Posts

కాళిదాసు విక్రమార్కుని కాలము

  కాళిదాసు విక్రమార్కుని కాలము https://ajaraamarasukthi.blogspot.com/2024/10/blog-post_28.html కాలిదాసులు ఇద్దరు. ఒకరో విక్రమార్కుని కాలము వారయితే ఒకరు భోజరాజు కాలమువారు. విక్రముని కాలపు కాళిదాసు జ్యోతిర్విదాభారణము కలుపుకొని అభిజ్ఞాన శాకుతలాది బహు గ్రంధ రచయిత , వేరొకరు కాళికా వరప్రసాదులు. ఇపుడు విక్రముని కాలపు కాళిదాసును గూర్చి అతి క్లుప్తముగా తెలుసుకొనే ప్రయత్నమూ చేయుచున్నాము. శ్లో || ధన్వంతరి , క్షపణ కామరసింహ , శంకు , బేతాళ భట్ట , ఘటఖర్ప , కాళిదాసాః |, ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయాం , రత్నానివై వరరుచిర్నవ విక్రమస్య || " ఈ శ్లోకమునందు చెప్పబడిన ధన్వంతరి , క్షపణకుఁడు , అమరసింహుఁడు , శంకువు , బేతాళభట్టు , ఘటఖర్పరుఁడు , కాళిదాసుఁడు , వరాహమిహిరుఁడు మరియు వరరుచి అను తొమ్మండుగురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని ప్రసిద్ధి చెంది ఉన్నారు. వర్షే సింధుర దర్శనాంబర గుణైర్యాతే కలౌ సంస్థితే l మాసే మాధవ సంజ్ఞితే s త్రవిహితో    గ్రంధక్రియోపక్రమః ll సింధూర అంటే ఏనుగు అంటే అష్టదిగ్గజములు అంటే 8 దర్శన అంటే దర్శనములు అవి షట్ దర్శ నములు అంటే 6 \, అంబర అంటే ఆకాశము. ఆకాశం...

శరభంగ సుతీక్ష్ణ మహర్షులు

    శరభంగ సుతీక్ష్ణ మహర్షులు   https://ajaraamarasukthi.blogspot.com/2024/10/blog-post.html శరభంగ మహర్షి   శుద్దబ్రహ్మ పరాత్పర రాం ' అన్న రామనామావళి చదివే వారికి   ' శరభంగ సుతీక్ష్ణ మహర్షులు ' గుర్తుంటారు. ఎందుకంటే ఆ నామావలిలో     ' శరభంగ సుతీక్ష్ణార్చిత   రాం ' అన్న నామము కూడా వస్తుంది. ఈ మహర్షులనుగూర్చి మనకు రామాయణము ద్వారా తెలియ వస్తుంది. రామాయణము ద్వారా నాకు తెలిసిన మేరకు మీకు తెలియజేస్తాను.చాలామందికి వీరినిగూర్చి తెలిసియుండే అవకాశము తక్కువ కావున నేను ఈ ప్రయత్నమునకు గడంగినాను ,     సీతారమ లక్ష్మణులు అడవులలో ప్రయాణం చేస్తూ శరభంగ మగర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. వాళ్ళకు ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది.రథము అంతా మెరిసిపోతుంది. ఆ రథమునకు చుట్టూ   కొన్ని వందల మంది దేవతా సైనికులు నిలబడి ఉన్నారు. వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని , దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనము పక్కన వింజామరలు పట్టుకొని అప్సరసలు నిలబడి ఉన్నారు. కాని ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీ...