విద్యా వ్యవస్థ నాడు నేడు

 

విద్యా వ్యవస్థ నాడు నేడు
https://ajaraamarasukthi.blogspot.com/2025/07/blog-post.html

నేటి విద్యావ్యవస్థను గూర్చి తెలుసుకొనుటకు ముందు ఒకానొకనాడు ఈ దేశములోని విద్యావ్యవస్థ ఏవిధముగా వుండినది అన్నది గమనించుట ఎంతో అవసరము. అందుకుగానూ కాళీదాసు రచించిన ‘రఘువంశము’ నుండి ఈ ఈ శ్లోకమును ఉటంకించున్నాను. మరి రఘువంశమే ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు. ‘ఉపమా కాళిదాసస్య’ అన్న నానుడి ఉండనే వుంది. రఘువంశము సూర్యవంశజులుసూర్య అంశజులు అయిన రఘువు మరియు ఆతని తండ్రి దిలీపుని గూర్చి ఎంతో సవిస్తారముగా తెలియజేస్తాడు మహాకవి. అటువంటి మహనీయుల చరితము వ్రాసే కావ్యములో తప్పక తన రాజు విక్రమార్కుని దేశకాల పరిస్థితులను కూడా దిలీపుని కాలమునకు అన్వయించి తెలుపుట అతిశయోక్తి కాదు. ఆ శ్లోకమును చూడండి.
ఆకార సదృశః ప్రజ్ఞా ప్రజ్ఞయా సద్రుశాగమః    l
ఆగమైః సదృశారంభః ఆరంభస్సదృశోదయః ll
దిలీపుని కాలములో ఆకారమునకు తగిన తెలివితేటలుతెలివితేటలకు తగిన విద్యవిద్యకు తగిన ఉద్యోగమూఉద్యోగమునకు తగిన ఫలితముఇవి తగిన విధముగా వంక పెట్టుటకు వీలులేనంత పొంకముగా ఉండేవి. అంటే అర్థము చేసుకోండిఒకనాటి మన విద్యావ్యవస్థ ఏవిధముగా ఉండేదో! మరి ఇంతటి మహార్దశకు కారణము ఏమిటి అన్నది మనము ఈ శ్లోకము ద్వారా తెలుసుకొనవచ్చును.
మాతా శత్రుః పితా వైరీ ఏన బాలో నపాఠితః l
న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకోయథాll
తల్లితండ్రి తమ పిల్లలకు తమ విద్యుక్త ధర్మముగా నెంచి తగిన విద్య నేర్పకపోతే ఆ శిశువు భవితకు వారే శత్రువులు. అట్టి మూర్ఖులు సభలో కూర్చున్నా హంసలనడుమ కూర్చున్న కొంగలాగా అవమానితుదౌతాడు. అందువల్ల ఎవరి బాధ్యత వారు నాడు విస్మరించక నిర్వర్తించేవారు. తల్లిదండ్రుల తరువాత గురువు యొక్క పాత్ర రంగములోనికి వచ్చేది. నేడు గురువులు లేరు. కేవలము శిక్షకులే వుండేది. ఈ శిక్షకులకు తాము చదివిన చదువులో తగిన విజ్ఞానముసంస్కృతిపై అవగాహనపిల్లల మనస్తత్వమును గూర్చిన పరిశోధన ఏమీ ఉండదు. ‘ఆడవాళ్ళ పెళ్ళో మగవాళ్ళ పెళ్ళో గాటి కాడ ఇంతేస్తే గతికొచ్చినాము’అన్నట్లు ఉంటుంది వారి బోధన. వారికి Fee ముఖ్యమువిద్యార్థి వికాసము కాదు. గురువునకు శిష్యుని మనోవికాసము ముఖ్యము. విద్యతో బాటు తన శిష్యుని ప్రయోజకుని జేసే బాధ్యత వుంటుంది. కానీ నేటికాలములో కూడా కొందరుఅందునా ప్రభుత్వోన్నత పాఠశాలలలోనామీద గురుత్వము కలిగిన రమేష్మహేష్ దంపతులు అనగా నలుగురూ విద్యార్థుల సర్వ విదొంనతికై పాటు పాడుచున్నారు. మరి నా ఎరుకలో లేనివారాలలో కూడా ఈ విధమైన బాధ్యతాయుత ఉపాధ్యాయులు ఉండవచ్చును. నాడు మహా మహా చక్రవర్తులు కూడా గురువు వద్దకు వస్తే తమ కిరీటము పాదరక్షలు ఆశ్రమము బయటవదిలి అణుకువను అందిపుచ్చుకొని అడుగు లోనికి వెయ్యవలసిందే! శ్రీరాముడుబలరామ కృష్ణులు గురువుల ఆశ్రమములకుపోయి చదువుకొన్న వారే! వారి తండ్రులు Home Tuitions పెట్టించలేదు. అది గురువుయొక్క స్థానము.

