సంస్కృత సంస్కృతి(19.11.2013)
సంస్కృత సంస్కృతి(19.11.2013) https://cherukurammohan.blogspot.com/2013/11/blog-post.html సంస్కృతం=సమ్యక్ +కృతం అనగా సంపూర్ణముగా సంస్కరింప బడినది అని అర్థము. సృష్ట్యాదినుండి అది ధ్వనిరూపములో ఆకాశాన్ని అంటిపెట్టుకొనే వుంది. ధ్వని శబ్ద సంకలనమే. సూత్రాను సారిణి యైన శబ్ద సంకలనమే భాష. వ్యాకరణము ఛందస్సు భాషామతల్లి స్తన్యములు అంటారు. బుడ్డిపాల కలవాటుపడి తల్లి పాలు త్రాగే అవకాశము పోగొట్టుకొన్న వానికి తల్లి పాలరుచి తెలిసే అవకాశమేదీ! అపౌరుషేయమైన వేదము యేభాషలో ఉన్నదో ఆ భాష కూడా అపౌరుషేయమే కదా. ఆవేద భాషే ఆది భాష , ఆ ఆది భాషే సంస్కృతము. రామాయణము ఆది కావ్యము. వేదభాష గా బ్రహ్మ నుండి దేవతలు ఋషులు వారి నుండి భూలోక వాసులకు ఈ భాష సంక్రమించినది. వేదానికి షడంగములైన శిక్ష , వ్యాకరణ , ఛందస్ , నిరుక్త , జ్యోతిష కల్పములలో వ్యాకరణము కలదు ఆ వ్యాకరణమును విడమరచి విశధీకరించిన మొదటి మహానుభావుడు పాణిని. పాణిని మహర్షి తన ' అష్టాధ్యాయి ' అను వ్యాకరణ ప్రామాణిక సూత్రగ్రంథమందు ఈ క్రింది శ్లోకాన్ని తెలియ...