SikShEchcha gaardhabhaat ।। - chaaNakya nIti
Carries weight even when tired, doesn't mind hot or cold (weather), wanders in contentment
always - learn these 3 (attitudes) from a donkey.
There are lessons to be learnt even from a donkey! A donkey is used to carry weight. It is even
called as the 'beast of burden'. But it never complains!
Whether it is sunny, windy, rainy or dusty, it carries on with its chores. It doesn't discriminate or react
to its surroundings !
It grazes on dry grass or some leaves, whatever available. Yet, it is content with itself. It is in no rush
to win any rat race smile emoticon. It wanders happily going about his chores.
These 3 traits are worth the praise in any being. Who doesn't want to be content, level and
industrious! When the brighter side is seen, a donkey has insights to give as well .
We can see the oldest reference of a donkey in Rigved 3.53.23; Aitareya Brahman 4.9;
Taittareeya Samhitha 5.1.2.1 ***********************************************
1౩4
అజరామర సూక్తి-59
अजरामर सूक्ति-59
Eternal Quote-59
विप्रयोर्विप्रवह्न्योश्च दम्पत्योः स्वामिभृत्ययोः l
अन्तरेण न गन्तव्यं हलस्य वृषभस्य च- चाणक्य नीति ll
విప్రయోర్విప్రవహ్న్యోశ్చ దంపత్యోః స్వామిభృత్యయోః l
అంతరేణ న గంతవ్యం హలస్య వృషభస్య చ ll- చాణక్య నీతి
ఇద్దరు వేదాంతుల నడుమ; విప్రునికి పవిత్ర అగ్నికి నడుమ; భర్త మరియు భార్య కు
నడుమ ; యజమాని మరియు సేవకునికి నడుమ; ఎద్దుకు నాగలికి నడుమ .ఇంగిత
జ్ఞానం ఉన్నవాడెపుడూ రాడు !
జన్మనా జాయతే శూద్రాః ( పుట్టిన ప్రతియొకడూ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే
(సంస్కారము ద్వారానే ద్విజుడౌతున్నాడు. అంటే యజ్ఞోపవీత ధారణ
నిత్య కర్మానుష్ఠానము చేత బ్రాహ్మణుడౌతున్నాడు. )
వేదపఠనాత్ భవేత్ విప్రః (వేదాల అధ్యయనం ద్వారానే అతడు విప్రుడు
అనిపించుకొంటున్నాడు)
బ్రహ్మ జానాతి బ్రాహ్మణః (బ్రహ్మను తెలుసుకొన్న పిదపనే బ్రాహ్మణుడౌతున్నాడు.)
ఈ వచనములు ఆత్రేయ స్మృతి (ఋగ్వేదం యొక్క 141-142 ఐదవ మండలము
నుండి. )
(వేదాలు తెలిసిన - వేదాంతులు) విప్రులు తమ విబేధాలు కోసం ప్రసిద్ధము! పూర్వము
ఆది శంకరులవారు వారి వాదనలతోనే నాటి పండిత ప్రకాన్డులతో తర్కమున
జయించి సనాతన ధర్మ పునఃప్రతిష్ఠ హేసినారు. వారి జోక్యమే లేకున్దియుంటే జైనము
బౌద్ధము వైదిక ధర్మమును తుడిచిపెట్టియుండేది. అట్టి మహా పండితుల నడుమ
మనము తల దూర్చుట అవివేకము. అసలు శ్రోతలుగా వుంటే ఎన్నో విషయములు
మనము తెలుసుకొన వచ్చును. అట్లుగాక మనము మిడి మిడి జ్ఞానముతో ఏదయినా
మాట్లాడటమో ఒకరి పక్షము తీసుకొనటమో చేస్తే కేవలము మన అజ్ఞానమును
ప్రదర్శించుకొనుట మాత్రమె కాగలదు. మనము అడకత్తెరలో పోక కాగూడదు.
సద్విప్రుడు నిరతాగ్నిహోత్రుడు. హోమగుండమునందు వేసే హవిస్సులు దేవతలకు
వాహకుడై అందించువాడు 'అగ్ని'. మనము ఆ క్రియకు అంతరాయము కలిగించుట
కేవలము ఆపద కొనితెచ్చుకొనుట మాత్రమే! కాబట్టి ఆ పవిత్రకార్యములో మనము
కేవలము ప్రేక్షకులమే!
భార్యాభర్తల నడుమ వాదములేనిదే వద్దికే లేదు. కానీ వాటిని తమలో తామే
పరిష్కరించుకొంటే ఆ పిమ్మట కలిగే అనుభూతే వేరు. ఎవరికీ ఏ పరిస్థితిలోనూవారి
మధ్య తగుదునమ్మా అని పోవుట కొరివితో తల గోకుకొనుట మాత్రమే!