కళలుసంస్కృతివిద్య ఈ మూడూ నిర్వహణ కోరుకొంటాయినియంత్రణ కాదు. నిర్వహణ నియంత్రణల మధ్య సురాసుర తారతమ్యమును గమనింపవచ్చును. నిర్వహణ తల్లివలె లాలించి బుజ్జగించిలోతుపాతులను తలూపుతూ ముందుకు సాగుతుంది. ఒకవేళ తానూ చెప్పుటలో తప్పులున్నా సరిదిద్దుకొంతుంది. కానీ నియంత్రణ అట్లు కాదు. అంతా కర్ర పెత్తనమే! తాను పలికింది వేదము తాను కులికింది నాట్యము. ఇందులో తప్పులు మాత్రమే వుంటే పరవాలేదుస్వార్థము ఉంటే ఆ కళలుసంస్కృతివిద్య అంతా నాశనమే! అందుకే విద్యా ప్రణాలికను ఒక విద్వద్వరేణ్య సంఘమును (connoisseurs of the faculty) ఏర్పాటుచేసి వారి కార్యాచరణను సూత్రబద్ధము చేయగల ఒక విజ్ఞుడైన అధికారి ఉంటే (Executive) అప్పుడు సక్రమమగు  నిర్వహణకు ఆస్కారముంటుంది. భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టుటకు నాడు చెన్నై లో శ్రీమతి రుక్మిణి అరండేల్ కళాక్షేత్రను ఏర్పాటు చేస్తే నేడు దానిని లీల శాంసన్ అన్న వ్యక్తి ఎంత నిస్తేజము చేసిందో గమనించండి.
 లీలా శాంసన్ సోనియా గాంధీ గారి అంతేవాసి మరియు ప్రియాంకా గారి పెళ్లి కాక మునుపుప్రియాంక వాద్రా గారి నాట్యాచారిణి. వారి అండదండలతో 2005 లో కళాక్షేత్ర అధ్యక్షురాలయిన తరువాత మన భరత నాట్యమునే క్రీస్తు నాట్యముగా మార్చిన వ్యక్తి. అవినీతి ఆరోపణలు,  అక్రమ నియామకాలు మరియు విచక్షణారహిత ఒప్పందాలుఏకపక్ష అవార్డులు,ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలతో కళాక్షేత్రసంగీత నాటక అకాడమీ మరియు సెన్సార్ బోర్డ్ లలో శామ్సన్  ఎన్నో అభియోగములను ఎదుర్కొన్నది. PK అన్న వివాదాస్పద మరియు హిందూమతమును కించపరచే చిత్రమునకు ఎటువంటి కత్తెరింపులు లేకుండా Clean Certificate ఇచ్చినది ఆమెయే! ఆమె చేసిన దారుణములకుఆమె ఆయా పదవులకు రాజీనామా ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడినది.

