Posts

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు

రామాయణము - శ్రీరామ సార్వభౌముడు  https://ajaraamarasukthi.blogspot.com/2024/06/blog-post.html ఇతిహాసం అంటే అవును ఇది యథాతథముగా జరిగినది అన్నఅర్థము అందరికీ తెలిసినదే! ఇటువంటి ఇతిహాసములు అనబడే కావ్యములు వాల్మీకి వ్యాస మహర్షులు రామాయణ భారత రూపములలో మనకు ఇచ్చినారు. అందులో ఎన్నో విషయాలు విశేషాలు ఉన్నాయి. ఒక అవగాహనా బద్ధమైన ఆలోచనతో చదివితే నేడు మనము చదివించే అనేక ఆంగ్ల మాధ్యమ పాఠశాల, కళాశాలల శిక్షణా విషయాలు ఎన్నో మనకు ఎదురౌతాయి. అవి అన్నీ కాక, క్రమశిక్షణ, నీతి, నిజాయితి, ధర్మవర్తన, అవ్యాజ అమలమౌ అభిమానము, ద్వేశారాహిత్యము మొదలగు ప్రవర్తనకు సంబంధించిన ప్రబోధములు ఎన్నో కానవస్తాయి. అవి ఈ క్రింది విధముగా ఉన్నాయి. Human Anthropology - మానవ వికాస శాస్త్రము Geography -  భూగోళ శాస్త్రము Human Geography -  మానవ భూగోళ శాస్త్రము Political Administration -  రాజ్కనీతి శాస్త్రము Military Administration -  సైన్య నియంత్రణ శాస్త్రము Defense Strategies -  సైనిక వ్యూహా శాస్త్రము Architecture -  వాస్తు శాస్త్రము Communication Engineering -  ప్రసార శాస్త్రము International Rela...

మోహము – ధర్మమార్గము

  మోహము – ధర్మమార్గము https://ajaraamarasukthi.blogspot.com/2024/05/blog-post_22.html కాశీలో గంగానదీ తీరమున , మణికర్ణికా ఘట్టము   ఒడ్డున ఉదాసీనముగా ఒక వ్యక్తి ఉండేవాడు. ఒంటిపై చొక్కా ఉండేదికాదు. అందుచే మేనిపై ఉన్న యజ్ఞోపవీతము అగుపించేది. అదే దారిన ఒక పండితుడు ప్రతిరోజూ అతనిని చూస్తూ పోయేవాడు. ఎక్కడికీ, ఆటను ఉత్కంఠత భరించలేక అతనిని   సంస్కృతములో “ఎందుకు ఏ అనుష్ఠానము చేసుకోకుండా అట్లు కూరుచొనియుంటావు” అని అడిగినాడు. అందుకు జవాబుగా ఆ వేదాంతనిధి ఈ విధముగా సంస్కృత శ్లోకరూపములో జవాబు చెప్పినాడు. మృతా మొహమాయీ మాతా జాతస్య పుత్ర వ్యామోహయః l సూతకం వర్తతే నిత్యం కథం సద్యోపాసనే ll నాలో అనుదినమూ మొహమమయమైన తల్లి మరణింతూ వుంది. వ్యామోహమనే పుత్రుడు ఉదయించుచున్నాడు. ఈవిధముగా ప్రతిదినమూ సూతకముతో సతమముచున్న నేను జపతపాలకు అర్హుడను కాలేను కదా! అన్నాడు. ఆమాటతో ఆపండితుడు ఆ వేదాంతనిధి పాదాలకు దండప్రణామము ఆచరించి ‘మహానుభావా! అనుష్ఠానమున కన్న ముఖ్యమయిన స్వార్థము ఆశలను జయించుట అన్నది సాధించి అనుష్ఠానమునకు గడన్గుతాను అని చెప్పి శెలవు తీసుకొన్నాడు. స్వస్తి.

పతజలి విరచిత చరణ శృంగ రహిత స్తోత్రము

  పతజలి విరచిత చరణ శృంగ రహిత స్తోత్రము https://ajaraamarasukthi.blogspot.com/2024/05/blog-post.html ఈకాలము వేలు లక్షలు కోట్లు సంపాదించుచున్న 'యోగా' కు మూల పురుషుడు పతంజలి. ఆ మహనీయుడు లోక కల్యాణమును కోరుకొన్నాడు కానీ నేటి స్వార్థపరుల మాదిరి ధనార్జన కోరుకోలేదు. ఆయన ఉదారముగా మనకు అందించిన జ్ఞానమును, నేడు మంచినీళ్ళు అమ్ముకొన్నట్లు, అమ్ముకొంటున్నారు. ఇది శిగ్గు పడవలసిన విషయము. ఎవరు అన్నది మీ విచక్షణకే వదలుచున్నాను. ఈ స్తోత్రము కూడా ఆయన రచనే. ఇందులో అతి కఠినమైన ఒక ప్రత్యేకత వుంది. చదివినవారికి తెలుస్తుంది. జిజ్ఞాసువులు ఈ స్తోత్రమును తప్పక చదవండి. చదువుట, తెలుసుకొనుట, చర్చించుట, గమనించుట, వీనివల్ల మన విజ్ఞానము అభివృద్ధియౌతుంది. మనము post చేసే video ల వల్ల మాత్రము కాదు. అవి కేవలము క్షణికానందము సమకూర్చునవి. చెప్పినానని తప్పుగా తలువవద్దు.    మిగిలినది మళ్ళీ''''''' మొట్ట మొదట  –  పతంజలి ,  శివుని వాహనమైన నంది  –  వీరిరువరికి సంబంధించిన  ఒక  చాటుకథను చెప్పాలి. పతంజలి మహర్షి యోగశాస్త్రమును రచించిన మహాముని.  అతనికి  ఒకనాడు పరమేశ్వరుని సందర్శ...