సమస్య మనది -- సలహా గీతది
సమస్య మనది -- సలహా గీతది -- 1
https://ajaraamarasukthi.blogspot.com/2025/07/1.html
భగవద్గీత, బైబిలు ఖురాన్ ల వంటిది కాదు. అది
జీవితపు చీకటిలో కరదీపిక. ఇహపరాల విజ్ఞాన వేదిక. భగవద్గీత ఒక సూపర్ మార్కెట్
లాంటిది. ఇక్కడ customer అన్నవాడు
ముముక్షువు. ఎన్నో ఊహలు ఎన్నెన్నో సందేహాలు. అన్నింటికీ సమాధానాలు
కావాలి. మరి ఒక్కొక్క సమాధానానికి ఒక్కొక్క చోటికి పోలేడు. మరి అన్నీ ఒకే చోట
దొరికే అవకాశముంటే ఆ ఒక్క చోటే చాలు. మరి అంతకంటే ఆ కష్టమరుకు అంటే ఆ ముముక్షువుకు
వేరేమి కావలసి వుంటుంది. పరమునందుకొను మార్గములు పలు తెరగులని చెబుతున్న గీత ఇహ
సాధనమునకు గూడా ఎన్నో మార్గములను సూచిస్తూవుంది. అందుకే దీనిని లక్ష్య
గ్రంధమనికూడా అనవచ్చును. ఇందులోని శ్లోకసారమును మనము ఎంతో సులభముగా మన జీవిత, కార్యాలయ, ఔద్యోగిక మరియు ఆంతరంగిక విషయములకు
మాత్రమే గాక సునిశిత
పరిశీలనము
ద్వారా ప్రతి జీవిత సమస్యకును తగిన సమాధానమును సమకూర్చుకొనవచ్చును. భగవద్గీతలోని
జ్ఞానము అపార పారావారము. దేవుడు ఒకడే అయినా ఏ పేరును స్మరిస్తూ తరింపదలుస్తామో ఆ
రూపముననే ప్రత్యక్షమయినట్లు భగద్గీత ఒకటే అయినా మనము తలపోయు సమస్యకు తాను సమాధాన
రూపములో మనకు దర్శనమిస్తుంది. ఇక మనము ఈ క్రింది సమస్యతో మన సందేహములను
ప్రారంభించుదాము.
సమస్య:
నేనేమో
సర్వ సన్నద్ధమైనాను. చివరి నిముసములో అది నిరుత్సాహామో, భయమో, నిర్లక్ష్యమో, నన్నావరించింది. పని జరుగుతుందన్న
నమ్మకము సన్నగిల్లింది. నాకు ఏమీ తోచుట లేదు.
సలహా
:
నిన్ను
నీవు తక్కువ చేసుకోవద్దు. ఆత్మస్థైర్యము అన్నది ఆచరణకు ఆభూషణము. పిరికితనము
కట్టిపెట్టి ధైర్యము చేపట్టు.
నీ
కార్య సాఫల్యమునకు అదే ఉడుము పట్టు. ఇక్కడ ఉడుము ను గూర్చి రెండు మాటలు చెబుతాను.
పూర్వము పెద్ద పెద్ద బురుజులుగల కోట పైకి శత్రు సైనికులు .చేరాలంటే బలమైన మోకుకు
(అంటే పురి గల చేంతాడు లాటిది.) ఈ ఉడుములు చాలా తెలివి గలవి. వీటికి పొడ వైన మెడ, శక్తివంతమైన తోక, అవయవాలు ఉండి కాళ్ళు నాలుగూ చాలా
బలిష్టంగా ఉంటాయి. 'ఉడుము
అనగానే చరిత్ర తెలిసిన చాలామందికి శివాజీ గుర్తుకు వస్తాడు. ఛత్రపతి శివాజీ ఈ
ఉడుముల్ని ప్రత్యేకంగా పెంచేవాడు. వీటి నడుముకు పెద్ద వెూకులు తాళ్ళు కట్టి, మూతికి బెల్లం పాకం రాసి శత్రువుల
కోటగోడల వద్ద పైకెక్కింపజేసే వాడు. అవి పూర్తిగా పైదాకా ఎక్కిన తరువాత ఆ తాడు
కొద్దిగా లాగితే ఆ ఉడుము గోడ చివరి భాగాన్ని గట్టిగా పట్టుకునేది. ఎంత గట్టిగా
పట్టుకునేది అంటే ఆ మోకు ఆధారంగా సైనికులంతా కోట గోడలెక్కి కోటలోనికి
చేరుకోనేవారు. ఇంతమంది ఆ ఉదుమునకు కట్టిన మోకు సహాయముతో ఎక్కినా ఉడుము మాత్రము
చలించేదికాదు. అందుకే 'ఉడుము పట్టు' అన్న సామెత
జనబాహుళ్యములో ప్రబలమై ఉన్నది . 'భయముంటే జయముండదు'. అందుకే 'పట్టు విడకు నేరే సాధన ఫలియించును
శుభకామన' అన్న మాటను కలకాలమూ
గుర్తుంచుకొనవలసియుంటుంది. 'ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై' అన్నది భర్తృహరి సుభాషితము. 'అలసత్వమును గూర్చి ఒక్క మాట చెబుతాను. 'అలసత్వము' అన్నది ఒకటే పదమైనా అందులో మనము 'అల' సత్వము' అన్న రెండు పదాలుగా మన అవసరము కొరకు
విడగొట్టుకొనవచ్చును. 'అల' మనస్తిమితమును దూరము చేసి
ఆలోచనకు తావివ్వక అనర్తమును సృష్టిస్తుంది. అదే 'సత్వము' అన్నది ఉత్తమోత్తమ గుణము. 'సత్వము' గలిగినవాడే మనస్సును నిగ్రహించి
తనదారికి మరలించాగాలుగుతాడు. గలవాడు సాధించలేనిది లేదు. కొంగ తానూ నిర్ణయించుకొన్న
మార్గమునకు కట్టుబడి సరసులో కొంగజపము చేస్తూ నిలబడి చిన్న చేపలను తాకకుండా, ఏ పరిస్థితిలోనూ నిరుత్సాహపడకుండా, ఉండుటచే పెద్ద చేపలకు భ్రమ కలిగించి తన
పబ్బము గడుపుకొనుచున్నది. మనకు కావలసినది కూడా ఆ పట్టుదలే!