2006 లోఆమె భరత నాట్యము యొక్క ఆధ్యాత్మిక మూలాల తొలగింపును సమర్థించడం ద్వారా ప్రసార మాధ్యమాలను రెచ్చగొట్టింది.  శ్రీ శ్రీ రవి శంకర్ గారు దీనిని ఖండించడముతో ఆమె చేసిన సనాతన ధర్మ విరుద్ధమార్గములు దేశానికి తెలిసినాయి. ఈమె మన కళాసంస్కృతులకు చేసిన అన్యాయములను ఏకరువు పెట్టుట నా ఉద్దేశ్యము కాదు. ఇటువంటి నిరంకుశులకు మన కళలుసంస్కృతివిద్య లు ఆలవాలములైతే  మన భవితకు అంటే పిల్లలకు మనమందివ్వగలిగినది ఏమీ ఉండదు.
మిగిలినది మరొకసారి......

విద్యా వ్యవస్థ నాడు నేడు - 2

నాడు గర్గి మైత్రేయి మొదలగు వేదపండితులు, భర్తలకే సమయోచిత సలహాలనోసగిన, 

సీత, తార, ద్రౌపది మొదలైన విదుషీమణులు, ఆధునిక యుగమందున ఝాన్సీ లక్ష్మి, 

నీచముగా మీనా బజారులో ప్రవర్తించ బోయిన అక్బరును పడవేసి కంఠముపై కత్తి 

నిలిపిన రాజపుత్ర యువరాణి కిరణ్ దేవి, రాణీ రుద్రమ దేవి వంటి వీర వనితలు, 

తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల ముద్దుఫళని, రంగాజమ్మ  వంటి విదుషీమణులు, MS 

సుబ్బలక్ష్మి, DK పట్టమ్మాళ్, వసంత కోకిలం, ML వసంత కుమారి వంటి సంగీత విద్వన్ 

మణులు కలిగిన ఈ దేశములో స్త్రీ స్వాతంత్ర్యము లేదా, స్త్రీలు విద్యావంతులు కాదా! ఒక 

నాటి సినిమాలలో లలిత పద్మిని రాగిణి అన్న తిరువాన్కూర్ సిస్టర్స్, వైజయంతి మాల, 

కమలా లక్ష్మణ్, మొదలగువారంతా శాస్త్రీయ నృత్యములో నిష్ణాతులు. మరి మన స్త్రీలను 

ఉద్ధరిస్తున్నట్లు కుహనా సంస్కరణ వాదుల ప్రేలాపనలు నిజముగా అర్థవంతమైనవేనా! 

మధ్య తరగతి కుటుంబీకులలో కూడా ఎందఱో అమ్మ గారు, అవ్వ గారు B.A, M.A. లు 

చదువక పోయినా ఎన్నో నీతికథలు, నియమ నిబంధనలు పిల్లలకు నేర్పించేవారు. 

నేడవి కనుమరుగై పోయినాయి.

విద్యా శిక్షణ నాడు: చదువుకు వర్ణ విచక్షణ లేదు. స్త్రీ పురుష భేదము గురుకులములలో 

లేదు. విద్యతో బాటు ఋజు ప్రవర్తన, కుటుంబ వ్యవస్థకు సంబంధించిన కట్టుబాట్లు 

బాధ్యత, సహనము సొశీల్యము, తమ తమ వృత్తులకు సంబంధించిన మెళకువలు నేర్పే 

వారు. విద్యలో  గణితము అందరూ నేర్చుకోనవాల్సిందే! ఖగోళము,  గ్రహ చారము, 

నక్షత్ర గమనము, జంతు వృక్ష భౌతిక శాస్త్రములు వారి వారి పరిమితులకు 

అనుగుణముగా నేర్పించేవారు. విద్యార్థుల మధ్య సహవాసమునకు వర్ణములు ఏనాడూ 

ఆటంకములు కాలేదు. బలరామ కృష్ణ సుధాముల మైత్రియే ఇందుకు తార్కాణము. ఇక 

పరిక్షలు, 

పిండి రుబ్బినట్లు విషయమును కంఠస్తము చేసి కాగితములపై కక్కే విధానము 

నాడు లేదు. ఆయా విభాగములకు సంబంధించిన ముఖ్య విషయములను చీటీలవంటి  

కాగితములలో వ్రాసి చుట్ట చుట్టి ఘటిక (చిన్న మట్టి పాత్ర) లో ఉంచి ఆయా 

విద్యార్థులను అందునుండి ఒక చుట్ట తీసి అందు తెలిపిన విషయమును గూర్చి 

వివరణాత్మకముగా అడిగేవారు. అన్ని విభాగాములకు అదే పద్ధతి.

