హిరణ్య వర్ణా (సూర్య స్తుతి)
హిరణ్య వర్ణా (సూర్య స్తుతి) https://ajaraamarasukthi.blogspot.com/2025/08/ll-ll-ll-ll-ll-ll.html హిరణ్యవర్ణా హితకర హేళీ హేమంతాంగణ హేల వయాళి ధ్వాంతధ్వంస దయామయ విరళి నమామి దినకర నవకరావళీ ll హిరణ్య ll జగతీద్యుమణీ జనహిత సరణి ప్రభాత అరుణీ ప్రదీప ధారుణి ద్యుతిమయ క్రేణి దుర్జన అరణి విదిత ప్రభామణి వేదశిరోమణి ll హిరణ్య ll జగన్నాయకా జనహిత దాయక గోగణ ధారక కుటిల విదారక నిరత ప్రకాశక నిదాఘ కారక నిత్యారోగ్య నితాంత ప్రదాయక ll హిరణ్య ll బంగారు ఛాయ గలిగినవాడా! హితమును కూర్చు హేళి అనగా సూర్య దేవుడా! ధ్వాంతము అనగా అంధకారమును పటాపంచలు చేసే విరళి అనగా విస్తారమైన దయ కలిగినవాడా, దినమునకు కారణమైన సరికొత్త కాంతి పుంజమును భూమిపై ప్రతి రోజూ ప్రసరింపజేయువాడా!నమస్సులు స్వామీ. ఈ సకల చరాచర భూయిష్టమగు జగత్తునకు వెలుగునొసగే ఆకాశ రత్నమా!ప్రజా శ్రేయస్సే నీ సరణి, అనగా నీ ధర్మము అని అన్వయము,గా కలిగినవాడా! ప్రాతఃకాలమున అరుణకాంతులతో శోభిల్లువాడా! ఈ భూమండ లమును వెలుగుతో నింపువాడా! క్రేణి అనగా అత్యున్నత పదముపై నిలచి కాంతిని విరజిమ్మువాదడా !దుర్జనులను, అరణి అనగా దగ్ధము చేయు గుణము కలిగినవాడా!ప్రభాతమణిగా ప్రశస్తి చెందినవాడ...