Posts

Showing posts from November, 2025

బర్బరీకుడు

బర్బరీకుడు https://ajaraamarasukthi.blogspot.com/2025/11/blog-post.html బర్బరీకుని వృత్తాంతము వ్యాస భారతమున లేదు. అయినా ఆ ఇతిహాసమును గూర్చి ఎక్కువమందికి తెలియని విశేషముల గూర్చి తెలిపి బర్బరీక వృత్తాంతము ప్రారంభించుతాను. బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడినాడు. అయినా భారతము పంచమ వేదము. ఆ మాటను పుష్టి చేస్తూ వ్యాసులవారే ఈ విధముగా చెప్పినారు: ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ। యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్॥ మానవ జీవితము చతుర్విధ పురుషార్థ సంయోజనము. మహాభారతమున ఈ పురుశార్తములకు సంబంధించి న ఏ సందేహమును ఈ మహాభారతము నివృత్తి చేయలేక పోతే ప్రపంచ సాహిత్యంలోని ఏ ఉద్గ్రంధము కూడా బదులు తెలుపలేదని నొక్కి వక్కాణించినారు. వ్యాస మహాభారతము Milton వ్రాసిన Paradise Lost కన్నా రాశిలో 4 ½ రెట్లు పెద్దది. ఇందులోని శ్లోకముల సంఖ్య ఒక లక్ష ఇరవైఐదు వేలు. కాంచీ పురము లోని శ్రీమాన్ తాతాచార్యుల వారు ఈ మొత్తము శ్లోకములను ఒక నలభై సంవత్సరముల క్రితం దివంగతులగువరకూ గుర్తు పెట్టుకొరామ్ సాగరోపమంనియుండినారని ప్రతీతి. మహాభారతములో ...