ఇంకొక అతి ముఖ్యమైన విషయము ఏమిటంటే ఈ గురుకులాలలో 300 మొదలుకొని 30,000 వేళా 

మంది విద్యార్థులు కూడా వుండేవారట. వెంటనే మనకు గుర్తుకొచ్చేది 

Section కు 20 మంది ఉండే Class Room. ఆవెంటనే మనము అనబోయేది ఇదంతా 

Trash అని.

కానీ నాడు ఇంత మందిని ఏవిధముగా నియంత్రించి చదువు చెప్పేవారో 

తెలుసుకోన్నారంటే మీరు నిర్ఘాంతపోక తప్పదు. 30 వేల విద్యార్థులున్న 

గురుకులములో 100 విభాగాలున్నాయనుకొందాము. అప్పుడు తరగతికి 300 మంది 

అవుతారు. ఆకాలములో రాజులు, ప్రముఖులైన ధనవంతులు ఎంతో వితరణతో 

భూదానము చేసేవారు ఆ విధముగా ఆ గురుకులమునకు ఒక 100 ఎకరముల స్థలము 

ఉండినదని అనుకొందాము. దానిని చాయా ఫల పుష్పములొసగు  మనోహర వనముగా 

తీర్చిదిద్దుట, అచ్చటి అధ్యాపక ఆచార్య గురు బృందముల పర్యవేక్షణలో, విద్యార్థుల  పని. 

కాబట్టి ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణములో విద్యార్థులు చదివేవారో గమనించండి. 

అసలు ఆచార్యుడు అధ్యాపకుడు గురువు అన్న మాటలకు వ్యుత్పత్తి అర్థములను ఒకసారి 

చూద్దాము.

నిరుక్తమునకు భాష్యకారుడగు యాస్కాచార్యులవారు 'ఆచార్య' అన్న పదమునకు అర్థమును ఈ 

విధముగా తెలియజేసినారు.

1. ఆచరతి ఇతి ఆచార్యః అంటే తసను ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు.

2. ఆచారం గ్రాహయతి ఇతి ఆచార్యః అంటే ఆచరించ వలసిన విధివిధానమును 

ఆచరింపజేయించేవాడు.

3. అచినోతి అర్ధాన్ ఇతి ఆచార్యః అంటే నిరంతరమూ తన శిష్యులకు తగు విషయ 

వివరములను సేకరించి     వారికి అందించేవాడు.

ఇక అధ్యాపకుడు అన్న మాటకు అర్థమేమిటో చూద్దాము. 'ఆపక' అన్న మాటకు అర్థము 

తీసుకు పోవువాడు అని. 'అధి' అంటే విశిష్ఠ స్థానము అని అర్థము. కావున అధ్యాపకుడు 

అంటే తన శిష్యులను ఒక విశిష్ఠ స్థానమునకు తీసుకుపోవువాడు అని అర్థము. అంటే 

నిర్ధారిత లక్ష్యమునకు తన చాత్రులను చేర్చువాడు అని అర్థము. ఆంగ్ల పదములలో 

ఇటువంటి వ్యుత్పత్తులకు తావు లేదు.

ఇక గురువు అన్న శబ్దమునకు అర్థమును ఒకసారి విశ్లేషించుకొందాము. గురుత్వము 

అన్నమాటకు సాంద్రత (Gravity) అన్న ఒక అర్థము వున్నది. సులభమయిన ఉదాహరణ 

ఏమిటంటే ఒక బియ్యపుగింజ సాంద్రత ఎక్కువగా కలిగి ఉంటుంది కానీ దానినుండి 

తయారయిన పేలము  చాలా తేలికగా ఉంటుంది. అంటే బియ్యపుగింజ లోని అణువులు 

ఎంతో దగ్గరగా చిక్కగా వుంటాయి అదే పెలము లో చాలా వదులుగా అవి ఉంటాయి. 