ఒక యజమాని మరియు అతని సేవకుని మధ్య తగాదాలో మధ్య వర్తిగా
మసలదలచుట తప్పు. తన సేవకుని గూర్చి యజమానికి తెలిసినంత వేరెవరికీ
తెలియదు, అదేవిధముగా తన యజమానిని గూర్చి కేవలము సేవకునికి మాత్రమె
తెలుస్తుంది. మరి అటువంటి సమయములో మన ప్రమేయము అవాంఛనీయము.
కావున ఊరకుండుటే ఉత్తమము.
ఒక ఆబోతు పొలములో నాగలి లాగుతుంది. కదిలే నాగలి ఎద్దు యొక్క గతి,
మనస్థితి పై ఆధారపడియుంటుంది. మరి రెంటికి నడుమ నడిస్తే కార్యభంగమే కదా!
కాబట్టి మన సరిహద్దులు మనము తెలుసుకొనకుండా, సరియైన ఆలోచన లేకుండా
ప్రతికూల లేదా అవాంఛిత విషయముల లోనికి అడుగు పెట్టుట కేవలము అవివేకమే !
विप्रयोर्विप्रवह्न्योश्च दम्पत्योः स्वामिभृत्ययोः
अन्तरेण न गन्तव्यं हलस्य वृषभस्य च- चाणक्य नीति
दो धर्मशास्त्रियों; धर्मशास्त्री और पवित्र अग्नि; पति और पत्नी; मालिक और नौकर; हल और
बैलके बीच में कभी भी नहीं जाना है।
जन्मनः जयते शूद्राः (हर एक जन्म से शूद्र है)
संस्कारात द्विज उच्यते (संस्कारों से ही वह द्विज बनता है)
वेद पठणात्भवेद्विप्रः (वेद का अध्ययन करके ही वह विप्र )
ब्रह्मा जानाठी ब्राह्मणः (ब्रह्मत्व जो जानता है वही ब्राह्मण है )
इस श्लोक अत्रेयास्मृति (ऋग्वेद के 141-142 पांचवीं मंडला से है।)
(वेद जो जानते है वे धर्मशास्त्रि कहलाते हैं।) वे अपने असहमति के लिए लोकप्रिय हैं! वे जल्दी से
बहस में पड़ते हैं और उन दोनों के बीच होना या किसी एक का पक्ष लेना सुरक्षित नहीं माना
जाताहै क्यूँ की हम में उतना ज्ञान नहीं है।
विप्र अनुदिन 'होम' करते हैं। जो भी 'हविस' के रूप में देवताओं को अग्नि के द्वारा उस विप्र से
भेजा जाता है , उस प्रक्रिया बीच में कोई भी आना केवल एक रुकावट है! इसी लिए कोई भी
बीच में नहीं जाना चाहिए ।
एक पति और पत्नी के बीच, कोई एक तर्क उत्पन्न होती है। लेकिन वे खुद, उन्हें व्यवस्थित करने
के लिए सबसे अच्छा है। किसी और बाहरी व्यक्ति उन दोनों के बीच में कभी भी नहीं जाना है।
किसी भी परिस्थिति में, पति और पत्नी आपस में ही समझौता करलेना है और बीच में हम नहीं
जाना चाहिए क्यों की वे तो किसी भी तरह
एक होजाते हैं और हम पराये बनजाते हैं।
एक स्वामी और उसके नौकर के बीच अगर कोई आता है तो वह समझदार नहीं है। वे दोनों ,
एक के बारे में दूसरा अच्छा जानता है। बीच में हम हस्तक्षेप करके किसी का पक्ष लेतें है तो
दुसरे को बहुत अन्याय करना है।
एक बैल खेतों में हल खींचती है। चलती हल की गति को बैल की दया पर निर्भर होता है, बैल के
बीच चलने के लिए और हल की प्रक्रिया बिगाड़ना तो सिर्फ मूर्ख ही करता है।
उसीलिये हम अपने अपने सीमाओं पतारख के समझदारी से रहना चाहिए । बिना
आवश्यकता हस्तक्षेप किसी काम करना अक्लमंद का काम नहीं है ।
viprayorvipravahnyoshcha dampatyoH svaamibhRutyayoH l
antareNa na gantavyaM halasya vRuShabhasya cha ll - chaaNakya nIti
Never go between - two theologians; theologian and the sacred fire;
husband and wife; master and servant; plough and the bull.
Common sense! None of these scenarios have any scarcity for screaming
danger.