ఇక
భయమును గూర్చి. బాల్యములో వీధి కుక్కలు వెంటబడితే కరుస్తాయేమోనన్న భయం తో
పరుగెత్తే వాళ్లము. అప్పుడు , ఇల్లు చేరిన పిదప మా అమ్మమ్మ చెప్పేది " నీవు పరిగెత్తటం వల్ల అవి
నిన్ను వెంబడిస్తున్నాయి నీవు స్థిమితపడి నెమ్మదిగా నడువు ,అవి నీ జోలికి రావు. ఆమాటే నా జీవితపు
రాచబాట అయ్యింది. ఈ వాస్తతవము, పరీక్ష కొరకై నిరీక్షించే విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఒలుపు వైనముగా
నిలుపు నిదానముతో ఏపనిచేసినా అలుపు ఆయాసము లేకుండా ఉంటుంది. రోడ్డునకు మధ్యలో
నిలబడి దూరము నుండి వచ్చె పెద్ద ట్రక్కును చూస్తె మొదట చిన్నదిగానే కదా కనబడుతుంది.
పట్టించుకోకుండానో పరధ్యానముగానో ఉండి దగ్గరకు వచ్చినపుడు చూస్తే ఊహకు అందకుండానే
చూచినవాడులోకానికి దూరమై పోవచ్చు. కాబట్టి దీర్ఘదర్శనము కలిగినచో ఆపదలను అధిగమించి
ఆనంద ఫలితములందుకొనవచ్చును.
ఇంతటి గొప్ప
విషయాన్ని రెండు పంక్తులలో భగవద్గీత ఎంత హత్తుకోనేవిధంగా చెప్పిందో చూడండి .
సమరమునకు
సర్వ విధములా సమాయత్తమైన తరువాత పాప భీతి యను భ్రాంతి లో మునిగిన బీబత్సునితో
కృష్ణు
డిట్లంటున్నాడు.
క్లైబ్యం
మాసమ గమః పార్థ నైతత్వయ్యు పద్యతే
క్షుద్రం
హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్విష్ఠ పరంతపా
తగని సమయమున
తలపులు మారెను
నపుంస
తత్వము నరముల నిండెను
దుర్బలత్వమును
దూరముచేయుము
పరంతపా
అదె పరమోత్కృ ష్టము
(స్వేచ్ఛానువాదము)
ఇక్కడ
పార్థ అని పరంతప అని రెండు సంబోధనలు కృష్ణుడు అర్జనునకు వాడుచున్నాడు. మొదటిదానికేమో, పృథ కుమారుడు (అంటే కుంతీదేవి మరోపేరు పృథ ) అన్నది
ఒక అర్థమైతే , వేరొక అన్వర్థములో పార్థివ
మైన శరీరము, అంటే మట్టిలో కలిసిపోయేది, కలిగిన అర్జునా ! అని. అంటే మానవులమైన
మనమందరమూ ఎదో ఒకరోజు మన్నులో కలిసి మిన్ను జేరవలసిందే అని అన్వయాత్మకముగా
చెబుతున్నాడు. అంటే లేనిపోని వ్యథలు వ్యామోహాలు పెట్టుకోకు. చేయవలసిన పనిని
సాకులుచేప్పి తప్పించుకోజూడకు, అని హెచ్చరించుచున్నాడు. ఇక పరంతపా అన్నది రెండవ సంబోధన. యుద్ధభూమిలో
వున్నారు కాబట్టి, అర్జనుడు
వీరాధి వీరుడు కాబట్టి, శత్రువులను తపపింపజేసే వాడా అంటున్నాడు. అంటే అతని సామర్థ్యము అతనికి గుర్తు
చేస్తున్నాడు. అసలు 'పరంతప' అన్న మాటకు శత్రు భయంకరుడు అన్న
అర్థమును తీసుకొనవచ్చును. అరిశాద్వార్గాములే మన నిరంతర అన్తఃశత్రువులు. వానిని
మట్టుబెట్టగలిగినా లేక కనీసము అణచివేయ గలిగినా మనము లక్ష్యసాధనకు అడుగు ముందునకు
వేసినట్లే! ఈ విధముగా సరియగు సమయములో సరియయిన సలహాను ఇచ్చుటనే కదా పాశ్చాత్యులు counselling అనేది. మన దేశములో ఎన్ని వేల
సంవత్సరములనుండి ఉన్నదో గమనించండి. అందుకే తన పంచ రత్న కీర్తనలలో త్యాగయ్య 'సమయానికి తగు మాటలాడి' అన్నాడు. విద్యార్థుల విషయములో , ధైర్యము నింపటము తల్లిదండ్రుల బాధ్యత.
ఏదయినా interview
కు వెళ్ళే సమయములో
ఈ శ్లోకము గుర్తుంచుకొంటే ఎంత ధైర్యమిస్తుందో ఎంత ధైర్యమొస్తుందో చూడండి. ఏ పని
ప్రారంభాములోనైనా పైన తెలిపినఈ శ్లోకము ఒక శిలా శాసనము.
మరియొక
సమస్యకు జవాబుతో మళ్ళీ కలుస్తాము.
Comments
Post a Comment