Posts

Showing posts from April, 2025

ధర్మచింతకులు తెలియ వలసిన విషయాలు

  ధర్మచింతకులు తెలియ వలసిన విషయాలు సప్తర్షులు  కశ్యపో త్రిః భరద్వాజూ విశ్వామిత్రోచ గౌతమః l వషిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః తథా ll ఈ ఏడుగురు వైవస్వత మన్వంతరపు సప్తర్షులు. **************************** మనకు జంతువులకు గల తేడా  ఆహార నిద్రా భయ మైధునంచ సామాన్యమేతత్ పశుభిన్నరాణాం l ధర్మోహితేషామధికో విశేషాం ధర్మేన హీనః పశుభి స్తమానాః ll ఆహారము, నిద్ర, భయము, మైధునము, పశువులకు మనుషులకూ సమానమే! కానీ, ధర్మవర్తనము, దానాగుణమును కలుపుకొని, మరియు సాటిమానవ హితము అన్నవి  రెండూ మానవుల కొరకు పరమాత్మ ఏర్పరచిన సుగుణాలు.  పాటించితే దైవ ప్రియులము లకుంటే దేవనామప్రియులం(అంటే మూర్ఖులము అనగా జంతు సమానులమే! )******************************** జగద్గురువు ఆదిశంకరులవారు  దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే l సయేవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్యనాయకః ll దూసహతాచారములను ఖండించి, శిష్టాచారములను ప్రతిష్ఠించుటకు భూతలము పావనము చేయనుద్భవించిన  జగద్గురువులు శంకరులవారు సాక్షాత్ కైవల్యాణాయకూడగు శంకరుడు గాక వేరెవ్వరు? **************************** ఒక జిజ్ఞాసువు వ్యాకరణమనకు సంబంధించి ఒక ప్రశ్న ...

జంతూనాం నరజన్మ దుర్లభం

  జంతూనాం నరజన్మ దుర్లభం https://ajaraamarasukthi.blogspot.com/2025/04/blog-post.html పైన తెలిపిన నానుడి సాధారణముగా అందరికీ తెలిసినదే, కానీ పూర్తి పాఠమును విన్నవారు తక్కువగానే   భావయుక్తముగా సకల మానవ వర్గమునకు తెలియజేయు ఉద్దేశ్యముతో మీముందు ఉంచుచున్నాను. ‘దీనివల్ల ముక్తి వచ్చినా రాకున్నా ‘సత్యం వద’ ‘ధర్మం చర్య’ అన్న రెండు నియమాలను a మనము జన్మ సార్థక్యతను సార్థక్యతను సాధించినట్లే! శ్లో. జంతూనాం నరజన్మ దుర్లభ మతఃపుంస్త్వం తతో విప్రతా తస్మాత్ వైదికధర్మ మార్గపరతా   విద్వత్వమస్మ్తాత్పరం | ఆత్మానాత్మ వివేచనా స్వనుభవో బ్రహ్మత్మనా సంస్థితిః ముక్తిర్నోశతకోటి కోటి జన్మ సుకృతైః పుణ్యైర్వినా   లభ్యతే || ప్రాణులలో నరజన్మ పురుష జన్మ, అందునా బ్రాహ్మణ జన్మ, అందునా వైదిక ధర్మావలంబన, అందునా పరమాత్మకు సంబంధించిన విద్వత్తును సాధించుట, ,దానివలన ఆత్మానాత్మ వివేచన దానిచే స్వానుభవము, దానిచే బ్రహ్మైక్యము సిద్ధించుటకు దానిచే ముక్తిని పొందుటకు శతకోటి జన్మల పుణ్యఫలము ప్రాప్తించవలసియుంటుంది.