Janmana jayate shudrah(One is a Shudra by birth)
Samskarad dvija ucyate(By observing Sanskara one becomes a Dvija)
Vedapathi bhaved viprah(By studying the Vedas one becomes a Vipra)
Brahma janati brahmanah(One who knows Brahman is a Brahmana)
These verses are from Athreya Smrithi (141-142 Fifth Mandala of Rig Veda).
Vipras (One who knows Vedas - Theologians) are popular for their
disagreements! Each will have his own set of opinions and they quickly get
into arguments. Being between them or being forced to take the side of one
or the other, is not a safe place to be in.
A Vipra worships the fire. Many types of sacrifices are offered to the fire
which ultimately go to the Devas in the form of 'Havis' Being in the way is
only an interruption to the process and invitation for trouble!
Between a husband and wife, many an arguments arise. But they
themselves, are the best people to settle them. Anyone else, will prove to be
an outsider. It is best not to get between a husband and wife, under any
circumstance.
Coming between a master and his servant isn't sensible either. The orders
of the master are better when received by the subordinate himself and the
mind of the subordinate is best known to the master. Intervening in
between is nothing but to spoil the relationship.
A bull pulls the plough in the fields. When the pace of the moving plough is
at the mercy of the bull, to walk between the bull and the plough is
nothing but spoiling the process.
Know thy boundaries. Do not step into unfavorable or unwanted territories
or situations without sensible thinking!
***************************************************
అజరామర సూక్తి-60
अजरामर सूक्ति-60
Eternal Quote-60
पक्षीणां काकश्चाण्डालः पशूनाञ्चैव कुक्कुरः l
मुनीनां कोपी चाण्डालः सर्वेषां चैव निन्दकः ll - चाणक्य नीति
పక్షీణాం కాకశ్చాణ్డాలః పశూనాఞ్చైవ కుక్కురః l
మునీనాం కొపీ చాణ్డాలః సర్వెషాం చైవ నిందకః ll- చాణక్య నీతి
పక్షులలో కాకి హీనమైనదిగా పరిగణించుతారు. జంతువులలో కుక్కను
హీనమైనదిగా భావించుతారు. అందుకే 'కుక్క చావు', 'కుక్క కన్నా హీనంగా'
అన్న పలుకుబడులు వ్యాప్తిలోనికి వచ్చినాయి; సన్యాసులలో కోపిష్టి నికృష్ఠుడు;
కానీ తన స్వార్థము కొరకు ఇతరులపై నింద మోపేవాడు అధమాధముడు,
నీచాతినీచుడు, హీనాతిహీనుడు .
కాకి ఏదైనా ఆ మాటకొస్తే ప్రతిదీ తింటుంది. ఇది అందుకే పక్షుల జాతిలో
హీనమైనదని యంటారు. కుక్క ను పవిత్రమైన జంతువుగా పరిగణించరు. అసలు
తిథులయందు పిండములు కుక్క ముడితే తిరిగీ శ్రాద్ధకర్మనే చేయవలసి వస్తుంది.
వాస్తవానికి కుక్కలను, పిల్లులను ఇండ్లలో పెంచుకొనుట శాస్త్రసమ్మతము కాదు.
ప్రశాంతత సన్యాసికి ప్రథమ లక్షణము. తన రక్ష యగు శాంతము కొరకు తాను
దేనినైనా వదిలివేయవలసియుంటుంది. ఆ వదల వలసిన వానిలో అతి
ముఖ్యమైనది కోపము. తన కోపము తన శత్రువు తనశాంతమె తనకు రక్ష అన్న
ఆర్యోక్తి మనకు తెలిసినదే కదా ! ‘క్రోధో వైశ్వానరో దేవో’ అంటుంది నీతి శాస్త్రము.
'జంతునాం నరజన్మ దుర్లభం ' అన్న ఆర్యోక్తి మనకు తెలిసినదే. తెలిసి తెలిసి
అరిషడ్వర్గములను ఆప్త మిత్రులుగా వలచినవానికి అధః పాతాళమే గతి. అసలు ఆ
వ్యక్తి సంయాసియగుతకే అనర్హుడు. "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అని
ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ
సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే. ఏదైనా సాధించాలంటే సాధనం
బాగుండాలి. ఈ సాధనకు శాంతమే శరణము.
తుప్పు కట్టిన కత్తితో యుద్ధం చేయలేడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాడు
సాధనమైన కత్తికి పదును పెట్టుకోవాలి. ప్రయాణానికి సాధనం వాహనం.
