श्रीकामाक्षीस्तोत्रम् \ కామాక్షీ స్తోత్రము (ఆదిశంకర విరచితము)
श्रीकामाक्षीस्तोत्रम् \ శ్రీకామాక్షీ స్తోత్రము (ఆదిశంకర విరచితము) https://ajaraamarasukthi.blogspot.com/2023/09/1.html 32 సంవత్సరాల వయసులో ఎన్నో వేదాంత వాదనలు, పాదచారులై ముమ్మారు భారతఖండ ప్రదక్షిణము, అంతులేని దేవతా స్థావ, స్తోత్ర రచనలు చేయటము మరుగున పడిన శిలావిగ్రహములను వెదకి తోడి తీసి పునః ప్రతిష్ఠ చేయించడము దక్షిణ దేశ ప్రతినిధిగా కాశ్మీర పీఠమునలంకరించడము ఒకటికాదు చెప్పుకొంటూ పొతే ఎన్నో,,,ఎన్నెన్నో!అట్టి అపర శంకర స్వరూపమైన ఆది శంకరులకు నమస్కరించి, వారిచే వ్రాయబడిన కంచి కామాక్షీ స్తోత్రమునకు భావము వ్రాయుచున్నాను, నాది కేవలము అత్యల్ప ప్రజ్ఞ. మీకు మంచి ఈ భావములో అగుపించితే అది ఆ శంకరుల దయ, కల్పానోకహ పుష్ప జాల విలసన్నీలాలకాం మాతృకామ్ కాన్తాం కఞ్జ దలేక్షణాం కలి మల ప్రధ్వంసినీం కాళికామ్ । కాంచీ నూపుర హారదామ శుభగాం కాంచీ పురీ నాయికామ్ కామాక్షిం కరి కుంభ సన్నిభ కుచాం వందే మహేశ ప్రియామ్ ॥1॥ తల్లి కంచి కామాక్షీ దేవిని ఎంత సుందరముగా స్వయముగా వీక్షించి వచ్చినరీతి అభివర్ణించుచున్నారు. ఒక్కసారి కనులు మూసుకొని అంతర్ముఖులమైతే మనో ఫలకముపై మాత చిత్రముప్రకటితమౌతుంది. అమ్మ కల్పానోకమ...