Posts

చాణక్య నీతి

  చాణక్య నీతి https://ajaraamarasukthi.blogspot.com/2022/09/blog-post.html శ్లో . మూర్ఖశిష్యోపదేశేన దుష్టస్త్రీ భరణేన చ l దుఃఖితైః సంప్రయోగేణ పండితో-ప్యవ సీదతిః ll   అర్థము :- మూర్ఖశిష్యోపదేశేన = బుద్ధిహీనుడైన శిష్యుని చదివించుటచేతను లేక ధర్మసంబంధ విషయముల నుపదేశించుట చేతను , చ = మఱియు , దుష్టస్త్రీభరణేన = వ్యభిచారిణియు , కఠినముగా మ్లాడునదియు నగు స్త్రీని భరించుట అనగా  పోషించుటచేతను , దుఃఖితైః = నానాప్రకారములగు వ్యాకుల చిత్తులు, రోగపీడితులు, దారిద్ర్య పీడితులు అగు అత్యంత దుఃఖితులు మరియు  ఆత్మీయుల వియోగముచే బాధపడు వానితోనూ, ధననాశాదులచే దుఃఖితులైనట్టి వానితోను , సంప్రయోగేణ = వ్యవహారముచేయుటచేత , పండితః అపి = బుద్ధిమంతుడైనవాడు కూడ , అవసీదతి = దుఃఖితుడై కష్టముల ననుభవించును.   తాత్పర్యము :- బుద్ధిహీనుడైన శిష్యునకు ధర్మోపదేశము చేసినను , వ్యభిచారిణి , కఠినభాషిణియైన స్త్రీని పోషించినను , నానాప్రకారములగు వ్యాకుల చిత్తులు, రోగపీడితులు, దారిద్ర్య పీడితులు అగు అత్యంత దుఃఖితులు మరియు  ఆత్మీయుల వియోగముచే బాధపడు వానితోనూ, ధననాశాదులచే దుఃఖితులైనట్టి వానితో వ్యవహారము...

అజరామర సూక్తి - 12

  అజరామర సూక్తి   –   3 3 1 अजरामर   सूक्ति   –   3 31 Eternal Quote – 33 1 यद्वाञ्छति   दिवा   मर्त्यः   वीक्षते   वा   करोति   वा  । तत्स्वप्नेऽपि   तदभ्यासात्   ब्रूते   वाथ   करोति   वा  ॥  -  पञ्चतन्त्र ,  मित्रभेद యద్వాంఛతి దివా మర్త్యః వీక్షతేవా కరోతివా l తత్స్వప్నే ऽ పి తదభ్యాసాత్ బ్రూతేవాథ కరోతివా ll – పంచతంత్రము – మిత్రభేదము పగటిపూట మానవుడు కోరుకున్నది ,  చూసినది లేదా చేసేది ,  అతను కలలో కూడా ,   సాధన వల్ల  తన ప్రమేయము లేకుండానే       మాట్లాడతాడు లేదా చేస్తాడు. ఇక్కడ కవి నిదురించే ప్రతివానికీ తానూ మనసు పెట్టి చేసిన ఉదంతములు కలోకి  వస్తాయని చెప్పుటలేదు. అది అతని నిరంతర పరిశ్రమ లేక అభ్యాసము పై  ఆధారపడియుంటుంది. ఒక వాస్తవమగు ఉదాహరణ మీముందు ఉంచుతాను. గనితమున అఖండ ప్రజ్ఞా  పాటవములు కలిగిన శ్రీయుతులు శ్రీనివాస రామానుజం గారు తనకు సంక్రమించిన  సామర్థ్యం అంతా తమ ఇలవేల్పు దేవత అయిన నామగిరి ప్రసాదించినదేనని  రామానుజన్ బల...