ప్రయాణం చేయదల్చుకొన్నవాడు వాహనాన్ని బాగుచేసుకొనాలి. అలాగే
ధర్మకార్యం చేయాలన్నా ముక్తిని పొందాలన్నా సాధనమైన శరీరాన్ని
అనుకూలంగా సిద్ధం చేసికొనాలి. ఆ లక్ష్యంతో మనకు మహర్షులు అందించిన
మార్గమే సదాచారం. మరి అటువంటపుడు తన స్వార్థము కొరకు ఇతరులపై
అభియోగములు మోపువానికన్నా హీనుడు లోకములో కనబడుతాడా! అందుకే
పెద్దలేపుడూ ఆచారాలను గూర్చి కట్టుబాట్లను గూర్చి ఎన్నో ఉదాహరణలు
చెప్పినారు. వారు చెప్పిన ఈ మాట వినండి.
ఆచారాల్లభతేహ్యాయుః అచారాదీప్సితా ప్రజాః
అచారాద్ధనమక్షయ్యం ఆచారోహంత్యలక్షణం
ఎంత మంచి మాట చూడండి. సదాచారమువల్ల ఆయుస్సు,అభీష్ట సిద్ధి, అనంత
సంపద, అవలక్షణముల హరించుట అన్న ఇన్ని విధములైన మంచి జరుగుతుంది.
మనము బ్రతుకుటేగాదు కావలసినది, మన సమాజమును బ్రతికించడము.
సమాజము అంటే సాటి మనుషులే కదా! కాబట్టి మన బాగుకు ఇతరులపై అబద్ధపు
అభియోగములను మోపరాదు. కలికాలములో ఒక చేతితో చేస్తే వేరొక చేతితో
అనుభవించవలసినదే! పరుడు అంటే ఇతరుడు అనికాదు అర్థము పరుడు అంటే
పరమాత్ముడని. కాబట్టి పరులలో పరమాత్ముని చూస్తే ప్రకృతి పులకిస్తుంది
ప్రపంచము పరవశిస్తుంది.
पक्षीणां काकश्चाण्डालः पशूनाञ्चैव कुक्कुरः
मुनीनां कोपी चाण्डालः सर्वेषां चैव निन्दकः- चाणक्य नीति
पक्षियों के बीच, एक कौवा अधम है; जानवरों के बीच एक कुत्ता नीचे है; संन्यासियों में एक आग्रही
परित्यक्त है; हर किसी के बीच में, एक अभियोक्ता निर्वासित है।
कौवा सब कुछ खाती है। यह इसलिए पक्षियों में अधम कहा जाता है। एक कुत्ता शुभ नहीं माना जाता
और कुत्तों को पाल्नेसे कुछ श्वास सम्बंधित बीमारियाँ आनेका भी संभावना है । । शांति एक तपस्वी की
सबसे बडी विशेषता है। अपने शांत बरकरार रखने के लिए , नाराजगी कभी नहीं अपनाना है । मनुष्यों
में ,दूसरों पर आरोप जो लगाता है वह सबसे बुरा है। उससे ज्यादा नीच कोई भी नहीं रहता है। उनका
एकमात्र लक्ष्य के लिए अन्य व्यक्ति को दोषी ठहराना हीनातिहीन होता है। एक दिल में दूसरे व्यक्ति
के हित के लिए बिना कोई जगह रखतेहुए आरोप लगाते हैं। वैसे दुर्जन से कोई भी हीन नहीं होसकता।
सबके और सब कुछ में एकता को देखकर है, जो अनन्त लक्ष्य है, के लिए सहायक नहीं है।
दूसरों के सम्मान रखे । अपनापन भायीचाराको अलग करतेहुए अन्य जन के ऊपर आरोप लगाते हुए
जीना भी क्या जीना है!
pakShINaaM kaakaSchaaNDaala@h paSUnaa~nchaiva kukkura@h l
munInaaM kopI chaaNDaala@h sarveShaaM chaiva nindaka@h ll -
chaaNakya nIti
Amongst birds, a crow is basal; among animals a dog is bottom; in ascetics an
angry one is a derelict; amongst everyone, an accuser is an outcast.
Crow eats anything and everything. It is hence called the basal of birds. A dog
is not considered auspicious and is hence least preferred amongst animals.
Calmness is one of the foremost characteristic of an ascetic. One that cannot
keep his cool and gets angry, would be the most derelict of ascetics.
Amongst all kinds of beings, one who accuses, is the worst of all. There is no
one lower than him, says the poet. An accuser has no good feelings toward
the accused. His sole goal is to put the other person down. When one doesn't
have the interest of the other person at heart that is when he accuses. This is
not supportive to the eternal goal, which is, seeing oneness in everyone and
everything.
Be mindful of others. Accusing can never be the way of communication!
స్వస్తి.
********************************************************************************************************************
Comments
Post a Comment