కావున గురువు అంటే అనేక విషయములను తనయందు కలిగిన ఒక సముద్రము 

వంటివాడు. విద్యార్థికి కలుగు ఏవిధమగు కష్టమును కూడా ఆతడు తీర్చే బాధ్యతను 

తీసుకొంటాడు. అందువల్ల ఆతను అసలు విద్యార్థికి గరిమనాభి(Centre of Gravity) 

అవుతాడు. శాస్త్రము గురువును ఈ క్రింది విధముగా నిర్వచించుతూ వున్నది.

గుకారస్త్వంధకారస్యాత్ రుకారస్తన్నిరోధకః


అంధకార వినాశిత్యాత్ గురురిత్య భిదీయతే


‘గు’ అనగా అంధకారము, ‘ఋ’ అనగా దానిని నిలువరించేది అంటే ప్రకాశము. అంటే 

అజ్ఞానమును తొలగించి జ్ఞానభిక్ష నొసగేవాడు గురువు. ఆయనకు పాఠ్యాంశములతో 

నిమిత్తము లేదు. శిష్యునికి చేయూతనిచ్చుటకు ఎల్లవేళలా సిద్ధముగా ఉంటాడు. ఇంత 

అంతరార్థము కలిగిన ‘గురు’ శబ్దమునకు సమాన శబ్దమును మనము ఆంగ్లములో 

చూడగలమా!పై మువ్వురికీ పురోదృష్టి పూర్వదృష్టి , అంతర్ దృష్టి (fore sight, far sight, in sight) 

నేటి Teachers లో కేవలము sight మాత్రము ఉంటుంది. వీరు చాత్రునియోక్క తాత్కాలిక 

దీర్ఘకాలిక ప్రయోజనముల గూర్చి యోచించుటయేగాక వానిని సాధించుటకు  తగిన 

వనరులపై తమ అంతః దృష్టినుంచుతారు.

ఇక తిరిగీ అసలు విషయమునకొస్తే ఆ 300 మంది విద్యార్థులున్న తరగతిలో  ఒక 15 

మంది చురుకైన విద్యార్థులను ఎంచుకొనేవారు. వారి స్తోమతను బట్టి 1 నుండి 15 

వరకు ఒక అనుక్రమణికను ఏర్పరచుకొనేవారు. అదేవిధముగా ఆ మిమిగిలిన 285 

మందిని చదువులో వారి స్థాయిని బట్టి 15 విభాగాలు చేసేవారు. అప్పుడు ఒక్కొక్క 

విభాగానికి 19 విద్యార్థులు వుంటారు. అంటే ఈ కాలములో లక్షలు కట్టి చదివించే 


Corporate Schools లాగానే! అత్యంత ప్రతిభాశాలి అయిన విద్యార్థికి విలోమము 

(Inverse) గా, చదువులో  పూర్తి  వెనుకబడిన గుంపును (సమూహమును) 

ఒప్పజేప్పేవారు. అప్పుడు 15 వ వ్యక్తి మరియు ఆ 15 వ సమూహము మధ్యన 

ఆంతర్యము తక్కువగా వుంటుంది. అంటే మొదటివాడు తన సమూహమునకు అధ్యాపకుదౌతాడు 15వ వాడు తన గుంపునకు విమర్శకుడౌతాడు. వారు ఎక్కువగా 

చర్చలలో పాల్గొంటారు. వారి నాయకునికి కూడా సందిగ్ధత ఏర్పడితే తమ అధ్యాపకులు 

లేక ఆచార్యులవద్ద నివృత్తి చేసుకొంటారు. ఇంత సుగమమైన విధానము నేటి 

విద్యావిధానములో  చూడగలమా!

మిగిలినది వేరొకసారి ........

Comments

Popular posts from this blog

కాశికా విశ్వేశ్వర లింగము

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి